BigTV English

Rana Daggubati: యాప్‌లో పరిచయమైన అమ్మాయిపై రానా సంచలన వ్యాఖ్యలు

Rana Daggubati: యాప్‌లో పరిచయమైన అమ్మాయిపై రానా సంచలన వ్యాఖ్యలు

Hero Rana Sensational Comments On The Girl He Met On The App: టాలీవుడ్ హీరో దగ్గుపాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గాంభీరమైన దేహ ధారుఢ్యంతో ఆడియెన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటాడు. అంతేకాదు టాలీవుడ్‌లో రిలీజైన లీడర్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఐడెంటీటీని సంపాదించుకున్నాడు. ఆ తరువాత వరుసగా నేనే రాజు, నేనే మంత్రి, విరాటపర్వం వంటి మూవీస్‌తో హిట్స్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు.అంతేకాకుండా బాహుబలి ఫస్ట్‌, బాహుబలి 2 మూవీస్‌తో రానా రేంజ్ మరింతగా పెరిగిపోయింది.


అయితే రానా ఇటీవల రానానాయుడు అనే సిరీస్‌ని తన బాబాయ్ విక్టరీ వెంకటేష్‌తో కలిసి యాక్ట్ చేశాడు. ఈ సిరీస్ బ్లాక్‌బస్టర్ హిట్‌ని అందుకున్నాడు. ప్రస్తుతం రానా నాయుడు సీక్వెల్‌లో యాక్ట్ చేస్తున్నాడు. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రిలీజ్ చేశారు. తాజాగా రానా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు సక్సెస్ సాధించడంతో రానా ఈ మూవీ టీమ్‌తో చిట్‌ చాట్ నిర్వహించాడు. అంతేకాకుండా ఈ క్రమంలో తన వివాహం గురించి చెప్పుకొచ్చాడు. తన పెళ్లి ఎలా జరిగిందో రానా రివీల్ చేస్తూ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు.

Also Read: దేవర మూవీ ఆయుధ పూజ సాంగ్ హైప్ క్రియేట్ చేయడం పక్కానా..!


కరోనా టైమ్‌లో కొత్త వాళ్లతో పరిచయం ఏర్పరుచుకోవాలని పార్టీ అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఇందులో అసలు ట్విస్ట్‌ ఏంటంటే.. ఈ యాప్ చూస్తుంటే మిహికా పరిచయం అయిందని.. ఆ తరువాత ఒక వారానికే ఇద్దరం వివాహం చేసుకున్నాం. అప్పుడు మిహికా ఇది నిజమా.. లేక అబద్ధమా వీడు మెంటలోడా… అని కన్ప్యూజ్ అయి ఉంటుంది. ఇదే నా లైఫ్‌లో వైల్డెస్ట్ ఆలోచన అంటూ చెప్పాడు. ప్రస్తుతం రానా చేసిన కామెంట్స్ కాస్త నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయంపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఏందీ ఇదంతా నిజమా అంటూ షాక్‌కి గురి అవుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×