8 Vasanthalu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చిన చాలామంది దర్శకులు సక్సెస్ అయ్యారు. అయితే షార్ట్ ఫిలిమ్స్ లోనే ఒక సెన్సేషన్ మధురం. కేవలం ఒక కాఫీ షాప్ లో సంభాషణలతో ఆ షార్ట్ ఫిలింను తీసిన విధానం చాలా మందిని అప్పట్లో ఆకట్టుకుంది. ఆ దర్శకుడు సినిమా చేస్తే చూడాలి అని చాలామంది ఆశపడ్డారు. అందుకని తను క్రౌడ్ ఫండెడ్ సినిమాను అనౌన్స్ చేసినప్పుడు. చాలామంది అతని టాలెంట్ నమ్మి డబ్బులు పంపించారు. ఆ దర్శకుడు మరెవరో కాదు, ఫణీంద్ర నరిశెట్టి. మను సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు ఫణి. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా కూడా ఆ సినిమాకు ఇప్పటికీ చాలామంది అభిమానులు ఉన్నారు. ఆ సినిమాలోని కొన్ని సంభాషణలను సోషల్ మీడియాలో వైరల్ చేసే కొంత మంది ఉన్నారు.
8 వసంతాలు తో మరోసారి
మను సినిమా తర్వాత ఫణీంద్ర దర్శకత్వం వహించిన సినిమా 8 వసంతాలు. ప్రముఖ బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చూడడానికి బాగానే ఉంటుంది. వాస్తవానికి మాట్లాడాలి అంటే పెద్దగా తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఫణి ఈ సినిమా రిలీజ్ కి ముందు కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడిన మాటలు ఈ సినిమా మీద నెగెటివిటీని తీసుకొచ్చాయి. మణిరత్నం సినిమాను ఈరోజు కామెంట్ చేస్తున్నారు వాళ్లకు ఏం అర్హత ఉంది అని ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. ఆ మాటను పట్టుకొని ఫణింద్రను అర్హత స్టార్ అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించకపోయినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. మరోవైపు కుబేర సినిమా కమర్షియల్ సక్సెస్ అవడంతో ఈ సినిమా కనుమరుగైపోయింది.
సక్సెస్ మీట్ కు డుమ్మా
8 వసంతాలు సినిమాను విపరీతంగా ఇష్టపడిన ఆడియన్స్ ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు ఎంత మేరకు ఖర్చు పెట్టిందో తెలియదు కానీ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ కి మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ సినిమానిచ్చింది. ఈ సినిమాను చూసిన తర్వాత ఒక రకమైన భావోద్వేగంతో బయటకు వస్తారు. రీసెంట్ టైమ్స్ లో ఒక సినిమా రిలీజ్ అయిన వెంటనే సక్సెస్ మీట్ పెట్టడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి రెండు రోజుల తర్వాత ఈ సక్సెస్ మీట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్. ఈ సక్సెస్ మీట్ కు ఫణీంద్ర హాజరు కాలేదు. దీనితో ఫణీంద్ర పైన మరోసారి ట్రోలింగ్ మొదలైంది. సక్సెస్ మీట్ కు హాజరుకావడానికి అర్హత సరిపోలేదా అంటూ కొంతమంది నెటిజిన్స్ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇక ఫణి దృక్కోణాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నెక్స్ట్ చేయబోయే కమర్షియల్ సినిమాతో ఖచ్చితంగా సక్సెస్ కొడతాడు అని చెప్పాలి. ఫణి కంటే కూడా సక్సెస్ సమాధానం చెప్పాలి అని ఆలోచన కూడా ఉండి ఉండి దర్శకుడు ఈ సక్సెస్ మీట్ కు హాజరు కాకపోవచ్చు.