KTR Discharge Petition: సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ నాంపల్లిలోని ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టుకు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరారు. దీనిపై ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టు వచ్చే నెలలో విచారణ జరుపనున్నట్టు సమాచారం.
Also Read: మహిళలకు కవిత బంపరాఫర్.. అధికారంలోకి వస్తే 50% రిజర్వేషన్లకు హామీ!
ఇప్పటికే ఈ కేసులో విచారణ జరిపిన ఏసీబీ అధికారులు ఛార్జ్ షీట్ లో కేటీఆర్ ను ఏ1 నిందితునిగా చేర్చిన విషయం తెలిసిందే. ప్రాసిక్యూషన్ కు గవర్నర్ అనుమతి లభించిన నేపథ్యంలో ఏసీబీ వేసిన ఛార్జ్ షీట్ ను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఇప్పటికే కేటీఆర్ రెండ సార్లు కోర్టు విచారణకు కూడా హాజరయ్యారు. ఇప్పుడు తాజాగా ఏసీబీ ఛార్జ్‌షీట్‌లో తన పేరును తొలగించాలంటూ కేటీఆర్ వేసిన డిశ్చార్జ్ పిటిషన్ వేశారు.
Also Read: ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్.. పెరిగిన ధరలు.. కానీ, ఫస్ట్ టైమ్ ఫ్రీగా ఆ సేవలు!