E-Paper
Advertisement

Gadwal Municipality: గద్వాల పీఠంపై చైర్మన్ ఉత్కంఠ.. ఇరు పార్టీలకు ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం

Gadwal Municipality: గద్వాల పీఠంపై చైర్మన్ ఉత్కంఠ.. ఇరు పార్టీలకు ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకం
Advertisement

Gadwal Municipality:  గద్వాల చైర్మన్ పీఠం ఏ పార్టీకి దక్కనుందనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల, అలంపూర్ మున్సిపాలిటీలలో వార్డ్ కౌన్సిలర్ల ఫలితాలలో ఓటర్ల విలక్షణమైన తీర్పుతో కాంగ్రెస్ ,బీఆర్ఎస్ లకు మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో స్వతంత్రుల మద్దతుతో పాటు ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకంగా మారాయి. ఆ ఓట్లే కీలకంగా మారడంతో కాంగ్రెస్ , బీజెపితో కలిసి బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు వారు కీలకం కావడంతో వ్యూహ ప్రతి వ్యూహాలలో తల మునుకలయ్యాయి. వేర్వేరు క్యాంప్ లలో ఉన్నప్పటికీ ఒక పార్టీ నుంచి గెలిచిన వారికి స్వతంత్రులకు, రెబల్స్ కు మరో పార్టీ నేతలు వల వేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ , బీఆర్ఎస్ ,బీజెపి పార్టీలు అప్రమత్తమయ్యాయి. తమ పార్టీ తరపున గెలిచిన విజేతలను ఫలితాలు ప్రకటించిన వెంటనే ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు తరలించారు. గద్వాల మున్సిపాలిటీలో మెజార్టీ రాక హాంగ్ వచ్చిన నేపథ్యంలో మెజార్టీ కోసం కాంగ్రెస్ నేతలు ఇతర స్వతంత్రులు, ఒక ఎంఐఎం కౌన్సిలర్ తో కలిపి క్యాంపు రాజకీయాలు నిర్వహిస్తూ నేడు ఎన్నికకు రానున్నారు.

ఎక్స్ అఫీషియో మెంబర్ల ఓటు కీలకం 

చైర్మన్ పీఠం ఐజ మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 13 వార్డులలో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ రావడంతో అక్కడ ఆ పార్టీ నాయకత్వం నిర్ణయం మేరకు సీఎం సురేష్ చైర్మన్ కానున్నారు. వడ్డేపల్లి లో సైతం ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 10 వార్డులకు 8 వార్డులలో విజయం సాధించి ఆ పార్టీ తరఫున మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకోనున్నారు. అలంపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ , బీఆర్ఎస్ కు తలో ఐదు సీట్లు రావడంతో అక్కడ ఎక్స్ అఫీషియో మెంబర్ల ఓటు కీలకము కావడంతో ఎమ్మెల్యే విజయుడు తన ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Advertisement

Also Read: Karimnagar Corporation: హైదరాబాద్‌కు చేరిన కరీంనగర్ క్యాంప్ పాలిటిక్స్.. మ్యాజిక్ ఫిగర్ కోసం కాంగ్రెస్ స్కెచ్.. పీఠం దక్కేది ఎవరికి?

బీసీలకే చైర్మన్ పదవి

గద్వాల కోటలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో రాజకీయ సమీకరణాల కారణంగా మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీలకే కేటాయించే అవకాశం ఉంది. మున్సిపల్ రిజర్వేషన్లలో భాగంగా జనరల్ మహిళకు ఈ చైర్మన్ స్థానం ఖరారు కాగా అనూహ్యంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేందుకు బీసీ మహిళకు చైర్ పర్సన్ స్థానాన్ని కేటాయించనున్నారు.

ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకము

Advertisement

గద్వాల, అలంపూర్ మున్సిపాలిటీలలో కాంగ్రెస్ ,బీఆర్ఎస్ ఎక్స్ అఫీషియో ఓట్లే కీలకంగా మారాయి. గద్వాలలో 37 వార్డులలో మ్యాజిక్ ఫిగర్ 19 కి కాంగ్రెస్ పార్టీ 16 గెలువగా మరో మూడు స్థానాలు మెజార్టీకి అవసరమవుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు స్వతంత్రులు ఒక ఎంఐఎం కౌన్సిలర్ మద్దతు కూడా కడుక్కొని క్యాంపు నిర్వహిస్తున్నారు. అదనంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీ మల్లురవి సైతం తమ ఎక్స్ అఫీషియో ఓట్లను వినియోగించుకోనున్నారు.బిఆర్ఎస్ సైతం 11 సీట్లు సాధించగా 7 సీట్లు సాధించిన బీజెపితో కలిసి క్యాంప్ రాజకీయాలు నిర్వహిస్తూ స్వతంత్రులకు చైర్మన్ స్థానాన్ని ఆఫర్ చేయడం ద్వారా పుర పీఠాన్ని కైవసం చేసుకోవాలని బిఆర్ఎస్ బిజెపి ఎత్తులు వేస్తున్నాయి.

చైర్మన్ పీఠాన్ని కైవసం

ఇదిలా ఉండగా బీఆర్ఎస్ తరఫున ఎలాంటి విప్ జారీ చేయలేదని జిల్లా అదనపు నర్సింగరావు తెలిపారు. నిబంధనల ప్రకారం  ఉదయం 11 గంటలలోపు ఇవ్వాల్సి ఉండగా వారు ఆ సమయంలో ఇవ్వలేకపోయారు. దీంతో ఆ లెటర్ ని వారి వెంటే తీసుకపోయారని తెలిపారు. కేవలం ఎమ్మెల్యే విప్ ధిక్కరిస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకునే అవకాశం లేదు.కేవలం తదుపరి ఎన్నికల్లో ఎక్స్ అఫీషియో ఓటును వేసే అవకాశాన్ని కోల్పోతారు. రేపు జరగబోయే మున్సిపల్ ప్రమాణస్వీకారం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలలో ప్రధాన పార్టీల వివరాలు ఎక్స్ అఫీషియల్ ఓట్లే కీలకం కావడంతో ఏ పార్టీ ఏ విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందోననే ఉత్కంఠ ప్రజల్లో ఉండగా నేడు ఆ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది.

Also Read: BRS : తెరపైకి మళ్ళీ ఫార్ములా ఈ కారు కేసు.. తొలి అరెస్ట్ ఆయనదేనా?

Related News

హైదరాబాద్కు మంత్రి కొండా సురేఖ.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కీలక వ్యాఖ్యలు, ముగింపు ఎలా?

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

Big Stories

Advertisement
×