Old City: పాతబస్తీలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పురానాపూల్ సమీపంలోని కామాటిపురలో టెంట్ హౌజ్ డెకరేషన్ చేసే సామాగ్రి కార్ఖానాలో ఈ ప్రమాదం జరిగింది. రెండు సిలిండర్లు పేలడంతో మంటలు వ్యాపించాయి. ఈ సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్‌కు చేరుకుంది.
రెండు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. చుట్టుపక్కలా గోదాములు ఉన్నట్టు తెలిసింది. మంటలు ఉధృతమవగానే స్థానిక దుకాణదారులు, ప్రజల భయంతో పరుగుపెట్టారు. సమీపంలోని ఇతర గోదాములకూ మంటలు వ్యాపించే ముప్పును గ్రహిస్తూ ఆందోళనచెందారు. అయితే, సకాలంలో ఫైర్ సిబ్బంది స్పాట్‌కు వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. డెకరేషన్ సామాగ్రి కావడంతో మంటలు అంతకంతకూ పెరిగాయి. ఇంకా మంటలు ఇంకా అదుపు లోకి రాలేవు.
దట్టమైన పొగ ఈ సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. భవనంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి అధికారులు ఏకంగా జేసీబీని ఉపయోగించాల్సి వచ్చింది. మంటలు అంటుకున్న భవనం గోడలను జేసీబీతో బద్ధలు కొట్టించి ఫైర్ సిబ్బంది లోనికి వెళ్లింది. ఆ మంటల్లో చిక్కుకున్న పలువురిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది.
Also Read: Independence Day: అక్కడ జాతీయ జెండా ఆవిష్కరించేది సీఎం కాదు.. మంత్రే!
పాతబస్తీలో తరుచూ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికారులు నిత్యం అలర్ట్‌గా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఇది వరకే ఆదేశాలు జారీ చేసింది. తాజాగా మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అయితే.. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రాణ నష్టం జరగలేదు.