BigTV English

Sankranti: బాలయ్యకు జగన్ గుడ్ న్యూస్.. వీరసింహారెడ్డికి పండగే.. వాల్తేరు వీరయ్యకు కూడా..

Sankranti: బాలయ్యకు జగన్ గుడ్ న్యూస్.. వీరసింహారెడ్డికి పండగే.. వాల్తేరు వీరయ్యకు కూడా..

Sankranti: పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ అంటే ఏపీలో అదో టెన్షన్. జగన్ సర్కారు ఏ రూపంలో అడ్డుకుంటుందనే ఆరాటం. భీమ్లా నాయక్ సమయంలో టికెట్ రేట్లు తగ్గించి.. పవన్ సినిమాను దెబ్బకొట్టాలని చూశారంటారు. ఆ తర్వాత టికెట్ ధరల తగ్గింపు అనేక మలుపులు తిరిగి.. మళ్లీ మామూలు స్థితికి వచ్చింది. తాజాగా, ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ పొలిటికల్ వార్ జోరుగా సాగుతుండగా.. ఈ సమయంలో సంక్రాంతికి ఎమ్మెల్యే కం హీరో బాలయ్య సినిమా రిలీజ్ అవుతుండటంతో మరోసారి ఉత్కంఠ. ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయా? అనే అనుమానం. కానీ, ఒకప్పుడు బాలయ్య ఫ్యాన్ అయిన జగన్.. వీరసింహారెడ్డికి గుడ్ న్యూసే చెప్పారు. సంక్రాంతికి సినిమా టికెట్ ధరలు పెంచేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య మూవీకి కూడా టికెట్ రేట్ల పెంపు వర్తిస్తుంది.


పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్‌ ధరలు పెంచుకునేలా గతంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. సంక్రాంతికి విడుదలవుతున్న ‘వీరసింహారెడ్డి’ (veera simha reddy), ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya) టికెట్‌ ధరలను గరిష్టంగా రూ.70 పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ.. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఏపీ సర్కారును కోరింది. అయితే, టికెట్‌పై మాగ్జిమమ్ రూ.45 (జీఎస్టీ అదనం) పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం మరింత బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్పెషల్‌ షోలకు అనుమతి ఇచ్చింది. సంక్రాంతికి ఏకంగా 6 షోలు ప్రదర్శించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే, పండుగ నాడు తెల్లవారుజాము 4 గంటలకే అసలైన సినిమా పండగ మొదలైనట్టే.


జనవరి 12న బాలకృష్ణ (Balakrishna) నటించిన ‘వీరసింహారెడ్డి’.. జనవరి 13న చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కానున్నాయి. రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసనే హీరోయిన్. రెండూ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోనే వస్తున్నాయి. గతంలో సంక్రాంతికి ఒకేసారి బాలయ్య, చిరు సినిమాలు రిలీజ్ అయితే.. ఆ రెండు చిత్రాల మధ్య తీవ్ర పోటీ ఉండేది. ఫ్యాన్స్ నువ్వా-నేనా అన్నట్టు రెచ్చిపోయేవారు. కానీ, ఈసారి అంతా ఓ అండర్ స్టాండింగ్ లో ఉన్నారు. అన్ స్టాపబుల్ షోతో నందమూరి-అల్లు-మెగా కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం పెరిగింది. సో, ఈసారి సంక్రాంతికి బాలయ్య వర్సెస్ చిరంజీవిల మధ్య ఫ్రెండ్లీ ఫైటింగ్ ఉండబోతోంది.

Tags

Related News

AP Liquor Case: లిక్కర్ కేసులో కొత్త విషయాలు.. ముడుపుల చేర్చడంలో వారే కీలకం, బిగ్‌బాస్ చుట్టూ ఉచ్చు

Pulivendula bypoll: పులివెందుల జెడ్పీ బైపోల్.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు, ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Big Stories

×