Hyderabad: హైదరాబాదులో శివ శివాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ (SSGI) తన కొత్త బ్రాంచ్ ను ప్రారంభించి, గత ఆరు దశాబ్దాల విద్యా నైపుణ్యం విద్యలో నాయకత్వ సంప్రదాయాన్ని గౌరవంగా ముందుకు తీసుకువెళ్తోంది. సోమాజిగూడలోని జయ గార్డెన్ ఎదురుగా తన కొత్త బ్రాంచ్ ను ప్రారంభిస్తున్నట్లు గర్వంగా ప్రకటించింది. జూన్ 15వ తేదీన జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు ఎస్ నిరంజన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే వై. శ్రీనివాస్ రెడ్డి, మేనేజ్మెంట్ ప్రతినిధులు ఎస్.ఆరతి, ఎస్.పీ.సంపతి, శివ శివాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ప్రెసిడెంట్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.ఆరతి, సోమాజిగూడ లోని శివ శివాని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వి. సారిక రాజ్ తోపాటు అధ్యాపకులు, విద్యార్థులు ,శ్రేయోభిలాషులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
హైదరాబాదులో ఘనంగా శివ శివాని డిగ్రీ కళాశాల కొత్త బ్రాంచ్ ప్రారంభం..
ముఖ్యంగా ఈ కొత్త క్యాంపస్ ప్రారంభం తెలంగాణ అంతట నాణ్యమైన ఉన్నత విద్యను అందించే దిశగా కళాశాల ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలు రాయిని సూచిస్తుందని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో శివ శివాని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అధ్యక్షులు అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.ఆరతి మాట్లాడుతూ.. “విద్యా నైపుణ్యానికి మద్దతు ఇవ్వడానికి విద్యార్థి – కేంద్రీకృత ప్రయోజనాలు, కార్యక్రమాలు చేపట్టడానికి , సరైన ప్రతిఫలం ఇవ్వడానికి, మెరిట్ ఆధారిత స్కాలర్షిప్లు ఇవ్వడానికి మా సంస్థ ఎప్పుడు ముందుంటుంది. డిగ్రీ కోర్సులతో పాటు యూపీఎస్సీ ఫౌండేషన్ కోచింగ్ గ్రాడ్యుయేషన్ స్థాయి నుండి పోటీ సివిల్ సర్వీసెస్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడం వరకు మా సంస్థలు ఎప్పుడు ముందుంటాయి. ఆచరణాత్మక, వాస్తవ ప్రపంచ పరిశ్రమను బహిర్గతం చేసి, వ్యాపార పరస్పర చర్య కోసం ప్రత్యేకమైన బీబీఏ 1- వారం కార్పొరేట్ ఇమ్మర్శన్ ప్రోగ్రాం, ఇలా ఈ కొత్త క్యాంపస్ లో కూడా అందుబాటులో ఉంటాయి. ఇక విలువ ఆధారిత విద్యతో ఎక్కువ మంది విద్యార్థులను మరింత శక్తివంతం చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే మా సంస్థలను విస్తరిస్తున్నాము. సమాజానికి దోహదపడే.. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న గ్రాడ్యుయేట్లను పెంపొందించడమే మా లక్ష్యం” అంటూ ఆమె తెలిపారు.
ఈ కళాశాల ప్రత్యేకతలు ఇవే..
ఇక తర్వాత శివ శివాని డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వి.సారికా రాజ్ మాట్లాడుతూ..” ఈ బ్రాంచ్ ప్రారంభం అన్ని వర్గాల విద్యార్థులకు సమగ్రమైన, సరసమైన విద్యను అందించడానికి ప్రారంభించడం జరిగింది. అభ్యాస కేంద్రీకృత విధానంతో మేము ఈ క్యాంపస్ ను విద్యా నైపుణ్యం ఆవిష్కరణల కేంద్రంగానే ఊహించాము. ఇక్కడ బి బి ఏ, బి బి ఏ స్పెషలైజేషన్లు( ఫైనాన్సు, మార్కెటింగ్ , హ్యూమన్ రిసోర్సెస్, రిటైర్డ్ మేనేజ్మెంట్) , బీఎస్సీ, బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, బీకాం బిజినెస్ అనలిటిక్స్, బీసీఏ జనరల్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. శివ శివాని డిగ్రీ కళాశాల విద్యార్థులకు విజయవంతమైన భవిష్యత్తును రూపొందించడంతో ముందుకు కొనసాగిస్తుంది” అంటూ ఆయన తెలిపారు.