E-Paper
Advertisement

Hyderabad News: జీహెచ్ఎంసీ పునర్విభజన.. మూడు కమిషనరేట్లలో కీలక మార్పులు, ఇకపై కొత్తగా

Hyderabad News: జీహెచ్ఎంసీ పునర్విభజన.. మూడు కమిషనరేట్లలో కీలక మార్పులు, ఇకపై కొత్తగా
Advertisement

Hyderabad News: జీహెచ్ఎంసీ విస్తరణ తర్వాత పోలీస్ శాఖలో కీలక మార్పులు జరుగుతున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలోని మూడు పోలీస్ కమిషరేట్లలో భారీ ప్రక్షాళన ఉండబోనుంది. మూడు కమిషనరేట్లను 12 జోన్లుగా విభజించనున్నారు. అందులో ఎక్కువ భాగం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

జీహెచ్ఎంసీ పునర్విభజన

Advertisement

జీహెచ్ఎంసీ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు వరకు విస్తరించింది. గతంలో ఉన్న జీహెచ్ఎంసీ పరిధి అమాంతంగా పెరిగింది. పరిధి పెరగడంతో పోలీసు కమిషనరేట్లలోనూ కీలక మార్పులు జరగనున్నాయి. కొత్తగా విస్తరించిన జీహెచ్ఎంసీని 12 జోన్లుగా చేయనున్నారు. అందులో హైదరాబాద్‌ కమిషనరేట్‌కు ఆరు జోన్లు, సైబరాబాద్‌కు మూడు జోన్లు, రాచకొండ కమిషనరేట్‌ను మరో మూడు జోన్లు ఉండనున్నాయి.

ఇందులోభాగంగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్లు వెళ్లాయి. దీంతో చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉండనున్నాయి.

Advertisement

మూడు పోలీసు కమిషనరేట్లలో కీలక మార్పులు

ఇక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో మార్పులు జరిగాయి. గతంలో శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ ఉన్నాయి. ఇప్పుడు మొయినాబాద్ నుంచి పటాన్‌చెరు వరకు శేరిలింగంపల్లి‌ జోన్ విస్తరించింది. మాదాపూర్‌ను కూకట్‌పల్లి జోన్‌లో కలిపేశారు. గతంలో ఉన్నమాదిరిగానే కుత్బుల్లాపూర్ అలాగే ఉంచారని తెలుస్తోంది.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోకి పెద్ద జోన్లు రానున్నాయి. వాటిలో ఎల్బీనగర్, మల్కాజ్‌గిరి, ఉప్పల్ జోన్లు ఉన్నాయి. గతంలో ఈ కమిషనరేట్ పరిధిలో యాదాద్రి జిల్లా ఉండేది. తాజాగా యాదాద్రి జిల్లా సెపరేట్ చేసి జిల్లా ఎస్పీ పరిధిలోకి రానుంది. మహేశ్వరం జోన్, షాద్ నగర్, చేవెళ్ల జోన్లను కలుపుతూ ‘ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌’గా ఏర్పాటు చేయాలన్నది పోలీసు శాఖ ఆలోచనగా తెలుస్తోంది.

ALSO READ:  మేడారానికి పోటెత్తిన భక్తులు..  సెలవులు కావడంతో కిక్కిరిసిన జనం

గతంలో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు కొత్తగా ఏర్పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధి పెరగడంతో లా అండ్ ఆర్డర్ మరింత పటిష్టం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు అధికారులతో శనివారం డీజీపీ సమావేశమయ్యారు.

అన్ని కోణాల్లో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై రేపో మాపో జోన్లపై డీజీపీ ఉత్తర్వులు ఇవ్వనున్నారని పోలీసులు వర్గాలు చెబుతున్నాయి. క్రైమ్ ఎక్కడైతే ఎక్కువగా జరుగుతుందో వాటిని జోన్లుగా డివిజన్ చేశారు. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. దీనివల్ల క్రైమ్ రేటు తగ్గే అవకాశముందని భావిస్తోంది.

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×