OTT Movie : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న హర్రర్ మూవీస్ కు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వారి దాకా ప్రతి ఒక్కరు ఈ మూవీస్ ను చూస్తారు. సినిమా అయిపోయేంతవరకు అందులోని సన్నివేశాలను ఎంజాయ్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ మూవీ చాలా భయంకరంగా ఉంటుంది. ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది?పేరేమిటో? తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్ లో (Netflix) లో స్ట్రీమింగ్
ఇది ఒక ఇటాలియన్ మూవీ. ఈ మూవీలో చాలాట్విస్ట్ లు ఉంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ మూవీ పేరు “ఏ క్లాసిక్ హర్రర్ స్టోరీ” (A CLASSIC HORROR). కారు ప్రమాదంలో చిక్కుకున్న నలుగురు వ్యక్తులు అతి భయంకరమైన ముసుగు మనుషుల మధ్య చిక్కుకుంటారు. అక్కడి నుంచి వాళ్లు బయటపడగలిగారా అనే కథాంశంతో ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఈ మూవీలో హీరోయిన్ పేరు ఎలీసా. హీరోయిన్ మరో నలుగురు వ్యక్తులతో కలిసి వెకేషన్ కి వెళ్తూ ఉంటుంది. ఒక కారులో సరదాగా వెళుతూ ఉండగా మార్గమధ్యంలో ఆ కారు ప్రమాదానికి గురవుతుంది. ఆతరువాత వీరంతా ఒక ప్రమాదకరమైన అడవిలో చిక్కుకు పోతారు. వీరంతా ఆ పరిసరాలను చూస్తూ ఉండగా అక్కడ భయంకరమైన వుడెన్ హోం ఒకటి కనిపిస్తుంది. అందులోకి వెళ్లి చూడగా అక్కడ కళ్ళు చెవి నోరు లేని మూడు బొమ్మలు ఉంటాయి. వాటి ముందు మనుషుల అవయవాలను పెట్టి ఉంటారు. మనమంతా ఒక ప్రమాదంలో చిక్కుకున్నామని వీరంతా గ్రహిస్తారు. అక్కడ నుంచి తప్పించుకోవడానికి వెళుతూ ఉండగా వీరిలో ముగ్గురిని ఆ ముసగు మనుషులు పట్టుకొని కిరాతకంగా చంపి, వీరి అవయవాలను ఆ బొమ్మల ముందు ఉంచుతారు. హీరోయిన్ ఎలిసా మరొకతను మాత్రమే మిగిలి ఉంటారు.
వీళ్ళిద్దరూ తప్పించుకునే క్రమంలో ఆ ఇంటిలో నుంచి ఒక అమ్మాయి ఏడుస్తున్నశబ్దం వినపడుతుంది. అక్కడికి వెళ్లి చూడగా ఒక చిన్న అమ్మాయి వీరికి కనబడుతుంది. ఆమెకు ఇదివరకే నాలుక కోసి ఆ దయ్యపు బొమ్మల ముందు పెట్టి ఉంటారు. ఆ చిన్న అమ్మాయిని అక్కడి నుంచి తప్పించి వీరితోపాటు తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తారు. వీరి ప్రయత్నం ఫలిస్తుందా? ఇంతకీ ఆ ముసుగు మనుషులు ఎవరు? ఎందుకు వీరంతా మనుషులను చంపుతున్నారు? చివరికి ఎలిసా ప్రాణాలతో బయటపడుతుందా? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న “ఏ క్లాసిక్ హర్రర్”(A Classic Horror). మూవీని తప్పకుండా చూడాల్సిందే. గుండె ధైర్యం ఉన్న వ్యక్తులు మాత్రమే ఈ మూవీని చూడగలుగుతారు. ఎందుకంటే క్లైమాక్స్ ట్విస్ట్ ఓ రేంజ్ లో ఉంటుంది. హర్రర్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కు ఈ మూవీ బెస్ట్ సజెషన్.