E-Paper
Advertisement

GHMC: జీహెచ్ఎంసీలో ఆగని అవినీతి రాజాలు.. వరుసగా ఏసీబీకి చిక్కుతున్న అధికారులు

GHMC: జీహెచ్ఎంసీలో ఆగని అవినీతి రాజాలు.. వరుసగా ఏసీబీకి చిక్కుతున్న అధికారులు

GHMC: స్వేఛ్చ బ్యూరో: బల్దియా ఖాయా పీయా చల్దియా అన్న నానుడికి తగిన విధంగానే జీహెచ్ఎంసీ అధికారులు వ్యవహారిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ అవినీతికి బ్రేక్ వేసేందుకు, త్వరితగతిన సేవలందించేందుకు సర్కారు ఎన్నిసంస్కరణలు తెచ్చినా ఫలితం లేకుండా పోతుంది. కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపు మొదలుకుని భవన నిర్మాణ అనుమతుల జారీ తో పాటు చివరకు బర్త్, డెత్ సర్టిఫికెట్లు జారీ చేయాలన్నా, చేతులు తడపడం తప్పటం లేదు. కనీసం కొత్త కమిషనర్ వచ్చారన్న భయం కూడా లేకుండా, బహిరంగంగా లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఎంత సమర్ధవంతమైన ఐఏఎస్ ఆఫీసర్ కమిషనర్ గా వచ్చినా, జీహెచ్ఎంసీలో అసినీతిని నిర్మూలించలేకపోవటం చర్చనీయాంశంగా మారింది. కనీసం అవినీతిపై వార్నింగ్ లు కూడా జారీ చేయకపోవటం అక్రమార్కులైన అధికారులకు వరంగా మారిందన్న వాదనలున్నాయి.

జీహెచ్ఎంసీ చరిత్రలో..

ప్రస్తుతం జీహెచ్ఎంసీ తరపున అందుతున్న సేవలను గాడీన పట్టేందుకు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న ప్రస్తుత కమిషనర్ కర్ణన్ హయాంలోనూ తాజాగా కూకట్ పల్లిలో ఓ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏకంగా రూ. 15 లక్షల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు చిక్కటం సంచలనాన్ని రేకెత్తించింది. జీహెచ్ఎంసీ పూర్వ కమిషనర్ ఇలంబరితి గత సంవత్సరం జోన్ల స్థాయిలో అక్రమ నిర్మాణాలను అదుపు చేసేందుకు ఏర్పాటు చేసిన జోనల్ లెవెల్ టాస్క్ ఫోర్స్ టీమ్ లలోని 27 మంది న్యాక్ ఇంజనీర్లను విధుల నుంచి తొలగించారు. జీహెచ్ఎంసీ చరిత్రలో అవినీతి ఆరోపణలతో ఏకంగా 27 మందిపై చర్యలు తీసుకోవటం జీహెచ్ఎంసీ చరిత్రలోనే ప్రథమం. అయినా అవినీతి మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. పైగా కొద్ది నెలల క్రితం ఐఎస్ సదన్ డివిజన్ లో వేయని రోడ్డును వేసినట్లు బిల్లులు క్లెయమ్ చేసి రూ. 14 లక్షలను అక్రమంగా డ్రా చేసుకున్న ఘటన కూడా జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగానికే దక్కింది. భవన నిర్మాణ అనుమతి జారీ చేసేందుకు సికిందరాబాద్ జోన్ ఆఫీసులోని టౌన్ ప్లానింగ్ కు చెందిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ ఏకంగా రూ. 8 లక్షల లంచం డిమాండ్ చేసి, అందులో రూ.4 లక్షలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చిక్కిన తర్వాత కూడా అవినీతి కట్టడిపై ఉన్నతాధికారులు దృష్టి సారించకపోవటం పలు అనునామాలకు తావిస్తుంది.

మూడు నెలల్లో ముగ్గురు అవినీతి

ఈ రకంగా ప్రతి జోన్, సర్కిల్ లోనూ ప్రతి సర్వీసుకు ఓ పత్ర్యేక టారీఫ్ ను అమలు చేస్తూ, ఓపెన్ గా లంచాలు, బేరసారాలు కొనసాగుతున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోవటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు నెలల క్రితం అర్బన్ బయోడైవర్శిటీకి చెందిన ఓ అసిస్టెంట్ డైరెక్టర్ రూ.80 వేలు లంచం తీసుకుంటూ చిక్కగా, అంతకు ముందు శేరిలింగంపల్లి జోన్ లో మరో ఇంజనీర్ కూడా లంచాలు తీసుకుంటూ వరుసగా మూడు నెలల్లో ముగ్గురు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కగా, తాజాగా మరో సూపరింటెండెంట్ ఇంజనీర్ ఏసీబీకి చిక్కటం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఇక ఇంజనీరింగ్ విభాగంలో పర్సెంటేజీలు చెల్లించినదే బిల్లులు చెల్లింపులు జరగటం లేదని ఇప్పటికే పలు సార్లు పలువురు కాంట్రాక్టర్లు బాహాటంగానే ఆరోపించారు. బిల్లింగ్ సెక్షన్ లోని కొందరు అధికారులైతే ముందుగానే తమ పర్సెంటేజీని వసూలు చేసుకుని, ఆ తర్వాత బిల్లుల చెల్లింపులు జరుపుతున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.

Also Read: Murder Case: సుత్తితో కొట్టి వృద్ధురాలి హత్య.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు

కింది నుంచి పై వరకు వాటాలు

జీహెచ్ఎంసీలో పని ఏదైనా లంచాలు చెల్లించుకోవాల్సిందే. టౌన్ ప్లానింగ్ కు చెందిన అసిస్టెంట్ సిటీ ప్లానర్ డిమాండ్ చేసే లంచంలో ఆయనపై విధులు నిర్వర్తించే డిప్యూటీ కమిషనర్ మొదలుకుని, జోనల్ కమిషనర్ల వరకు వాటాలున్నట్లు సమాచారం. ఈ రకంగా ప్రతి విభాగంలో కింది నుంచి పై స్థాయి వరకు వాటాలుండటం వల్లే అవినీతిపై సామాన్యులు, పౌరులు ఫిర్యాదులు చేస్తే ఉన్నతాధికారులు పట్టించుకోరన్న వాదనలున్నాయి. వీరిలో కొందరు అధికారులు లంచాల సొమ్మును తన వాటాగా క్యాష్ గా తీసుకుంటే, మరి కొందరు సామానులు, ఆభరణాలుగా తీసుకుంటున్నట్లు సమాచారం. టౌన్ ప్లానింగ్ లంచాల వేధింపులు భరించలేక గతంలోఓ ఇంటి యజమానికి ఆత్మహత్యాయత్నం కూడా చేసిన సందర్భాలున్నాయి. జీహెచ్ఎంలోని మెడికల్, హెల్త్ విభాగంలో కీలక విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిణి జీహెచ్ఎంసీలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా రూ. 20 కోట్ల అక్రమాస్తులు కూడబెట్టుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయంటే ఈ స్థాయిలో అవినీతి జరుగుతుందో అంచనా వేసుకోవచ్చు.

చిన్న నిర్మాణాలను సైతం వదలటం లేదు

గ్రేటర్ పరిధిలో మధ్య తరగతి, పేదవర్గానికి చెందిన ప్రజలు నివసించే బస్తీలు, మురికివాడల్లోని 40 నుంచి 80 గజాల్లో ఇంటిని నిర్మించుకోవాలన్నా, స్థానిక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు లంచాలు చెల్లించాల్సిందే. రూల్స్ ప్రకారం 122 గజాల కన్నా ఎక్కువ ఏరియా ఉంటేనే నిర్మాణ అనుమతి తప్పనిసరి. కానీ అంతకన్నాతక్కువ విస్తీర్ణంలో ఉన్న ప్లాటులో ఇళ్లు నిర్మించుకునేందుకు పర్మిషన్ అవసరం లేకపోయినా, స్థానిక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలన్న నిబంధన ఉంది. ఈ నిబంధనను అడ్డం పెట్టుకుని టౌన్ ప్లానింగ్ విభాగంలో ఫీల్డు లెవెల్ లో విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది పేద, మధ్య తరగతి ప్రజలను సైతం దోచుకుంటున్నారు. వారు అడిగినంత లంచం చెల్లించకుంటే పనులు నిలిపేసి, వేధింపులకు గురి చేస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.

Also Read: Regina Cassandra: మీడియాకు చాలా పద్ధతిగా వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్..!

Related News

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Big Stories

×