Hyderabad News: పచ్చదనం ఆర్యోగానికి మంచిదని చాలా మంచిదని అంటారు. అయితే రకరకాల చెట్లు నాటడం వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అందుకు ఎగ్జాంఫుల్ కోనోకార్పస్ చెట్లు. పచ్చదనం కంటే ఇవి తెచ్చే చేటు అంతా ఇంతా కాదు. మానవాళికి రెస్పిరేటరీ సమస్యలు ఏర్పడతాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆ తరహా చెట్లను మళ్లీ నాటే ఆలోచన లేదన్నది ప్రభుత్వ అధికారుల మాట.
కోనోకార్పస్ చెట్లపై వేటు
గ్రేటర్ హైదరాబాద్‌లో పరిధిలో దాదాపు రెండు నుంచి మూడు లక్షల వరకు కోనోకార్పస్ చెట్లు ఉన్నాయి. గతంలో హరితహారం పేరుతో ఆనాటి పాలకులు వీటిని పెద్ద ఎత్తున నాటారు. అయితే వీటివల్ల ఇతర చెట్లకు, మానవాళికి రెస్పిరేటరీ సమస్యలు తలెత్తుతాయని తెలుస్తోంది. కోనో కార్పస్ మొక్కలు కొనడానికి ఒక్కోదానికి రూ.100 కు పైగా ఖర్చు చేశారు. రాబోయే రోజుల్లో ఆయా చెట్లను నాటే ఆలోచన లేదని స్పష్టంచేశారు అధికారులు.
కోనో కార్పస్ చెట్లను పలు దేశాలు నిషేధించాయి. విదేశాలో వీటిని నాటడం చట్ట రీత్యా నేరం కూడా. భారత్‌లోని పలు సిటీల్లో కోనో కార్పస్ చెట్లను అనవసరంగా నాటుతున్నారనే విమర్శలు లేకపోలేదు. వీటివల్ల మానవుల కు ఇబ్బందికరంగా మారుతుందని అంటున్నారు హార్టికల్చర్ అధికారులు.
అసెంబ్లీ సమావేశాల్లో చర్చ
అసెంబ్లీ సమావేశాల్లో ఈ వ్యవహారంపై చర్చ జరిగింది. దీనిపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయా చెట్లను తొలగించాలని, ప్రభుత్వానికి సూచన చేశారు కూడా. స్పీకర్ వ్యాఖ్యలు చేసిన రెండుమూడు రోజుల్లో టోలీచౌక్ నుంచి షేక్‌పేట్‌కు వెళ్లే దారిలో డివైడ్ మధ్యలో ఉన్నాయి. ప్రస్తుతం ఆయా చెట్లను తొలగిస్తున్నారు. ఈ చెట్లు మిగతా మొక్కలు పెరగవి, ఎదిగినకొద్దీ ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు.
ALSO READ: రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం, నెంబర్ ప్లేట్ల విషయంలో వాహనదారులకు అలర్ట్
వేగంగా పెరుగుతాయని వీటిని ఏర్పాటు చేశామని అంటున్నారు అధికారులు. ప్రస్తుతం ఆయా చెట్లను మెల్లమెల్లగా తొలగించే ప్రక్రియ జరుగుతుందని హార్టికల్చర్ అధికారుల మాట. కోన్ ఆకారంలో అందంగా, ఆకర్షణీయం గా కనిపిస్తాయి ఈ చెట్లు. రహదారుల మధ్య డివైడర్లలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ చెట్లకు సంబంధించిన పువ్వులు, పళ్లు లక్షల్లో ఉంటాయి.
జంతువులు, మనుషులకు హానికరం
వీటిని పక్షులు తినవు, ఆయా చెట్లపై తొండలు గుడ్లు పెట్టవు కూడా. వీటివల్ల మనుషుల ఆరోగ్యానికి హానికరమని హార్టికల్చర్ అధికారుల మాట. దగ్గు, జలుబు, ఉబ్బసం, శ్వాసకోశ రుగ్మతలు వచ్చేలా చేస్తుందని చెబుతున్నారు. చెట్లు ఎదిగిన కొద్దీ భూమిలో డ్రైనేజ్ పైపులను నాశనం చేస్తాయని అంటున్నారు.
హెచ్ఎండీఏ పరిధిలో ఆ తరహా మొక్కలను ఎక్కువగా నాటారు. వీటిని పూర్తిగా నరికి వేయకుండా నియంత్రించాలని అధికారుల ఆలోచన. చెట్లు పెరగకుండా ఎప్పటికప్పుడు అందంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ చెట్లపై అటవీశాఖకు పురపాలక శాఖ అధికారులు లేఖ రాశారు.
ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నది జీహెచ్ఎంసీ అధికారుల మాట. ఈ మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వకూడదని కేంద్రం నుంచి సర్క్యులర్ వచ్చిందని అంటున్నారు. స్థానిక మొక్కలకే ప్రయార్టీ ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.
GHMC పరిధిలో 2 లక్షలకు పైగా కోనోకార్పస్ చెట్లు
గతంలో హరితహారం పేరుతో పెద్ద ఎత్తున కోనోకార్పస్ మొక్కలు నాటిన అధికారులు
వీటి వల్ల ఇతర చెట్లకు, మానవాళికి రెస్పిరేటరీ సమస్యలు
కోనోకార్పస్ మొక్కలు కొనడానికి ఒక్కోదానికి రూ.100 కు పైగా ఖర్చు
పంజాగుట్ట, ఖైరతాబాద్, టోలిచౌకీతో పాటు ఇతర… pic.twitter.com/thQg1MJjYz
— BIG TV Breaking News (@bigtvtelugu) April 10, 2025