E-Paper
Advertisement

తలకొండపల్లి బిడ్డలకోసం ఓ ఉపాధ్యాయుడి ఉదారత..!

తలకొండపల్లి బిడ్డలకోసం ఓ ఉపాధ్యాయుడి ఉదారత..!
Advertisement

College Land: ఉన్నతి ఆండ్​ శిక్ష ఫౌండేషన్​ కృషితోనే స్థలం కేటాయింపు
–ఎమ్మెల్యే కసిరెడ్డి, కలెక్టర్​ నారాయణరెడ్డిల సహాకారంతోనే సాధ్యం
–ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి ముందుకొచ్చిన దాతలు
–తమకు అవకాశం కల్పించాలంటున్న ఫౌండేషన్​ చైర్మన్​ ఎర్ర సుధాకర్​ రెడ్డి 

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్చ: ఎన్నో యేండ్లు ఉన్నత విద్యాకు దూరమైతున్న విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గత రెండేండ్ల కింద కళాశాల మంజూరు చేసింది. మొదటి సంవత్సరం ఆశించిన స్ధాయిలో విద్యార్ధుల సంఖ్య లేకపోవడంతో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది నిరాశకు గురైయ్యారు. ఈ కళాశాలలో విద్యార్ధుల సంఖ్య పెంచి కాపాడుకోవాలని రాజకీయాలకు అతీతంగా ప్రజలు ముందుకోచ్చారు. దీంతో ఈ విద్యా సంవత్సరం విద్యార్దుల సంఖ్య ఘననీయంగా పెరిగిపోయారు. కళాశాలకు సోంత భవనం లేకపోవడంతో విద్యార్ధులకు పూర్తిస్థాయిలో మౌళిక సదుపాయాలు కల్పించలేకపోయారు. సరియైన సౌకర్యాలు లేకపోతే వచ్చే విద్యాసంవత్సరంలో విద్యార్ధుల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందని ఉన్నతి ఆండ్​ శిక్ష ఫౌండేషన్​ ప్రతినిధులు గమనించారు. ఏలాగైన ఈ కళాశాలను నిలబేట్టేందుకు పౌండేషన్​ శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే ప్రాథమిక అవసరాలైన ఫర్నిచర్​, బుక్స్​, డ్రెస్​లు, తదితర సామాగ్రిని కళాశాలకు అందజేశారు.

భూ సేకరణను వేగవంతం

Advertisement

అంతటితో ఆగకుండా కళాశాలకు సోంత భవనం నిర్మించాలనే ఉద్దేశ్యంతో స్ధానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్​ నారాయణరెడ్డిలను ఫౌండేషన్​ ప్రతినిధులు కలిసి భూమి కేటాయించాలని కోరారు. ఈ వినతులపై ఎమ్మెల్యే, కలెక్టర్లు సానుకూలంగా స్పందించి భూ సేకరణను వేగవంతం చేశారు. కళాశాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాల 37 గుంటల భూమిని కేటాయిస్తూ ప్రిన్సిఫల్​కు కలెక్టర్​, తహాశీల్ధార్​లు అర్డర్​ కాఫీని గురువారం అందజేశారు. తలకొండపల్లి మండలం కేంద్రంలోని 291 సర్వే నెంబర్​లో రెండు ఎకరాల 37 గుంటల భూమికి సంబంధించిన పత్రాలను అధికారులు అప్పగించారు. ప్రభుత్వ కళాశాల నిర్మాణానికి అయ్యే నిధులను కేటాయించేందుకు దాతలు ముందుకోచ్చారు. స్ధానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్వయంగా ప్రగతి పాలన సభలో కళాశాల నిర్మాణానికి ఉన్నతి ఆండ్​ శిక్ష ఫౌండేషన్​ చైర్మన్​ ఎర్ర సుధాకర్​ రెడ్డి మందుకోచ్చారని వివరించడం జరిగింది.

Also read: తెలంగాణకు గుడ్ న్యూస్.. ఎండల నుంచి ఉపశమనం, ఐదు రోజుల పాటు వర్షాలు

రుణం తీర్చుకుంటాను.. ఉన్నతి ఆండ్​ శిక్ష ఫౌండేషన్​ చైర్మన్​ ఎర్ర సుధాకర్​ రెడ్డి

Advertisement

గ్రామీణ ప్రాంతమైన తలకొండపల్లిలో పుట్టి పెరిగి ఉన్నత చదువుతో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించాను. ఉపాధ్యాయ వృత్తిలో చేరిన నాటి నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలను తమ వంతు సహాకారం చేయాలనే సంకల్పం ఉంది. నా పిల్లలకు ఉన్నతి విద్యనందించడంతోనే విదేశాలల్లో జీవిస్తున్నారు. అదే స్పూర్తిని మండలంలోని ప్రతి ఒక్కరికి కల్పించాలని ఆశిస్తున్నాను. ఇప్పటికే తలకొండపల్లి మండల పరిధిలోని ప్రభుత్వ స్కూల్స్​, కళాశాలలకు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కసిరెడ్డి సహకారంతో మౌళిక సదుపాయాలు కల్పించాము. ఉపాధ్యాయ వృత్తి పదవీవిరమణతో వచ్చిన నగదుతో విద్యార్ధుల అవసరాలకు ఖర్చు చేయాలని కంకణం కట్టుకున్నాము. ప్రభుత్వం తలకొండపల్లి మండలానికి మంజూరు చేసిన కళాశాల నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తాము. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్​ సి.నారాయణరెడ్డిలు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తే కార్పోరేట్ స్థాయిలో కళాశాల నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును భరిస్తామని ఎర్ర సుధాకర్​ రెడ్డి అన్నారు.

Also read: రైతు బంధు నిలిపివేత పై హైకోర్టు గరం గరం

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×