E-Paper
Advertisement

తండ్రి నమ్మకం… కూతురి పట్టుదల… ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ డ్రామా

తండ్రి నమ్మకం… కూతురి పట్టుదల… ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ డ్రామా
Advertisement

Telugu Emotional Family Drama: ఈ మధ్య కాలంలో ఓటీటీలలో క్రైమ్, సస్పెన్స్, వైలెన్స్ కంటెంట్ ఎక్కువైపోతోందని ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త అప్సెట్ అవుతున్నారు. కళ్ళల్లో నీళ్లు తిరిగేలా, మనసుకు హత్తుకునేలా ఉండే ప్యూర్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలు రావడం చాలా అరుదుగా మారింది. అలాంటి వెలితిని తీరుస్తూ, ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఈటీవీ విన్’ వారి ‘కథాసుధ’ కాన్సెప్ట్‌లో భాగంగా మనసుకు హత్తుకునే అచ్చ తెలుగు సినిమాలను విడుదల చేస్తూ వస్తోంది. అలా వచ్చిన లేటెస్ట్ హార్ట్ టచింగ్ మూవీ ‘వరం D/O భార్గవి’ (Varam D/O Bhargavi). మరి ఈ సినిమా కథ ఏంటి ? అన్నది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

భార్గవి తన కూతురు వరంను ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. ఆర్థికంగా పెద్దగా స్థోమత లేకపోయినా, కూతురికి మంచి విలువలు నేర్పిస్తూ తనకు చేతనైనంతలో సంతోషంగా చూసుకుంటుంది. డబ్బు విలువ ఏంటో, ఏదైనా వస్తువు తీసుకుంటే దానికి తగిన డబ్బులు చెల్లించాలనే విషయాన్ని చిన్నప్పటి నుంచే వరానికి చెబుతుంది. దీంతో వరం కూడా తన తల్లి మాటలను పాటిస్తూ పెరుగుతుంది. ఒకరోజు చెప్పుల షాపులో వరానికి ఓ జత చెప్పులు నచ్చుతాయి. వాటిని కొనుక్కోవాలనే ఆశతో తన దగ్గరున్న డబ్బులను జాగ్రత్తగా దాచుకుంటుంది. ఐస్‌క్రీమ్ తినాలనే చిన్న చిన్న ఆశలను కూడా పక్కన పెట్టి, చివరకు తనకు నచ్చిన చెప్పులు కొనుక్కుంటుంది.

Advertisement

అయితే ఆ షాపులో జరిగిన ఓ సంఘటనతో వరం చిక్కుల్లో పడుతుంది. ఆమె డబ్బులు చెల్లించకుండా చెప్పులు తీసుకెళ్లిందనే ఆరోపణ రావడంతో షాపు యజమాని, అక్కడి వ్యక్తులు ఆమె ఇంటికి వస్తారు. అక్కడే కథలో ఊహించని నిజం బయటపడుతుంది. వరం జీవితంతో సంబంధం ఉన్న ఆ షాపు యజమాని ఎవరు ? తనను ప్రేమగా పెంచుతున్న భార్గవికి, తన పుట్టుకకు మధ్య ఉన్న అసలు సంబంధం ఏంటి ? సరోగసీ చుట్టూ దాగున్న నిజం వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ చిన్నారి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి ? వరం తన తల్లి పట్ల చూపించే ప్రేమ, అమాయకత్వం ఈ పరిణామాలను ఎలా ప్రభావితం చేస్తాయన్నదే మిగతా కథ.

అచ్చ తెలుగు సినిమా… తెలుగులోనే స్ట్రీమింగ్

‘వరం D/O భార్గవి’ తెలుగు సినిమానే. నవంబర్ 1 నుంచి ఈటీవీ విన్‌ (ETV Win) ఓటీటీలోని ‘కథా సుధ – సండే స్టోరీస్’లో స్ట్రీమింగ్ అవుతోంది. పవన్ రాచేపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయశాంతి శ్రీనివాస్ తాడిపత్రి నిర్మించారు. బేబీ జెస్సికా, దివ్య దీపికతో పాటు సతీష్ సారిపల్లి, విజయ్ భారత్, మహేంద్ర గణచారి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఒక చిన్నారి ప్రపంచం, ఒక తండ్రి నమ్మకం, ఒక కూతురి పట్టుదల చుట్టూ తిరిగే ఈ అద్భుతమైన ఎమోషనల్ డ్రామా ఆడియన్స్ మనసులను గెలుచుకుంటోంది.

Advertisement

Read Also: మామగారి రహస్య వ్యవహారం బయటపెట్టే కాబోయే కోడలు… దీపావళి రోజున అసలైన ధమాకా

Tags

Related News

20 ఏళ్ల క్రితం మాయమైన సోదరుడు… తవ్వేకొద్ది వెలుగులోకి దిమ్మతిరిగే నిజాలు… మైండ్ బెండింగ్ హారర్ మిస్టరీ

సోషల్ మీడియా వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన ది ట్రైటర్స్ నటి శ్రీదేవి!

సొంత సైన్యంలోనే కోవర్ట్… రెండవ ప్రపంచ యుద్ధం వెనుకున్న మిస్టరీ… యథార్థ సంఘటనల ఆధారంగా వచ్చిన వార్ థ్రిల్లర్

తెలియని నంబర్ నుంచి ఆ ఫోన్ కాల్… సీట్ ఎడ్జ్ సస్పెన్స్‌తో అలరించే తమిళ్ క్రైమ్ కామెడీ

విప్లవం వెనుక నవ్వుల రైడ్… ఓటీటీలోకి అడుగుపెట్టిన పీరియాడిక్ మాస్ డ్రామా ‘కామ్రేడ్ కళ్యాణ్’

డిన్నర్ డేట్‌ కి వెళ్తే దిమ్మతిరిగే ట్విస్ట్… ఇంటెన్స్ కొరియన్ సైకలాజికల్ మిస్టరీ

అరేబియా సముద్రంలో ఆఖరి ప్రయాణం… వెనుక వెంటాడే మిస్టరీ… సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×