E-Paper
Advertisement

“నీ ఏడుపే బీజేపీకి శాపం” అంటూ ఈటల రాజేందర్ ఫ్లెక్సీలు కలకలం

“నీ ఏడుపే బీజేపీకి శాపం” అంటూ ఈటల రాజేందర్ ఫ్లెక్సీలు కలకలం
Advertisement

Etela Rajender: స్వేచ్చ బ్యూరో: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా చేసుకుని మేడ్చల్ ఓ ఆర్ ఆర్ సర్వీస్ వద్ద వెలసిన ఫ్లెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. “నీ ఏడుపే బీజేపీకి శాపం” అనే శీర్షికతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఈటలపై పలు విమర్శలు చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో పాటు, ఓటమి అనంతరం మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చిందీ బీజేపీ యేనని గుర్తు చేశారు.

Also read: కుర్ర ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ పార్టీ పెద్దలు వార్నింగ్..!

నా ఇమేజ్‌తోనే గెలిచాను..

Advertisement

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో గెలుపొందిన తర్వాత కూడా “నా ఇమేజ్‌తోనే గెలిచాను” అని చెప్పడం రాజకీయ నైతికత కాదని ఫ్లెక్సీల్లో విమర్శించారు. అలాగే బీసీ నాయకుడు ఎదుగుతుంటే అసహనం ఎందుకని, ఎంపీ ధర్మపురి అరవింద్‌కు లభిస్తున్న ఆదరణను చూసి కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు.”నేను బీసీ నాయకుడిని.. నేనే ప్రత్యామ్నాయం” అనే భావన నుంచి బయటకు రావాలని ఈటలకు సూచిస్తూ ఫ్లెక్సీల్లో వ్యాఖ్యలు చేశారు. ఈ ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారు, వాటి వెనుక ఉద్దేశం ఏమిటన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, ఈ వ్యవహారం బీజేపీ వర్గాల్లో చర్చకు దారితీసింది.

https://twitter.com/bigtvtelugu/status/2061019257660674167

Advertisement

Also read: స్కూల్ ఫీజుల దోపిడీపై చేతులెత్తేసిన ప్రభుత్వం.. నివేదిక ఇచ్చినా సర్కార్ గప్‌ చుప్..!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×