Suryapet District: సూర్యాపేట నేరేడుచర్లలో గ్యాంగ్ వార్ యాక్షన్ సినిమాని తలపించింది. నడిరోడ్డుపై విచక్షణా రహితంగా రెండు వర్గాల సభ్యులు కొట్టుకున్నారు. అందులో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. తొలుత నేరేడుచర్లకు చెందిన వర్గంపై పెంచికల్ దిన్నె వర్గం దాడి చేసింది. అనంతరం రంగంలోకి దిగిన నేరేడుచర్ల బ్యాచ్ పెంచికల్ దిన్నె వర్గంపై పిడిగుద్దులు, బండరాళ్లతో దాడి చేసింది. పోలీసులు రంగప్రవేశం చేసినా పరిస్థితి అదుపులోకి రాలేదు. పోలీసుల కళ్ళ ముందే వారు కొట్టుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
సూర్యపేట జిల్లా నేరేడుచర్లలో రెండు వర్గాలు దారుణంగా నడిరోడ్డుపై విచక్షణ రహితంగా గొడవుకు దిగాయి. ఈ దారుణంలో నలుగురు తీవ్రగాయాలు అయ్యాయి. గురు స్వామితో పాటు, మారెపల్లి రవి మరో ముగ్గురుకు తీవ్ర గాయాలు అవ్వడంతో హూజురునగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు పాత కక్ష్యల ఏమైనా ఉన్నాయా? లేదంటే బైక్ విషయంలో గొడవలు అయ్యాయా అని తెలియాల్సి ఉందని చెప్పారు.
Also Read: స్థానిక ఎన్నికల్లో మోదీ మంత్రం పనిచేస్తుందా?
ఘటన జరుగుతున్న సమయంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా అక్కడికి పోలీసులు వచ్చి వారిని అడ్డుకోగా.. గొడవ చేస్తున్న వ్యక్తులు ఎక్కువగా ఉండటం వల్ల స్థానికులు కూడా వారిని అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడంతో గోడవ పెరిగిపోయింది. అయితే ఈ ఘటనలో డ్రైనేజీలో పడిపోయినా వదిలిపెట్టకుండా పెంచికల్ దిన్నె వర్గంపై దాడి చేశారు. అలాగే పక్కనే ఉన్న బండ రాళ్లతో దాడి చేశారు.