E-Paper
Advertisement

నన్ను బ్లాక్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ!

నన్ను బ్లాక్ చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నా.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ!
Advertisement

Babu Love Story:లీస్ట్ ఎలిజబుల్ బ్యాచురల్ వెబ్ సిరీస్ తో ఆడియన్స్ ని పలరించిన డైరెక్టర్ బాబు జబర్దస్త్ లో మెరిసిన సంగతి తెల్సిందే .అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాబు తన పర్సనల్ జీవితం,అలాగే తన ప్రేమ ,పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని , జబర్దస్త్‌లోకి వచ్చిన కొత్తలో స్కిట్లు రాస్తూ కూడా సరైన ఆదాయం పొందలేని పరిస్థితులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఒక్కో ఎపిసోడ్‌కు కనీసం రూ.1,500 కూడా తీసుకోలేని రోజులు ఉన్నాయని గుర్తు చేసుకున్నాడు. కెరీర్‌లో ఎదగాలని, తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చిందని వివరించాడు. అలాంటి సమయంలో తన జీవితంలోకి వచ్చిన అమూల్య తనకు ఎంతో అండగా నిలిచిందని బాబు చెప్పాడు.

Advertisement

తనకు అమూల్యతో పరిచయం ఎలా ఏర్పడిందనే విషయాన్ని కూడా బాబు వివరించాడు. అమూల్య లోకల్ కేబుల్ టీవీలో యాంకర్‌గా పనిచేసేదని, ‘ఆట కావాలా పాట కావాలా’ ద్వారా ఆమెకు గుర్తింపు వచ్చిందని తెలిపాడు. అప్పట్లో టిక్‌టాక్‌లో ఆమె చీరకట్టులో ఫోక్ సాంగ్స్ కి వీడియోలు చేసేదని, ఆ వీడియోలు తనకు బాగా నచ్చేవని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తెలంగాణ జానపద పాటలకు ఆమె చేసే వీడియోలను ఇష్టపడేవాడినని, వాటికి లైకులు కొట్టడంతో పాటు కామెంట్లు కూడా పెట్టేవాడినని ఆరోజులని గుర్తు చేసుకున్నాడు.

అయితే అప్పట్లో టిక్‌టాక్‌లో అమూల్యకు లక్షల సంఖ్యలో ఫాలోవర్లు ఉండగా, తనకు మాత్రం చాలా తక్కువ మంది ఫాలోవర్లు ఉండేవారని బాబు సరదాగా చెప్పాడు. ఆమెకు మెసేజ్‌లు పంపించినా మొదట్లో పెద్దగా స్పందన రాలేదని తెలిపాడు. ఒకసారి హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో జ్యూస్ తాగుతున్న సమయంలో అమూల్యను అనుకోకుండా చూశానని గుర్తు చేసుకున్నాడు. ఆమెను చూసిన తర్వాత టిక్‌టాక్ వీడియోలలో కనిపించిన అమ్మాయి ఈమెనేనా అని కన్ఫాం చేసుకున్నానని, అయితే అప్పట్లో తనను ఆమె పట్టించుకోవడం లేదనే భావనతో అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పాడు.

Advertisement

ఆ తర్వాత జబర్దస్త్‌లో పనిచేస్తున్న సమయంలో ఇతరుల ద్వారా అమూల్య ఫోన్ నంబర్ తెలుసుకుని తానే ఫోన్ చేసినట్లు బాబు వెల్లడించాడు. అయితే మొదట్లో తన ప్రవర్తన నచ్చక అమూల్య తనను బ్లాక్ చేసిందని నవ్వుతూ చెప్పాడు. ఒకసారి హెచ్చరించి మరీ బ్లాక్ చేసిందని, ఆ సంఘటన లాక్‌డౌన్‌కు ముందే జరిగిందని వివరించాడు. లాక్‌డౌన్ ముగిసిన కొన్ని నెలల తర్వాత మళ్లీ ఆమెకు మెసేజ్ చేయడానికి ప్రయత్నించానని, అనుకోకుండా ఫోన్ కలవడంతో మరోసారి మాట్లాడే అవకాశం వచ్చిందని తెలిపాడు.

అమూల్య ఫోన్ నంబర్ మారడంతో ఆమె తమ్ముడు ఫోన్ లిఫ్ట్ చేసి మరో నంబర్ ఇచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు.ఆ తర్వాత ఇద్దరూ మళ్లీ మాట్లాడుకోవడం మొదలైందని, క్రమంగా పరిచయం పెరిగి ఒకరినొకరు అర్థం చేసుకున్నామని బాబు చెప్పాడు. మొదట్లో సాధారణంగా మొదలైన ఈ పరిచయం చివరకు ప్రేమగా మారిందని వివరించాడు.

ఇదిలా ఉంటే, బాబు పెళ్లి గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. తాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడు. నిజానికి ఎప్పుడో పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అయితే ముందుగా జీవితంలో కొంత స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. కనీసం ఒక్క సినిమా చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు ఎప్పటి నుంచో ఉందని వివరించాడు. అందుకే పెళ్లి విషయంలో ఆలస్యం జరిగిందని, తన కోసం అమూల్య ఎంతోకాలం ఎదురుచూసిందని చెప్పాడు. ఇక తను దర్శకత్వం వహించిన లీస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ రిలీజ్ అవడంతో పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలిపాడు.

అమూల్య కుటుంబం కూడా తమ పెళ్లికి అంగీకరించిందని బాబు తెలిపాడు. దాదాపు రెండేళ్లుగా ఆమె కుటుంబం తమ నిర్ణయం కోసం ఎదురుచూస్తోందని చెప్పుకొచ్చాడు. అమూల్య తల్లిదండ్రులను తాను కలిశానని, ఆమె తండ్రి తనతో మాట్లాడిన మాటలను ఎప్పటికీ మర్చిపోలేనని వివరించాడు

అంతేకాదు, తనకోసం అమూల్య ఖరీదైన ఫోన్ కూడా కొనిచ్చిందని బాబు తెలిపాడు . దాదాపు రూ.1.20 లక్షల విలువైన ఫోన్ కొనిచ్చినట్లు చెబుతూ, అంత ఖర్చు చేయవద్దని తాను చెప్పినా ఆమె వినలేదని వివరించాడు. తనకు రూ.20,000 ఫోన్ సరిపోతుందని చెప్పినా, రీల్స్ చేసుకోవడానికి, మంచి ఫొటోలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని ఆమె ఆ ఫోన్ కొనిచ్చిందని తెలిపాడు.

అమూల్య తనను ఎంతగా చూసుకుంటుందో చెప్పడానికి మరో ఉదాహరణను కూడా బాబు పంచుకున్నాడు. తనకు ఇప్పటికీ జొమాటో, స్విగ్గీ వంటి యాప్‌లలో ఆర్డర్ పెట్టడం తెలియదని తాను ఎక్కడ ఉన్నా, ఏ సమయంలో ఉన్నా అమూల్య తనకు భోజనం పంపిస్తుందని వివరించాడు. తనకు ఆకలి వేస్తుందని తెలిసిన వెంటనే ఆమె ఆహారం ఆర్డర్ చేస్తుందని, ఒక అమ్మ తన బిడ్డను చూసుకున్నట్లుగా తనను చూసుకుంటుందని తెలిపాడు.

బాబు తన కాబోయే భార్య గురించి చెబుతూ అమూల్య తన ఫోన్‌లో బాబు నంబర్‌ను ‘7 మినిట్స్’ అని సేవ్ చేసుకుందని తెలిపాడు. . మన జీవితంలోని చివరి క్షణాల్లో మనకు అత్యంత ముఖ్యమైన వ్యక్తులు గుర్తుకొస్తారనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టుకున్నట్లు బాబు చెప్పాడు. దీనికి బదులుగా తాను అమూల్య నంబర్‌ను ‘8 మినిట్స్’ అని సేవ్ చేసుకున్నానని నవ్వుతూ తెలిపాడు.

ఇక ప్రస్తుతం బాబు తన లవ్ స్టోరీ గురించి పలు విషయాలు ఆసక్తికరంగా చెప్పడం ఇపుడు మీడియాలో వీరి లవ్ స్టోరీ వైరల్ అవుతుంది.

ALSO READ :నానిని బావ అని ఎందుకు పిలుస్తానో తెలుసా? స్నిగ్ధ చెప్పిన అసలు విషయం ఇదే!

Tags

Related News

సుధీర్‌కు అంత క్రేజ్ ఉన్నా.. హీరోగా ఎందుకు సక్సెస్ కావట్లేదంటే ?

భయమేస్తోంది అంటున్న విజయ్.. రష్మిక.. బయటకు కనిపించవు సుమీ!

హమ్మయ్య.. పెళ్లెప్పుడో చెప్పేసిన ప్రదీప్..ఇక పీ పీ.. డుం డుం..

మంగ్లీ బతుకమ్మ పాట రెమ్యూనరేషన్ ఎంత? ఒక్కో పాటకు లక్షల్లో పారితోషికం

ఆ హీరోయిన్ కు ఫిదా అయ్యానంటున్న జగపతి బాబు..తన క్రష్ బయట పెట్టాడుగా?

జిమ్ జిమ్ తార ఫీవర్.. చిన్న పాటతో ఇంత పెద్ద సంచలనమా?

ప్రియుడు బిగ్ బాస్ కి.. సన్యాసం పుచ్చుకున్న ప్రియాంక!

Big Stories

Advertisement
×