Flight Emergency Landing: హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. విమానాన్ని నడుపుతున్న పైలెట్ ఆ లోపాన్ని వెంటనే గుర్తించారు. క్షణాల్లోనే అలర్ట్ అయ్యి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కి సమాచారం ఇచ్చారు. వాతావరణం మార్పుతో పరిస్థితి క్షీణించడంతో వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కి అనుమతి కోరారు.
Also Read: Spy Pigeon: వామ్మో గూఢచారి పావురం.. కాలికి కోడ్ రింగ్, రెక్కలపై కోడ్ లెటర్స్.. ఎక్కడంటే..
ఆ సమయంలో విమానంలో 67 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రయాణికులకు ఏమాత్రం ప్రమాదం కలగకుండా పైలెట్, చాకచక్యంగా వ్యవహరించారు. అత్యంత జాగ్రత్తగా విమానాన్ని తిరిగి మలుపు తిప్పి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు దారి మళ్లించారు. ఈ విషయంపై ఎయిర్‌పోర్టు అధికారులు కూడా వెంటనే అప్రమత్తమయ్యారు. రన్‌వే పై ఎమర్జెన్సీ సదుపాయాలను సిద్ధం చేశారు. అగ్నిమాపక వాహనాలు, వైద్య బృందాలు మొత్తం అక్కడకి చేరుకున్నాయి. ప్రయాణికులు గాయపడినా వెంటనే చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read: Ganesh Chaturthi 2025: గణేష్ చతుర్థి లడ్డూ ప్రసాదం.. సింపుల్ రెమెడీ.. తింటే వావ్ అనాల్సిందే
జాగ్రత్తల మధ్య పైలెట్ చాకచక్యంతో విమానం సురక్షితంగా శంషాబాద్ విమానాశ్రయంపై ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అయ్యే వరకు ప్రయాణికులంతా భయాందోళనలతో గడిపారు. కొందరైతే కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఎమర్జెన్సీ ల్యాండింగ్ విజయవంతంగా ముగియడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విమానంలో సాంకేతిక లోపం ఏ కారణంగా తలెత్తిందనే విషయంపై అధికారులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. మెకానికల్ సమస్యనా? లేక ఎలక్ట్రికల్ లోపమా? అనేది స్పష్టత కావాల్సి ఉంది. కానీ ఈ ఘటనతో పైలెట్ సమయస్ఫూర్తి, ధైర్యం, చాకచక్యంతో ఈ రోజు 67 మంది ప్రయాణికులు సురక్షితంగా తమ ఇళ్లకు చేరుకున్నారు.
శంషాబాద్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. విమానంలో 67 మంది ప్రయాణికులు!
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానంలో సాంకేతిక లోపం
హైదరాబాద్-తిరుపతి బయలుదేరిన అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపం గుర్తించిన పైలెట్
దీంతో అప్రమత్తమై వెంటనే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో… pic.twitter.com/VE0RkVFS3S
— BIG TV Breaking News (@bigtvtelugu) August 19, 2025