BigTV English

Warangal: వరంగల్‌లో గవర్నర్.. అధికారులకు గైడ్‌లైన్స్..

Warangal: వరంగల్‌లో గవర్నర్.. అధికారులకు గైడ్‌లైన్స్..
Governor

Warangal: వరదలతో వరంగల్‌లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గవర్నర్‌ తమిళిసై. ముంపు ప్రాంతాల్లో పర్యటించిన.. బాధితులను పరామర్శించారు. అధికారుల పర్యవేక్షణ కొనసాగుతున్నా.. ముందస్తుగా చర్యలు ఎందుకు చేపట్టలేకపోయారని ప్రశ్నించారు. ఆక్రమణలతోనే ఎక్కువగా ముంపునకు గురవతున్నారని.. ముంపు ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు కల్పించాలన్నారు.


ప్రతి ఏటా ఇలా ముంపునకు గురవుతుంటే.. శాశ్వత పరిష్కారం కోసం ఏం చేస్తున్నారో చెప్పాలని అధికారులను నిలదీశారు గవర్నర్. వర్షాల సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే భయానక పరిస్థితులు ఎదురవుతాయన్నారు. వర్షాలు పోయాయని ఊరుకోవద్దని.. ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించాలని సూచించారు. కేంద్రం బృందం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తుందని చెప్పారు తమిళిసై.

వరంగల్ పర్యటనలో మొదట భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు గవర్నర్. భద్రకాళి చెరువు కట్ట మరమ్మతు పనులను పరిశీలించారు. హంటర్ రోడ్డులో ముంపునకు గురైన ప్రాంతాల్లో సందర్శించారు. రెడ్‌ క్రాస్‌ సొసైటీ తరఫున నిత్యావసరాలను, హెల్త్ కిట్స్‌ను వరద బాధితులకు పంపిణీ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాయమందేలా చూస్తానని గవర్నర్‌ తమిళిసై హామీ ఇచ్చారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×