Peddi Shooting Update:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో ‘పెద్ది’ అనే సినిమాతో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్గా నటిస్తోంది. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక అప్డేట్ వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళితే.. ఈ సినిమాలోని మాస్, యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ గత నాలుగు రోజులుగా సికింద్రాబాద్ లో ఉన్న మౌలాలి రైల్వేస్టేషన్లో జరుగుతోంది. ఒక చిన్న ఫైటింగ్ కి సంబంధించిన సన్నివేశాలను అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈరోజు కూడా అక్కడే షూటింగ్ చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల అభిమానులు కూడా తమ అభిమాన హీరో రామ్ చరణ్ ను నేరుగా చూడడానికి ఎగబడుతున్నట్లు సమాచారం.
ఫస్ట్ షాట్ తో ఫ్యాన్స్ ను మెప్పించిన చరణ్..
ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే.. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ లుక్ కి సంబంధించిన పోస్టర్ ను రివీల్ చేశారు. కానీ ఈ పోస్టర్ విపరీతమైన నెగిటివిటీని మూటగట్టుకుంది. ముఖ్యంగా పుష్పరాజ్ గెటప్ లో రామ్ చరణ్ ఉన్నాడు అని చాలామంది నెగటివ్ కామెంట్లు గుప్పించారు. ఇంకా ఈ విషయంపై బుచ్చిబాబు పై ఫైర్ అయిన రామ్ చరణ్.. ఆ తర్వాత చాలా పగడ్బందీగా ఫస్ట్ షాట్ విడుదల చేయడం జరిగింది. ఇక ఇందులో రామ్ చరణ్ లుక్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఈ షాట్ చాలా బాగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా 24 గంటల్లోనే 30 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది.
ఏఐతో అద్భుతం సృష్టించిన రామ్ చరణ్ ఫ్యాన్స్..
ఇదిలా ఉండగా..ఈ షాట్ లో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అలరించారు. ఇప్పుడు ఇదే డైలాగ్ కు సంబంధించిన ఏఐ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “ఓకే పని సెసేనాకి.. ఓకే నాగ బతికేనాకి.. ఇంత పెద్ద బతుకెందుకు? ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే సేసెయ్యాల.. పుడతామా యేటి మళ్లీ! “అనే డైలాగును అచ్చం రామ్ చరణ్ చెప్పినట్లే ఏఐతో ఒక వీడియో క్రియేట్ చేశారు. ఇక ఈ వీడియోని చరణ్ అభిమానులు తెగ షేర్ చేస్తూ చాలా బాగుందంటూ ప్రశంసిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇది నిజంగా చరణ్ చెప్పినట్లే ఉంది అంటూ ఆశ్చర్యపోతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ (AR Rahman) స్వరాలు అందిస్తున్నారు. క్రీడా నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రామ్ చరణ్ చాలా కొత్తగా భిన్నంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక వచ్చే ఏడాది భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా అటు రామ్ చరణ్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.