E-Paper
Advertisement

పాలమూరులో నిబంధనలను విరుద్ధంగా.. ప్రభుత్వ ఉద్యోగులు!

పాలమూరులో నిబంధనలను విరుద్ధంగా.. ప్రభుత్వ ఉద్యోగులు!
Advertisement

Government Employees: ప్రభుత్వానికి, ప్రజలకు వారదులుగా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను ప్రజలకు చేరవేయడంలో వారిదే కీలక పాత్ర ..కానీ వారే నిబంధనలకు పాతర వేస్తున్నారు. ఉద్యోగం ఒకచోట చేస్తారు, నివాసం మరో చోటుంటారు. దీంతో సమయానికి రారు.. పనిచేయరు.వృత్తిరీత్యా బాధ్యతలు చేపట్టి మంచి పనితీరు కనబరుస్తూ ప్రజలకు సేవ చేయడం కోసం అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలి. ఉద్యోగం చేసే చోట నివాసం ఉండాలి. నిబంధనలను విడిచిన పెడుతూ జిల్లా, పట్టణ కేంద్రాలలో నివాసం ఉంటున్నారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు చేరవేయడంలో ప్రభుత్వ ఉద్యోగులదే కీలక పాత్ర.

నిబంధనలకు విరుద్ధం..

ఉమ్మడి పాలమూరు ూరు జిల్లా వ్యాప్తంగా 70 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దీంతో అవసరమైన సమయంలో వారు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ పనుల నిమిత్తం దూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే కార్యాలయాలకు వచ్చే ప్రజలు సంబంధిత అధికారి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తోంది.

వచ్చేదే లేటు.. ముందే తిరుగు ప్రయాణం

Advertisement

ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న అధికారులు వారు పనిచేసే ప్రాంతాలకు దూరంగా ఉండటం వల్ల కార్యాలయానికి సకాలంలో రాలేకపోతున్నారు.కొంత మంది ఉద్యోగులు సాయంత్రం వేళలో వెళ్లాల్సిన సమయం కంటే ముందుగానే వెళ్తున్నారు. దీంతో పని నిమిత్తం ప్రజలు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.

ప్రజల ఆరోపణలు

మండలాలలోని రెవెన్యూ, మండల పరిషత్ ,విద్య, వైద్య ,వ్యవసాయ, ఇతర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు వందల సంఖ్యలో పనిచేస్తుండగా పని చేస్తుండగా ప్రధానంగా తహసిల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ, ఉపాధ్యాయులు, రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు వారికి అనుకూల ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. సమయానికి కార్యాలయాలకు ఉద్యోగులు రావడం లేదని ప్రజల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. కానీ సంఘ నివాసం ఉండేందుకు ప్రభుత్వం కేటాయించే నిధులను ఇతర ఆలవైన్స్ లను దుర్వినియోగ పరుస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Advertisement

Also read: ఓ మధ్యతరగతి ఆలోచించండి.. అప్పుల పాలు కాకండి!

Tags

Related News

మిస్ తెలంగాణ-2026 విజేత.. కొత్త లీలాకు ఘన సన్మానం

చేతికొచ్చిన వరి పంట కోసం.. ట్యాంకర్ల నీళ్లతో పోరాటం!

ఖమ్మం ప్రజలకు గుడ్ న్యూస్.. దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంపు?

సిరిసిల్లలో చనిపోయిన వారి పేర్లతో లేబర్ కార్డుల దందా.. బీమా సొమ్ము మాయం

పోటీ పరీక్షల అభ్యర్థులకు కేటీఆర్ గుడ్ న్యూస్.. కరెంట్ అఫైర్స్ స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ!

భార్యాభర్తల బెడ్రూం సంభాషణలు వినడమేనా మీ డిగ్నిటీ? బండి సంజయ్

కవితకు రేవంత్ స్క్రిప్ట్ అక్కర్లేదు.. మీ బాగోతాలన్నీ ఆమెకు తెలుసు: ఆది శ్రీనివాస్

Big Stories

Advertisement
×