Big Stories

Lok Sabha Elections 2024: ముగిసిన తొలి విడత లోక్ సభ ఎన్నికలు.. టాప్‌లో త్రిపుర..!

Lok Sabha Elections 2024: దేశవ్యాప్తంగా తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 102 లోక్ సభ స్థానాలకు గాను నిర్వహించిన తొలి దశ పోలింగ్ సాయంత్ర 6 గంటలకు ముగిసింది.

- Advertisement -

21 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ ఎన్నికల్లో మొత్తం 21 రాష్ట్రాల్లో 59.71 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పశ్చిమబెంగాల్ లో అత్యధికంగా 77.57 శాతం పోలింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. బీహార్ లో అత్యల్పంగా 46.32 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈ తొలి విడతలో గతంలో కంటే ఎక్కువగానే పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

1.అండమాన్ అండ్ నికోబార్- 56.87
2.అరుణాచల్ ప్రదేశ్-64.07
3.అస్సాం-70.77
4.బీహార్-46.32
5. చత్తీస్‌గఢ్-63.41
6.జమ్ముకశ్మీర్-65.08
7.లక్షద్వీప్-59.02
8.మధ్యప్రదేశ్-63.25
9.మహారాష్ట్ర-54.85
10. మణిపూర్-68.62
11.మేఘాలయ-69.91
12.మిజోరాం-53.96
13.నాగాలాండ్-56.18
14.పాండిచ్చేరి-72.84
15.రాజస్థాన్-50.27
16.సిక్కిం-68.06
17.తమిళనాడు-62.08
18.త్రిపుర-80.17
19.ఉత్తరప్రదేశ్-57.54
20.ఉత్తరాఖాండ్-53.56
21.పశ్చిమబెంగాల్-77.57

మణిపూర్ లో చిన్నచిన్న ఘర్షణలు స్థానిక ఓటర్లను భయపెట్టినా సరే.. మిగతా అన్ని చోట్లా ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. కాగా, ఈ ఎన్నికల్లో పలువురు సినీతారలు, సీనియర్ రాజకీయ నాయకులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News