E-Paper
Advertisement

TG TET Results 2026: టెట్‌ పరీక్షలో అనూహ్య పరిణామం.. గతేడాది కంటే పెరిగిన పర్సంటేజీ..?

TG TET Results 2026: టెట్‌ పరీక్షలో అనూహ్య పరిణామం.. గతేడాది కంటే పెరిగిన పర్సంటేజీ..?
Advertisement

TG TET Results 2026: బ్యూరో స్వేచ్ఛ: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్(టెట్) ఫలితాలు రిలీజ్ అయ్యాయి. మంగళవారం అధికారికంగా విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను విడుదలచేశారు. టెట్ కన్వీనర్ రమేష్ ఈమేరకు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఫైనల్​ కీతో పాటు ఫలితాలను https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టినట్టు తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలు తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. తెలంగాణలో జనవరి 3 నుంచి 20 వరకు టెట్ పరీక్​సలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో మొత్తం 1,95,181 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా అందులో 1,00,270 మంది(51.37 శాతం) క్వాలిఫై అయ్యారు. అంటే సగానికి పైగా అభ్యర్థులు అర్హత సాధించారు. ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పించే పేపర్-1లో అభ్యర్థులు భారీగా ఉత్తీర్ణత సాధించారు.

ఈ సారీ..

ఇందులో ఏకంగా 72 శాతం మంది క్వాలిఫై అయ్యారు. మొత్తం 71,198 మంది రాస్తే.. 51,266 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 2లో 39.11శాతం అర్హత సాధించారు. దీంట్లో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్​ లో 69,861 మంది రాస్తే.. 29,598 మందే (42.37 శాతం) అర్హత సాధించారు. సోషల్ స్టడీస్ లో 54,122 మంది రాయగా 19,406 మంది (35.86 శాతం) మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఇదిలా ఉండగా గత టెట్ తో పోలిస్తే టెట్ పాస్ పర్సంటేజీ భారీగా పెరిగింది. గతేడాది జూన్ లో నిర్వహించిన టెట్ లో పేపర్​ 1 లో 61.50 శాతం కాగా ఈసారి 72 శాతానికి పెరిగింది. గతేడాది పేపర్ 2లో 33.98 శాతం మంది అభ్యర్థులు క్వాలిఫై కాగా ఈసారి పాస్ పర్సంటేజీ 39.11 శాతానికి పెరిగింది. ఇదిలా ఉండగా టెట్ ఫలితాల్లో ఇన్ సర్వీస్ టీచర్లు సత్తా చాటారు. పేపర్1లో 25,387 మంది రాస్తే.. 19,557 మంది క్వాలిఫై అయ్యారు. పేపర్​2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ లో 23,293 మందికి 11,444 మంది, సోషల్ స్టడీస్ లో 16,925 మందికి 6,892 మంది అర్హత సాధించారు.

Advertisement

Also Read: DGP Shivadhar Reddy: మీ ఆరోపణలలో అనువంత కూడా నిజం లేదు: డీజీపీ శివధర్ రెడ్డి

అర్ధరాత్రి టెట్ అధికారిక వెబ్‌సైట్లో..

ఇదిలాఉండగా తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫలితాల విడుదల అభ్యర్థులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చిన అధికారులు, కేవలం గంట వ్యవధిలోనే వాటిని తొలగించడం ఈ గందరగోళానికి కారణమైంది. చాలా కాలంగా ఫలితాల కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు, సోమవారం అర్ధరాత్రి టెట్ అధికారిక వెబ్‌సైట్లో ఫలితాల లింక్ ప్రత్యక్షం కావడంతో అప్రమత్తమయ్యారు. కొందరు అభ్యర్థులు తమ ఫలితాలను చూసుకున్నారు. అయితే కాసేపటికే వెబ్‌సైట్ నుంచి ఆ లింక్‌ను తొలగించడమే కాకుండా, సైట్ ఓపెన్ కాకుండా నిలిపివేయడంతో అభ్యర్థుల్లో గందరగోళం మొదలైంది. ఈ పరిణామంపై విద్యాశాఖను పలువురు సంప్రదించగా ఇది కేవలం టెస్టింగ్ ప్రక్రియలో భాగంగా జరిగినట్లు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. వెబ్‌సైట్ సర్వర్ సామర్థ్యాన్ని, సాంకేతిక అంశాలను సరిచూసే క్రమంలో ఫలితాల లింక్ పొరపాటున లైవ్‌లోకి వచ్చిందని అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. సాంకేతిక కారణాల వల్ల సోమవారం రాత్రి ఫలితాలు డిస్ ప్లే అయ్యాయని విద్యాశాఖ అధికారులు చెబుతన్నారు. దాదాపు 10 శాతం మంది ఫలితాలు చూసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఎట్టకేలకు మంగళవారం అధికారికంగా ఫలితాలు విడుదల చేయడంతో అంతా సద్దుమణిగింది.

పేపర్ హాజరైన వారు క్వాలిఫై పాస్ %

Advertisement

పేపర్-1 71,198 51,266 72.00%
పేపర్-2(మ్యాథ్స్ అండ్ సైన్స్) 69,861 29,598 42.37%
పేపర్-2 (సోషల్) 54,122 19,406 35.86%
మొత్తం 1,95,181 1,00,270 51.37%

Also Read: Wrong Side Driving: రాంగ్ సైడ్ డ్రైవింగ్ పై స్పెషల్ డ్రైవ్.. వారంలో 21,713 కేసులు నమోదు

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×