Hyderabad: హైదరాబాద్ నగర యువత మత్తులో ఊగుతోంది. పోలీసులు ఎంత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా.. మత్తుగాళ్లకు కళ్లెం వేయలేకపోతున్నారు. గంజాయి సేవించిన వ్యక్తి మత్తులో బీభత్సం సృష్టించాడు. ఓ వ్యక్తి తన ఫ్యామిలీతో కారులో వెళ్తుండగా వాహనాన్ని ఆపి హల్‌చల్ చేశాడు.
కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేసిన ఘటన
వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి కారులో వెళ్తుండగా, ఆ యువకుడు వారి వాహనాన్ని అడ్డగించి బానెట్‌పైకి ఎక్కాడు. నడిరోడ్డుపైకి వచ్చి అరుస్తూ, కార్లను అడ్డగించి హల్‌చల్ చేశాడు. పిచ్చెక్కిన వ్యక్తిలా మాట్లాడుతూ వీరంగం సృష్టించాడు. కారులో ఉన్న పిల్లలు, మహిళలు భయంతో షాక్‌కు గురయ్యారు. ఆ యువకుడిని కారు దిగి వెళ్లిపోమని చెప్పినా వినలేదు. చివరకు అక్కడి స్థానికులు జోక్యం చేసుకుని.. అతడిని కారు దిగి వెళ్లేలా చేశారు.
ప్రజలలో ఆందోళన
ఈ సంఘటనపై వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రజలు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇటీవల నగరంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం పెరిగిపోయింది, పోలీసులు ఇలాంటి వాళ్లను గుర్తించి వారిని కఠిన శిక్షలు విధించాలని కోరుతున్నారు.
పోలీసుల స్పందన – ఆచూకీ కోసం గాలింపు
ఈ సంఘటనపై స్పందించిన పోలీసులు, యువకుడి ఆచూకీ కోసం సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. అతడు ఎవరు? ఎక్కడి వారు? అనే విషయాలపై దర్యాప్తు జరుగుతోంది. వాహనదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి.. కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఇలాంటి సంఘటనలు మరల జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
డ్రగ్స్ ముఠాల కదలికలపై నిఘా
ఈ నేపథ్యంలో నగరంలో.. గంజాయి సరఫరా చేస్తున్న ముఠాలపై.. పోలీసులు నిఘా ఉంచుతున్నారు. ఇప్పటికే పలుచోట్ల రైడ్స్ నిర్వహించి గంజాయి పట్టుకున్న ఘటనలు ఉన్నాయి. కానీ తక్కువ మొత్తాల్లో విక్రయించే వ్యక్తులు ఇంకా పట్టుబడటం లేదు. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత గంజాయికు బానిసలవుతున్న ఘటనలు.. తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
గంజాయి మత్తులో యువకుడు హంగామా..
హైదరాబాద్ మూసాపేట్ లో ఘటన
గంజాయి మత్తులో ఓ కారును ఆపి, దానిపై ఎక్కి హల్‌చల్ చేసిన యువకుడు
కారులో ఉన్న ఫ్యామిలీ భయంతో కేకలు pic.twitter.com/C7G1HCITVj
— BIG TV Breaking News (@bigtvtelugu) July 23, 2025