Telangana : గాలి జనార్థన్ రెడ్డి. ఓబులాపురం మైన్స్ డాన్. అక్రమంగా ఇనుప ఖనిజం తవ్వేసుకుని.. ఇష్టారాజ్యంగా అమ్మేసుకుని.. లక్షల కోట్లు సంపాదించారు. విలాసవంతమైన జీవితం గడిపారు. కర్నాటల, బళ్లారిలోని ఆయన ఇల్లు రాజసౌధంను తలపిస్తుంది. బంగారు పూత పూసిన కుర్చీలు, వస్తువులతో.. ఆబ్బో ఓ రేంజ్ లైఫ్ లీడ్ చేశారు. కట్ చేస్తే.. ఆ కేసులో ఇటీవలే ఆయనకు ఏడేళ్ల శిక్ష పడింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు గాలి జనార్థన్ రెడ్డి.
జైల్లో గాలి కష్టాలు..
ఇన్నేళ్లు లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన సంపన్నుడాయే. జైల్లో బతకడం అతనికి చాలా కష్టంగా మారింది. మన జైల్ అంటే ఎట్టా ఉంటాదో తెలిసిందేగా. అపరిశుభ్రత, దోమలు, డొక్కు ఫ్యాన్లు, తినబుద్ధి కాని తిండి.. ఆ కష్టాలు అనుభవించడం ఆయన వల్ల కావట్లేదు. అసలే ఎండాకాలం. ఏసీలో బతికిన ప్రాణం. జైల్లో అడ్జస్ట్ కాగలదా? ఫుడ్డు నుంచి బెడ్డు వరకూ.. అన్నీ ఇబ్బందులే. అందుకే, తనకు కాస్త వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాడు. చంచల్‌గూడ జైలులో స్పెషల్ కేటగిరీ కల్పించాలంటూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కోర్టులో నో రిలీఫ్
అయితే, రిమాండ్‌లో ఉన్న కొందరు ఖైదీలకు మాత్రమే అలాంటి స్పెషల్ కేటగిరీ వర్తిస్తుందని కోర్టు తెలిపింది. ఆల్రెడీ ఏడేళ్లు శిక్ష కన్ఫామ్ అయిన గాలి జనార్థన్‌రెడ్డికి చంచల్‌గూడ జైల్లో స్పెషల్ కేటగిరీ రిలీప్ ఇవ్వడానికి రూల్స్ ఒప్పుకోవంటూ అతని పిటిషన్‌ను డిస్మిస్ చేసింది నాంపల్లి సీబీఐ కోర్టు.