Satyabhama Today Episode January 18th : నిన్నటి ఎపిసోడ్ లో… అందరూ కలిసి నామినేషన్స్ వేయడానికి లోపలికి వెళ్తారు.. మహదేవయ్య నామినేషన్స్ వేయడానికి నీతానా మంది లేరు కదా అనేసి అనగానే అటు ఒకసారి చూడండి మావయ్య గారు నాకు సపోర్ట్ చేయడానికి ఎవరు వచ్చారు అని అంటుంది. మహాదేవ లోపలికి వెళ్ళగానే మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ సాయం చేసేది ఎవరని అక్కడ వాళ్ళు అడుగుతారు. ఇంకెవరు నా చిన్న కొడుకు అని మహదేవయ్యా అంటాడు. నేను గెలవాలని మనస్పూర్తిగా నువ్వు సంతకం చేయరా చిన్న అని మహదేవయ్య చెప్పగానే క్రిష్ ఆలోచిస్తాడు. చంపుకొని మా బాపుకి సపోర్ట్ గా నిలుస్తున్నాను సత్య నన్ను దయచేసి ఏమీ అనుకోవద్దు అని మనసులో అనుకుంటాడు. సత్య అన్న మాటలు గుర్తుచేసుకొని క్రిష్ బాధపడతాడు. ఇక సంతకం పెట్టి సత్యం వాళ్ళ దగ్గరికి కృషి వస్తాడు. ఇక నెక్స్ట్ నామినేషన్స్ సత్య వేయాల్సి ఉంది.. ఇక అందరూ సత్యవైపు పదిమంది అయ్యారు లేరని చూస్తారు. సత్యకు మహదేవయ్య ఇన్ డైరెక్ట్ గా తప్పుకోమని వార్నింగ్ ఇస్తాడు. ఇక నామినేషన్ లో సంతకం పెట్టడానికి సంధ్య ఒప్పుకోదు. నాకు ఇష్టం లేదని చెప్పేస్తుంది. ఇక సత్య నామినేషన్స్ వేయలేనని బాధపడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. సంధ్య రాలేదు.. విశ్వనాథం ఫోన్ చేస్తాడు. కానీ సంధ్య మాత్రం నాకు ఇష్టం లేదు.. నేను రాను అక్క మీ మామయ్య నిండు మీద నువ్వు పోటీ చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటుంది.. చివరి నిమిషంలోని ఇలా చెప్తే నేను ఎలా సంధ్యా ని సత్య బాధపడుతుంది అయినా సన్నిమనస్సు కరగదు. సత్య ఫీల్ అవుతుంది క్రిష్ బయటకొచ్చి ఫీల్ అవుతాడు.. సత్య ఏడవడం చూసి అందరూ బాధపడతారు. ఇక జయమ్మ బయటికి వచ్చి క్రిష్ తో నువ్వు సత్యను మోసం చేస్తున్నావని అంటుంది. వెనకుండి శ్రీకృష్ణుడు లాగా నడిపిస్తున్న అనుకున్నాను.. కానీ నువ్వే ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు సత్య ఏడుస్తుంది నాకు చాలా బాధగా ఉందని జయం అంటుంది. క్రిష్ కూడా బాధపడతాడు. అందరూ సత్యని ఓదారుస్తారు. ఇక జయమ్మ లోపలికి వెళ్లి సత్యా నువ్వు 9 మందితోని నామినేషన్స్ వెయ్యు అంటుంది. అలా చేస్తే ఉపయోగము ఉండదు కదా అని హర్ష అంటాడు. 9 మంది వెనుకున్నారని తెలుస్తుంది అని నందిని అంటుంది.
ఇక సత్యా ఆఫీసర్ గారు నేను 9 మందితోనే నామినేషన్స్ వేస్తానని ముందుకు వస్తుంది.. మీరు ఓకే అనుకుంటే నామినేషన్స్ ని తీసుకోండి లేకపోతే రిజెక్ట్ చేసేయండి అని సత్యా నామినేషన్స్ వేయడానికి ముందుకు వస్తుంది. ఇక ఒక్కొక్కరూ 9 మంది సత్య తర్వాత నామినేషన్స్ ఫామ్ లో సంతకం పెడతారు. ఇంకెవరైనా సంతకం పెట్టడానికి ఉన్నారా అని ఎక్కడున్నావ్ ఆఫీసర్ అడుగుతాడు. అప్పుడే రుద్ర నేనున్నాను అని సంతకం పెట్టడానికి ముందుకు వస్తాడు. రుద్రను చూసి అందరూ షాక్ అవుతారు. రుద్ర నామినేషన్స్ ఫామ్ లో సంతకం పెట్టేస్తాడు. పదిమంది సంతకం పెట్టడంతో సత్యకు నామినేషన్స్ లో సపోర్ట్ దొరుకుతుంది. చూసావా అమ్మ పుట్టింటి వాళ్లు సపోర్ట్ గా ఉంటే ఎంత బాగుందో అని అంటుంది. సంధ్య రాలేదని మీరు తనని తిట్టొద్దు తనని ఏమీ అనద్దు అని సత్య అంటుంది. వస్తానని చెప్పి మాట ఇచ్చింది కానీ అబద్ధం చెప్పి తప్పించుకుంది ఏమీ అనకుండా ఎలా ఉంటామని విశాలాక్షి అంటుంది. కానీ సత్య మాత్రం సంధ్య ఏమనుకుంటుందో కానీ ఎందుకు భయపడుతుందో అందుకు కారణం ఏంటో నేను తెలుసుకుంటానని అంటుంది.
ఇక రుద్ర సంతకం పెట్టడంపై భైరవి కోపంగా ఉంటుంది. నామినేషన్స్ పూర్తయింది కదా ఇక సంబరాలు చేసుకోవాలి పార్టీ చేసుకుందాం రండి అని నందిని బయట బాంబులు కలిసి ధూమ్ ధామ్ గా సందడి చేస్తారు. అది చూసిన క్రిష్ దూరంగా సంతోష పడతాడు. నామినేషన్స్ లో సంతకం పెట్టడానికి మీ మీ అన్నయ్యకి చేసావని అర్థమైంది ఏం చేస్తావో చెప్పొచ్చు కదా అని సత్య అడుగుతుంది. క్రిష్ మాత్రం నీకు నామినేషన్స్ అయితే పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు ఆ పని అని చెప్పేసి అంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో రుద్రకు ఇంట్లో వాళ్ళందరూ చివాట్లు పెడతారు. మరి ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..