Amarnath: వైసీపీకి కొత్త టెన్షన్ మొదలైందా? సోషల్ మీడియా వ్యవహారమంతా ఆ పార్టీ మెడకు చుట్టుకుంటుందా? దాని నుంచి బయటపడలేమని భావించి వైసీపీ తప్పుకునే ప్రయత్నం చేస్తుందా? అరెస్టయిన సోషల్ మీడియా కార్యకర్తలకు.. తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేస్తుందా? అవుననే అంటున్నారు ఆ పార్టీనేతలు.
సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై ఏపీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఒకొక్కరుగా అరెస్ట్ చేస్తున్నారు. దీంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనికి సంబంధించి పిటిషన్లను అత్యవసరంగా విచారించలేమని తోసిపుచ్చింది. దీంతో వైసీపీ ఊహించని షాక్ తగిలింది. ఇప్పుడు ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది వైసీపీ.
న్యాయస్థానం చేతులెత్తేయడంతో వైసీపీ హైకమాండ్ అలర్టయ్యింది. అరెస్టయిన వారికి, సోషల్ మీడియాలో వల్గర్ కామెంట్స్ చేసిన వారికి ఏ మాత్రం సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.
లేటెస్ట్‌గా గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోరుగడ్డ అనిల్‌కు మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చాశారాయన. ఎవరికి నచ్చినట్టు వారు మాటలు ఆడుతున్నారని, తాము ఫలానా ఫార్టీ అంటూ క్లయిమ్ చేసుకుంటున్నారని అన్నారు. వారికీ మా పార్టీ అసలు సంబంధమే లేదన్నది మాజీ మంత్రి గుడివాడ వెర్షన్.
ALSO READ: ఏపికి రెయిన్ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు!
వైసీపీ హార్డ్‌కోర్ అభిమానుల్లో శ్రీరెడ్డి కూడా ఒకరు. శ్రీరెడ్డి అంటే వైసీపీ.. వైసీపీ అంటే శ్రీరెడ్డి అని నేతలు, కార్యకర్తలు బలంగా చెబుతారు. శ్రీరెడ్డి ఎవరు మాకు తెలీదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి గుడివాడ. ఆమెకి పార్టీ సభ్యత్వం ఉందా? దీనిపై అప్పుడే మీరు అడిగే చెప్పేవారమన్నారు. ఎవరు పడితే వారు మాట్లాడితే సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదని తేల్చేశారు.
మాజీ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి రియాక్ట్ అవుతుందా? గడిచిన ఐదేళ్లు వైసీపీ సోషల్ మీడియాలో జరిగిన లోగుట్టు బయట పెడుతుందా? ఇది కేవలం శ్రీరెడ్డి లాంటి వారికి మాత్రమే కాదు.. ఆమె మాదిరిగా చాలామంది ఉన్నారట. వారి పరిస్థితి ఏంటన్నది అసలు ప్రశ్న.
లేటెస్ట్‌గా వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన గురించి ఇటీవల పోలీసులు స్వయంగా మీడియా ముందుకొచ్చి అసలు విషయాలు బయటపెట్టారు. అవినాష్ ఏపీ రాఘవరెడ్డి చెబితేనే తాము పోస్టులు పెట్టానని తెలిపారు. లేటెస్ట్‌గా వర్రా రవీంద్రారెడ్డి ఎవరో తమకు తెలీదని అంటోంది వైసీపీ. ఈ మేరకు ఎక్స్‌లో ప్రస్తావించిందవి.
భారతి రెడ్డి వద్ద పీఏగా వర్రా రవీంద్రారెడ్డి ఏరోజూ పని చేయలేదన్నారు. ఓ ప్లాన్ ప్రకారం టీడీపీ దుష్ప్రచారం చేసిందని దుయ్యబట్టింది. దీనివెనుక ఐ-టీడీపీ ఉందన్నది ప్రస్తావించింది. షర్మిల, సునీతలను కించపరుస్తూ పోస్టులు పెట్టడం టీడీపీ కుట్ర రాసుకొచ్చింది. జరుగుతున్న పరిణామాలను గమనించినవారు, అవసరానికి ఉపయోగించుకుని తమకు తెలీదనే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు కొందరు నేతలు.