Viral Video: గ్యాస్ సిలెండర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి పదే పదే చెబుతుంటారు. ఒక వేళ గ్యాస్ లీక్ అయినా ఇంట్లోకి వెళ్లద్దని హెచ్చరిస్తారు. లీకైన గ్యాస్ సిలెండర్ చూసి భయపడి పారిపోయింది ఓ మహిళ. గ్యాస్ పోయిందని భావించి ఇంట్లోకి వచ్చింది. ఒక్కసారిగా కిచెన్ నుంచి పెద్ద శబ్ధం వినిపించింది. మళ్లీ పరుగో పరుగు.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
లొకేషన్.. ఎక్కడ.. ఏంటనేది కాసేపు పక్కనబెడదాం. నాలుగైదు రోజుల కిందట ఒళ్లు గగుర్పొడిచే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జూన్ 18 సాయంత్రం ఐదు గంటల 15 నిమిషాల సమయంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యింది. లీకవుతున్న సిలిండర్‌ను బయటకు తెచ్చింది ఓ మహిళ.
సిలెండర్ పైపు పాములా మెలికలు తిరుగుతూ గ్యాస్ బయటకు వచ్చింది. దీంతో ఆ ఇంటి మహిళ భయంతో బయటకు పరుగులు తీసింది. గ్యాస్ లీకైన ప్రెజర్ కాస్త తగ్గడంతో ఇంట్లోకి వచ్చే ప్రయత్నం చేసింది. కిచెన్ గది ఓపెన్ చేసి ఉంది. బెడ్ రూమ్ తలుపు మూసి వుంది. ఆ గదికి రెండు వైపులా తలుపు ఓపెన్ చేసి ఉన్నాయి. ఇంతవరకు బాగానే ఉంది.
ఆ మహిళతో పాటు ఓ వ్యక్తి ఇరువైపుల నుంచి ఇంట్లోకి ప్రవేశించారు. సిలిండర్ పైపు తొలగించే ప్రయత్నం చేయడం మొదలుపెట్లారు. అప్పటికే కిచెన్ నుంచి చిన్నగా మంట రావడంతో మొదలైంది. లీకైన గ్యాస్ మొత్తమంతా వ్యాపించడంతో ఒక్కసారిగా బ్లాస్టర్ అయ్యింది. ఎలా వచ్చారో వారిద్దరూ అదే రూట్లో నుంచి బయటకు పరుగులు తీశారు.
ALSO READ: తెలియా భోలా ఫిష్‌లో పోషకాలెన్నో, చేప ఖరీదు 33 లక్షలా?
దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డోర్ ఓపెన్ చేయడంతో బతికి బయటపడ్డారని లేకుంటే దారుణమైన ప్రమాదం జరిగేదని అంటున్నారు నెటిజన్లు. ఈ వీడియోపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పదే పదే అధికారులు హెచ్చరిస్తున్నప్పటికీ ఎలా వెళ్లారని ప్రశ్నించిన వాళ్లు లేకపోలేదు.
పెను ప్రమాదం తప్పిందని మరికొందరు అంటున్నారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు వెరైటీ క్యాప్షన్లు పెడుతున్నారు. దయచేసి ఇలాంటి పని చేయవద్దు తస్మాత్ జాగ్రత్త.
They were fortunate that all doors and windows were open, allowing much of the gas to escape outdoors, significantly reducing the explosion's impact.
pic.twitter.com/fFnDIlHk5F— Ghar Ke Kalesh (@gharkekalesh) June 22, 2025