Big Stories

BRS Chief KCR: 1.30 లక్షల మందితో సెక్రటేరియట్ ఎదుట ధర్నా చేస్తాం: కేసీఆర్

BRS Chief KCR: ఎన్నో ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుదేలవుతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని కేసీఆర్ ఫైర్ అయ్యారు.

- Advertisement -

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో చేవేళ్లలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. చాలా ఏళ్లు కష్టపడి, పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించి.. హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తే.. దాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే కుదేలు చేస్తోందన్నారు.

- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి మాయం అయ్యిందని ఆరోపించారు. పదేళ్ల నాటి సమస్యలు రాష్ట్రంలో మరోసారి పునరావృతం అయ్యాయన్నారు. దళితులకు రూ.12 లక్షలు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి.. కనీసం ఇప్పటికి రూ.10 లక్షలు కూడా ఇవ్వలేదన్నారు. ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా దళిత బంధు పథకాన్నే రద్దు చేసిందన్నారు.

Also Read: మూసీ ముస్తాబుపై ప్రభుత్వం స్సెషల్ ఫోకస్..

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రొసిడింగ్ అయిన 1.30 వేల మందికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే వాళ్లందరినీ తీసుకొని వచ్చి సెక్రటేరియట్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర దీక్షకు దిగి ప్రభుత్వం మెడలు వంచి ఆ నిధులు విడుదల చేపిస్తామని కేసీఆర్ హెచ్చిరించారు. తెలంగాణ ప్రజలకు మంచి జరిగేలా తాను బతికున్నంత వరకూ పోరాడుతానని కేసీఆర్ వెల్లడించారు. దళిత బంధు విషయంలో కాంగ్రెస్ నేతలను నియదీయాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News