Yakutpura Fire breaks out: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులు పేలాయి. దీంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అసలేం జరిగింది? ఎక్కడ అన్న డీటేల్స్ లోకి ఒక్కసారి వెళ్దాం..
యాకత్‌పురా రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ ఇంట్లో అర్థరాత్రి నిల్వ చేసిన టపాసులు పేలాయి. అయితే టపాసులకు సమీపంలో గ్యాస్ సిలిండర్ ఉండడంతో దానికి మంటలు వ్యాపించాయి. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే అప్రమత్తమయ్యారు బిల్డింగ్‌లోని వ్యక్తులు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ALSO READ: పొలిటికల్ బాంబ్ 3: ఈడీకి అప్రూవర్‌గా అమోయ్ కుమార్? 3 రోజుల విచారణ అందుకేనా?
ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఒకరిద్దరి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని మలక్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన మోహన్‌లాల్ అనే వ్యక్తి ఇంట్లో జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇంటి లోపల చిక్కుకున్న ముగ్గురిని కాపాడే ప్రయత్నం చేశారు. చివరకు అతి కష్టం మీద వారిని బయటకు తీసి ఆంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై రైన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దీపావళి సమీపిస్తుండడంతో చాలామంది ఇళ్లకి టపాసులు తీసుకొస్తున్నారు. టపాసులతో జాగ్రత్త అంటూ ముందుగా హెచ్చరిస్తున్నారు అధికారులు. అయినా నిర్లక్ష్యం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఇంట్లో టపాసులు.. చెలరేగిన మంటలు..
హైదరాబాద్ పాతబస్తీ యాకత్ పురా రైల్వే స్టేషన్ సమీపంలో మోహన్ లాల్ ఇంట్లో నిల్వ ఉంచిన టపాసులు
గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు#Hyderabad #OldCity #FireAccident #BigTV pic.twitter.com/Dl6Tw9gj0R
— BIG TV Breaking News (@bigtvtelugu) October 29, 2024