E-Paper
Advertisement

తెలంగాణ ఆర్టీసీ మూడు యాప్‌ల దందాపై ప్రయాణికుల ఫైర్!

తెలంగాణ ఆర్టీసీ మూడు యాప్‌ల దందాపై ప్రయాణికుల ఫైర్!
Advertisement

Telangana RTC: టెక్నాలజీ పెరిగే కొద్దీ సేవలు సులభతరం కావాలి. కానీ తెలంగాణ ఆర్టీసీలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజూ 60 లక్షల మంది.. ఒక్క హైదరాబాద్‌ సిటీలోనే 25 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుంటారు. వీరి కోసం ఆన్‌లైన్ సేవలు తెచ్చిన ఆర్టీసీ.. అన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేకుండా మూడు యాప్‌లతో గందరగోళం సృష్టిస్తోంది. బస్సు లైవ్ ట్రాకింగ్ కోసం గమ్యం యాప్, దూరప్రాంత టికెట్ల కోసం ఆర్టీసీ అఫీషియల్.. సిటీ బస్ పాస్‌ల కోసం మీ టికెట్ యాప్‌లను వాడాల్సి వస్తోంది. దీనికి తోడు గమ్యం యాప్‌లో బస్సుల సమాచారం సరిగ్గా రావడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు.

మాన్యువల్ టికెట్ల నుంచి..

గత నాలుగేళ్లలో టెక్నాలజీ విషయంలో ఆర్టీసీ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మాన్యువల్ టికెట్ల నుంచి క్యూఆర్‌ టికెట్ల వరకు.. బస్ పాస్‌ల నుంచి లైవ్ ట్రాకింగ్‌ వరకు సేవలన్నీ డిజిటల్‌గా మారాయి. బస్ భవన్‌లో అప్‌గ్రేడ్ చేసిన కమాండ్ కంట్రోల్‌ ద్వారా.. బస్సులు, డ్రైవర్లు, రద్దీ, బస్‌స్టేషన్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు. రోజూ లక్షలాది మంది ఆధారపడే ప్రజా రవాణాలో ఈ డిజిటల్ సేవలకు ఆదరణ కూడా పెరుగుతోంది.

ఒక్క లాగిన్‌తో..

Advertisement

కానీ టెక్నాలజీ అంటే యాప్‌లు పెరగడం కాదు.. ప్రయాణికుడి పని సులభం కావడం. ఒక్క లాగిన్‌తో బస్సు ఎక్కడుంది.. టికెట్ ఎలా తీసుకోవాలి.. పాస్ ఎలా పొందాలి.. అన్నీ తెలిసేలా ఒకే ప్లాట్‌ఫామ్‌ ఉంటే పని మరింత ఈజీ. అంతేకాదు.. గమ్యం యాప్‌లో బస్సుల కదలికల సమాచారం ఎప్పుడూ కచ్చితంగా ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్‌కు దీటుగా పోటీ పడాలంటే.. ఈ మూడు యాప్‌లను కలిపి ‘ఒకే యాప్ – అన్ని సేవలు’ అనేలా మార్చాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: పోటీ పరీక్షల అభ్యర్థులకు కేటీఆర్ గుడ్ న్యూస్.. కరెంట్ అఫైర్స్ స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ!

Tags

Related News

పాలమూరులో నిబంధనలను విరుద్ధంగా.. ప్రభుత్వ ఉద్యోగులు!

మిస్ తెలంగాణ-2026 విజేత.. కొత్త లీలాకు ఘన సన్మానం

చేతికొచ్చిన వరి పంట కోసం.. ట్యాంకర్ల నీళ్లతో పోరాటం!

ఖమ్మం ప్రజలకు గుడ్ న్యూస్.. దుమ్ముగూడెం ఆనకట్ట ఎత్తు పెంపు?

సిరిసిల్లలో చనిపోయిన వారి పేర్లతో లేబర్ కార్డుల దందా.. బీమా సొమ్ము మాయం

పోటీ పరీక్షల అభ్యర్థులకు కేటీఆర్ గుడ్ న్యూస్.. కరెంట్ అఫైర్స్ స్టడీ మెటీరియల్ ఆవిష్కరణ!

భార్యాభర్తల బెడ్రూం సంభాషణలు వినడమేనా మీ డిగ్నిటీ? బండి సంజయ్

Big Stories

Advertisement
×