Black Spots On Face: ప్రస్తుతం చాలా మంది ముఖంపై నల్ల మచ్చలతో ఇబ్బంది పడుతున్నారు. వీటిని తగ్గించుకోవడానికి రకరకాల ప్రొడక్స్‌తో పాటుగా హోం రెమెడీస్ వాడే వారు కూడా చాలా మందే ఉంటారు. కొన్ని సార్లు ఏం వాడినా త్వరగా ఫలితం ఉండదు. ఇదిలా ఉంటే మొటిమలు తగ్గడానికి తినే ఆహారంలో మార్పులతో పాటు హోం రెమెడీస్ వాడటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మచ్చలను తొలగించే చిట్కాలు:
1. నిమ్మరసం, తేనె మాస్క్:
నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ (విటమిన్ C) సహజమైన బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేసి, మచ్చలను తేలికపరుస్తుంది. తేనె చర్మానికి తేమను అందించి.. మంటను తగ్గిస్తుంది.
ఎలా ఉపయోగించాలి: ఒక టీస్పూన్ నిమ్మరసంలో ఒక టీస్పూన్ తేనె కలిపి, మచ్చలపై మాత్రమే అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయండి .
ముఖ్య గమనిక: నిమ్మరసం వాడిన తర్వాత ఎండలోకి వెళ్లకూడదు. దీనిని ఉపయోగించడం వల్ల చర్మం సున్నితంగా మారుతుంది. అందుకే రాత్రిపూట వాడితే మంచిది.
2. అలోవెరా జెల్ (కలబంద గుజ్జు):
అలోవెరాలో ‘అలోయిన్’ అనే సహజమైన కాంపౌండ్ ఉంటుంది. ఇది చర్మంపై మెలనిన్ ఉత్పత్తిని తగ్గించి.. నల్లటి మచ్చలను తేలిక పరచడంలో సహాయపడుతుంది.
ఎలా ఉపయోగించాలి: తాజా అలోవెరా జెల్‌ను మచ్చలపై నేరుగా రాసి, రాత్రంతా ఉంచి, ఉదయం శుభ్రం చేయండి. ప్రతిరోజూ దీనిని వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
3. పసుపు, పెరుగు మిశ్రమం:
పసుపులో ఉండే ‘కర్కుమిన్’ అనే రసాయనం శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.
ఎలా ఉపయోగించాలి: ఒక టీస్పూన్ పసుపులో రెండు టీస్పూన్ల పెరుగు లేదా పాలు కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ మిశ్రమాన్ని మచ్చలపై లేదా ముఖంపై రాసి.. 15-20 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. దీనిని వారానికి 2-3 సార్లు కూడా ఉపయోగించవచ్చు.
4. ఆపిల్ సైడర్ వెనిగర్:
దీనిలోని ఎసిటిక్ యాసిడ్ మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఇది ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
ఎలా ఉపయోగించాలి: ఒక భాగం ఆపిల్ సైడర్ వెనిగర్‌కు సమానంగా నీరు కలిపి, దూదితో మచ్చలపై అప్లై చేయాలి. 2-3 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు కూడా దీనిని ఉపయోగించవచ్చు. చికాకుగా అనిపిస్తే వాడటం ఆపివేయడం మంచిది.
5. బంగాళదుంప :
బంగాళదుంపలలోని ‘కేటెకోలేస్’ అనే ఎంజైమ్ చర్మం రంగును తేలిక పరచడంలో సహాయపడుతుందని అంటారు.
ఎలా ఉపయోగించాలి: బంగాళదుంపను సన్నని ముక్కలుగా కోసి.. మచ్చలపై 10 నిమిషాలు మసాజ్ చేయండి లేదా తురిమి గుజ్జులా చేసి మాస్క్ వేయండి.
Also Read: తరచూ వ్యాధుల బారిన పడుతున్నారా ? ఈ టిప్స్ మీ కోసమే !
మచ్చలు రాకుండా నివారించే మార్గాలు:
నల్లటి మచ్చలను తొలగించడం కంటే.. అవి రాకుండా చూసుకోవడం ముఖ్యం. దీనికి ప్రధానంగా పాటించాల్సిన చిట్కా:
సన్‌స్క్రీన్ వాడకం: సూర్యరశ్మి నుంచే హైపర్ పిగ్మెంటేషన్ ఎక్కువగా వస్తుంది. అందుకే ఇంటి లోపల ఉన్నా, బయటకు వెళ్లినా SPF 30 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న సన్‌స్క్రీన్‌ను తప్పకుండా ఉపయోగించండి.
ఈ సహజ చిట్కాలు అందరికీ ఒకేలా పనిచేయకపోవచ్చు. ఏ చిట్కా పాటించినా.. ముందుగా కొద్దిపాటి చర్మంపై (పాచ్ టెస్ట్) పరీక్షించుకోవడం మంచిది. మచ్చలు చాలా తీవ్రంగా ఉంటే హోం రెమెడీస్ అంతగా పనిచేయవు. ఇలాంటి సందర్భంలో డెర్మటాలజిస్టులను సంప్రదించడం చాలా మంచిది.