BigTV English

Telangana BJP: స్థానిక ఎన్నికల్లో మోదీ మంత్రం పనిచేస్తుందా?

Telangana BJP: స్థానిక ఎన్నికల్లో మోదీ మంత్రం పనిచేస్తుందా?

Telangana BJP: బీజేపీ స్థానిక సంస్థలను ఎలా ఎదుర్కొందామనే మల్లగుల్లాలు పడుతుందా? అధికార, ప్రతిపక్ష పార్టీలకు కౌంటర్ అటాక్స్ ఇవ్వలేనీ నేతల తీరు స్థానికతలో పనిచేస్తుందా..? స్థానిక ఎన్నికల్లో సత్తా చాటడమేమో కానీ దిక్కుతోచని స్థితిలో నుంచి రాష్ట్ర నాయకత్వం బయట పడుతుందా..? మోడీ 3.O. 11 ఏండ్ల పాలన ఫార్ములా తెలంగాణలో పని చేస్తుందా..? చూద్దాం.


బీజేపీ నెక్స్ట్ టార్గెట్‌గా స్థానిక ఎన్నికలు

పార్లమెంట్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటిన కాషాయ పార్టీ NET TARGET స్థానిక సంస్థల ఎన్నికలుగా ఫిక్స్ చేసుకుంది. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల దూకుడుకు చెక్ పెట్టినట్లే.. వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ప్రణాళికలకు పదును పెడుతోంది. బీజేపీ 11 ఏండ్ల పాలనలో మోడీ ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వల్ల, సంక్షేమ పథకాల వల్లే గ్రామీణ ప్రాంత అభివృద్ధి సాధ్యమైందనేది ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే యోచనలో కాషాయ పార్టీ వర్గాలున్నాయి. మోడీ 3.0 ఫార్ములా గత పార్లమెంట్ ఎన్నికల్లో సక్సెస్ అయ్యేందుకు ఒక కారణంగా పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇక ఇదే ఫార్ములా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బాగా పనిచేసిందని, అదే జోష్ తో మోదీ 11 ఏండ్ల 3.0 ఫార్ములాను వచ్చే ఎనికల్లోనూ అప్లై చేసి స్థానిక ఎన్నికల్లో విజయ దుందుభి మోగించేందుకు కసరత్తులు మొదలు పెట్టారు.


స్థానిక ఎన్నికలపై రాష్ట్రా బీజేపీ వర్క్ షాప్

అందులో భాగంగానే స్థానిక ఎన్నికలపై రాష్ట్రా బీజేపీ వర్క్ షాప్ నిర్వహించుకుంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వర్క్ షాప్ లో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లు, రాష్ట్ర పదాధికారులు, జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర పొలిటికల్ వ్యవహారాల ఇంచార్జీ అభయ్ పాటిల్, బీజేపీ సంస్థాగత రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సునీల్ బన్సల్ హాజరయ్యారు. స్థానిక ఎన్నికలు, జూబ్లిహిల్స్ ఉప ఎన్నిక, బనకచర్ల, కాళేశ్వరం వంటి అంశాలతో పాటు ప్రస్తుత రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యక్రమాలపై రాష్ట్ర ఇంచార్జుల దశ- దిశ నిర్దేశం చేశారు.

ఏపీకి భారీ కేటాయింపులు, తెలంగాణకు గుండు సున్నా

ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం అవున్నామనే సంకేతాలు ఇస్తున్నారు సంఘ్ పరివార్ సభ్యులు. అయితే మోదీ పాలనపై పెరుగుతున్న వ్యతిరేకత నుంచి బయటపడ్లేక పోతున్నారనే మాట వినిపిస్తోంది. మోడీ 3.0 లో మాత్రం పొరుగున్న ఉన్న ఆంధ్రప్రదేశ్ కు భారీగా కేటాయింపులు చేసి తెలంగాణకు నిధులు ఇవ్వడకపోవడంతో బీజేపీపై తెలంగాణలో వ్యతిరేకత ఉంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతలు రోజూ రాష్ట్ర నిధుల అంశంలో బీజేపీని విమర్శనాస్త్రాలతో ఇరుకున పెట్టే ప్రయత్న చేస్తున్నారు. మోడీ 11 ఏండ్ల పాలనలో తెలంగాణకు గాడిద గుడ్డు అంటూ పెద్ద ఎత్తున బీజేపీ డొల్ల తనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రేవంత్ సర్కార్ స్ట్రాటజీ సక్సెస్ అయ్యిందనే టాక్ ఉంది. ఇక తాజాగా కాళేశ్వరం, అంశంలో ఈటల వ్యవహారం తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది. బనకచర్ల విషయంలో అటు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించలేక, ఇటు సొంత తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు చెప్పలేక ముందు నుయ్యి- వెనక గొయ్యి లాంటి పరిస్థితి. సీఎం రేవంత్ తెలివిగా బనకచర్ల అంశంలో బీజేపీని, బీఆర్ఎస్ ని కార్నర్ చేసేశారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో బలంగా సాగుతోంది

కాంగ్రెస్‌కి కౌంటర్ ఇవ్వలేని స్థితిలో బీజేపీ లీడర్స్

ప్రస్తుతం కాంగ్రెస్ నేతల విమర్శలకు కౌంటర్ అటాక్స్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో బీజేపీ నేతలు ఉన్నారు. ఒకరిద్దరు నేతలు మినహాయిస్తే ఇతర నేతలెవరూ దీనిపై నోరు మెదపడం లేదు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్లు తప్పితే ఇతర నేతలెవరూ కౌంటర్ అటాక్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారనిధి ఆ పార్టీ అంతర్గత వర్గాల సమాచారం.. మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎత్తుకున్న పాత పాటనే మళ్లీ పాడుతున్నారు. 11 ఏండ్ల నుంచి మోడీ కేటాయిస్తున్న నిధుల గురించే చెబుతున్నారు తప్ప.. పెద్దగా చేసిందేమీ లేదు. అంతేగాక వారి వారి అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ల అభివృద్ధిపై మాత్రమే స్పందించి, మిగతా అంశాలను అటకెక్కిస్తున్న పరిస్థితులున్నాయి. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేవలం ప్రెస్ మీట్లకు, ప్రెస్ నోట్లకే పరిమితమయ్యారు. మిగతా ఎంపీలు పూర్తిగా ఎవరి దారి వారిదే అన్నట్టుగా మౌనం వహిస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో రాష్ట్ర నాయకత్వం ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Also Read: కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. జూబ్లీహిల్స్ పల్స్ పట్టేదెవరు

గత ఏడాదిన్నరగా అధ్యక్షుడు ఎన్నికపై నాన్చుడు

ఇక ఎంపీ, ఎమ్మెల్యేల పరిస్థితులు అటుంచితే, సంస్థాగత ఎన్నికలు మరుగున పడ్డాయి, అదిగో పులి, ఇదిగో తోక అన్నట్టు గత ఏడాదిన్నర నుంచి అధ్యక్షుడు ఎంపికపై ఊరిస్తూ వస్తున్నారు. సంస్థాగతంగా ఎన్నికలు పూర్తి చేయలేని బీజేపీ రాష్ట్ర స్థానిక ఎన్నికలను ఎదురుకుంటుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. కేవలం మత పాచికల మాటున మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్న బిజెపి పరివార్ సభ్యుల ప్రణాళికలు స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా పని చేస్తుందో చూడాలంటున్నారు. అంతేకాదు తమ పార్టీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల నుంచి చేరికలు ఉంటాయి, ఇప్పటికే చాలా మంది నేతలతో సంప్రదింపులు జరుగుతున్నాయని అంటున్నారు. అయితే ప్రజలకు కావల్సింది నిజాలు కాదు- ఇలాంటి బిల్డప్పులే. అవే ప్రస్తుతం ఓట్లు తెచ్చిపెట్టే ఉపాయాలు, అవే పదవులను మోసుకొస్తాయి అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న పరిస్థితుల్లో కమలం పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికసిస్తుందా? వికటిస్తుందా? తేలాల్సి ఉంది.

Story By Adhi narayana, Bigtv

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×