E-Paper
Advertisement

MLA Committees: శాసనసభలో సరికొత్త వ్యూహం.. ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు..?

MLA Committees: శాసనసభలో సరికొత్త వ్యూహం.. ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు..?
Advertisement

MLA Committees: స్వేచ్ఛ బ్యూరో: ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్లు ఇచ్చేలా అధికార పార్టీ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేయనున్నది. ఇప్పటికే సబ్జెక్టుల ఇంట్రస్టులపై ఎమ్మెల్యేల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. శాసన సభ్యులకు ఆసక్తి ఉన్న అంశాల ఆధారంగా కమిటీలను రూపొందించనున్నారు. ఈ కమిటీలు సభతో పాటు సభ బయట కూడా డిస్కషన్ చేసేందుకు పనిచేయనున్నాయి. ప్రతిపక్ష పార్టీల సభ్యులకు గట్టి కౌంటర్ ఇచ్చేందుకు ఈ కమిటీలు పూర్తి స్థాయిలో పనిచేస్తాయని ఓ ఎమ్మెల్యే తెలిపారు. సాధారణంగా శాసనసభ అంటే ఎమ్మెల్యేల మధ్య అత్యధికంగా విమర్శలు, ప్రతివిమర్శల పర్వం కొనసాగుతుంది. పొలిటికల్ అంశాల్లోనే కౌంటర్లు జరుగుతుంటాయి. కానీ ఈ దఫా పొలిటికల్ తో పాటు సబ్జెక్ట్ ల వారీగానూ కౌంటర్లు జరగాలని ప్రభుత్వం సూచించింది. ఇందుకు కమిటీలు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉన్నదని సీఎం కూడా సూచించినట్లు తెలిసింది. ఈ బడ్జెట్ సమావేశాల నుంచే దీన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.

ఎమ్మెల్యేలకు అనుభవం..

వాస్తవానికి ప్రతి ఎమ్మెల్యేకు ఒక ప్రత్యేక రంగంపై అవగాహన, ఆసక్తి ఉంటుంది. కొందరికి వ్యవసాయంపై పట్టు ఉంటే, మరికొందరికి విద్య, వైద్యం లేదా సాంకేతిక రంగాలపై అవగాహన ఉంటుంది.దీంతో ఎవరికి ఏయే అంశాల్లో ఆసక్తి ఉన్నదనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని, ఆయా కమిటీల్లో ఎమ్మెల్యేలను కేటాయించున్నారు. అంతేగాక ఎమ్మెల్యేల అనుభవం, అవగాహన, వ్యక్తిగత మైలేజ్ వంటి అంశాలను కూడా కమిటీలో ప్రమాణికంగా తీసుకోనున్నారు. దీనివల్ల ఆయా రంగాలు, శాఖలకు సంబంధించిన బిల్లులు సభలో చర్చకు వచ్చినప్పుడు క్వాలిటీ డిస్కషన్ జరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది.

Advertisement

Also Read: Ugadi 2026: ఉగాది ఎప్పుడు ? ఈ ఏడాది కొత్త సంవత్సరం పేరేంటో తెలుసా ?

మంత్రులకు నివేదికలు..

ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలపై పూర్తి స్థాయి డేటాతో మాట్లాడటం, శాఖల వారీగా వచ్చే బడ్జెట్ కేటాయింపులపై లోతైన చర్చ చేయడంలో కమిటీ వర్క్ చేయనున్నది. అంతేగాక రెగ్యులర్‌గా క్షేత్రస్థాయిలో పర్యటించి, ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించడం, ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించి నేరుగా సీఎం, మంత్రులకు నివేదికలు అందించడంలోనూ చొరవ తీసుకోనున్నది. సభ లేని సమయంలో ప్రతిపక్షాల విమర్శలకూ ఆయా సబ్జెక్ట్ లను బట్టి ఈ కమిటీలు ఖండించనున్నాయి. కేవలం మాటలతో కాకుండా, స్పష్టమైన డేటాతో ప్రతిపక్షాల నోర్లు మూయించేందుకు పనిచేస్తామని ఎమ్మెల్యేలు చెప్తున్నారు.

Advertisement

Also Read: Romantic Drama OTT: ప్రియురాలి దెబ్బకు బిత్తరపోయే ప్రియుడు… క్రాక్ ఎక్కించే క్రేజీ లవ్ స్టోరీ

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×