BigTV English

TSPSC : TSPSC ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి.. గవర్నర్ ఆమోదం..

TSPSC : TSPSC ఛైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. TSPSC బోర్డు ఛైర్మన్ పదవి కోసం 50 మంది.. కమిషన్ సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు.

TSPSC : TSPSC ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి.. గవర్నర్ ఆమోదం..

TSPSC : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులు కానున్నారు. తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అలాగే టీఎస్‌పీఎస్‌సీ సభ్యులుగా రిటైరర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రాంమోహన్ రావు బోర్డు సభ్యలుగా నియమితులు అయ్యారు. TSPSC బోర్డు ఛైర్మన్ పదవి కోసం 50 మంది.. కమిషన్ సభ్యుల కోసం 321 మంది దరఖాస్తు చేసుకున్నారు.


టీఎస్‌పీ‌స్‌సీ బోర్డు సభ్యులు నియామకం కోసం ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. నామినేటడ్ విధానానికి స్వస్తి పలికింది. దీనిలో భాగంగానే నూతన విధానంలో బోర్డు సభ్యులను నియమించింది. ప్రభుత్వం బోర్డు సభ్యులు కోసం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేసింది. టీఎస్‌పీఎస్‌సీ బోర్డు ఛైర్మన్‌గా నియామితులు అయిన మాజీ డీజీపీ ముదిరెడ్డి మహేందర్ రెడ్డి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్ణాపురంలో జన్మించారు. ఈయన మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. ఏకోపాధ్యాయ పాఠశాలలోనే చదువుకున్నారు. ఆయన 1968 బ్యాచ్‌కి చెందిన పోలీస్ అధికారి.

ఏఎస్పీగా మొదలైన ఆయన కేరీర్ డీజీపీగా పదవీ విరమణ పొందారు. తొలుత రామగుండం ఏఎస్సీ గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నిజామాబాద్, కర్నూల్ ఎస్పీగా పోలీస్ సేవలు అందించారు. చంద్రబాబునాయుడు హయంలో ఏర్పాటు చేసిన సైబారాబాద్ కమిషన్ రేట్‌లో మొదటి కమిషనర్‌గా సేవలు అందించారు. మూడేళ్లు సుదీర్ఘ సేవలు అందించారు. ఆ తర్వాత గ్రేహౌండ్స్, పోలీస్ కంప్యూటర్స్ విభాగాల్లో సేవలు అందించారు. పోలీస్ శాఖలో నిఘా విభాగాధిపతిగా విశేషమైన సేవలు అందించారు.


మాజీ డీజీపీ అనురాగ్ శర్మ పదవీ విరమణ తర్వాత 2017 నవంబర్ 12న ఇన్‌చార్జ్ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 2018 ఏప్రిల్ తర్వాత పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టారు. 2022 ఏడాది డిసెంబర్‌లో డీజీపీగా పదవీ విరమణ పొందారు. మూడేళ్లకు పైగా డీజీపీ‌గా పని చేసిన ఈయన రాష్ట్రంలో శాంతిభద్రతలు విషయంలో కీలక పాత్ర పోషించారు. అందుకే 2020‌లో టాప్ 25 ఐపీఎస్ అధికారుల జాబితాలో ఈయన 8‌వ స్థానాన్ని దక్కించుకున్నారు. తెలంగాణ పోలీస్ శాఖలో అనేక మార్పులు తీసుకువచ్చారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. పోలీస్ స్టేషన్లను ఆధునికీకరించడంలో విశేషమైన కృషి చేశారు. అయితే టీఎస్‌పీ‌ఎస్సీ ఛైర్మన్‌గా నియమితులైనా మహేందర్ రెడ్డి ఈ ఏడాది డిసెంబర్ వరకే కొనసాగే అవకాశం ఉంది. కమిషన్ నిబంధనలు ప్రకారం 62 ఏళ్లు దాటితే పదవీ విరమణ చేయల్సి ఉంటుంది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×