OTT Movie : లాస్ ఏంజిల్స్‌లో షెరిల్ బ్రాడ్‌షా అనే యువ నటి తన కలలను సాధించేందుకు ప్రయత్నిస్తుంటుంది. అయితే ఆమెకు సినీ రంగంలో అనుకున్నంత స్టార్ డమ్ రాకపోవడంతో నిరాశపడుతుంది. ఆమె ఒక ఏజెంట్ సలహాతో, ప్రసిద్ధ టీవీ షో ‘The Dating Game’ లో పాల్గొని గుర్తింపు పొందాలని అనుకుంటుంది. అక్కడ ఆమె ముగ్గురు బ్యాచిలర్‌లలో ఒకరైన రాడ్నీ అల్కాలాను ఎంచుకుంటుంది. ఆమెకు తెలియని ఒకభయంకరమైన రహస్యం ఏమిటంటే, అతను ఒక సీరియల్ కిల్లర్. ఇప్పటికే అనేక మంది మహిళలను హత్య చేసిన నీచుడు. ఇప్పుడు షెరిల్‌కు ఎంచుకున్న డేట్ ఆమె జీవితాన్ని ఎలా మార్చబోతుంది? రాడ్నీ మరో బాధితురాలిగా మారుతుందా? ఈ మూవీ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది అనే వివరాల్లోకి వెళితే..
కథలోకి వెళితే
1970లలో షెరిల్ లాస్ ఏంజిల్స్‌లో నటిగా రాణించాలనే కలతో ఉన్న యువతి. కానీ ఆమె ఆడిషన్స్‌లో సెలెక్ట్ కాకపోవడంతో , హాలీవుడ్‌లో ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఆమెను అందరూ కమిట్మెంట్ లు అడిగేవాళ్ళు. ఇక ఆమె ఒక ఏజెంట్ సలహాతో, The Dating Game షోలో పాల్గొని గుర్తింపు పొందాలని నిర్ణయించుకుంటుంది. అక్కడ ఆమె ముగ్గురు బ్యాచిలర్‌ల నుండి ఒకరిని డేట్ కోసం ఎంచుకోవాలి. రాడ్నీ అల్కాలా అనే వ్యక్తిని షెరిల్ డేటింగ్ కి ఎంచుకుంటుంది. అయితే వాస్తవానికి అతను 1971 నుండి మహిళలను హత్య చేస్తున్న ఒక సీరియల్ కిల్లర్. వందమందికి పైగా అమ్మాయిలు ఇతని ఖాతాలో బలయ్యారు.
మొదట రాడ్నీ తన ఫోటోగ్రఫీని ఉపయోగించి మహిళలను తనవైపు తిప్పుకుంటాడు. వారిని ఒంటరిగా ఉన్న ప్రదేశాలకు తీసుకెళ్లి దాడి చేస్తాడు. ఆ తరువాత అఘాయిత్యం చేసి చంపుతాడు. ఇప్పుడు ఈ Dating Game షోలో, షెరిల్ రాడ్నీని ఎంచుకుంటుంది, కానీ షో తర్వాత అతనితో సమయం గడపడంతో, అతని ప్రవర్తన ఆమెకు అనుమానాన్ని కలిగిస్తుంది. దీని కారణంగా అతనితో డేట్‌కు వెళ్లడానికి నిరాకరిస్తుంది. చివరికి రాడ్నీనిజ స్వరూపాన్ని షెరిల్ ఎలా గుర్తిస్తుంది ? ఆ సైకో నుంచి తప్పించుకుంటుందా ? ఇంకెంతమంది ఆ సైకో వలలో చిక్కుకుంటారు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : అమ్మాయిని అడ్డుపెట్టుకుని డేంజర్ గేమ్ … బిలియనీర్ ని ఓ ఆట ఆడుకునే నైట్ మేనేజర్
ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఉమెన్ ఆఫ్ ది అవర్’ (Woman of the Hour ). 2023 లో వచ్చిన ఈ సినిమాకి అన్నా కెండ్రిక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నిజ జీవితంలోని ఒక సీరియల్ కిల్లర్ హత్యల ఆధారంగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ (netflix) లో అందుబాటులో ఉంది. ఇందులో అన్నా కెండ్రిక్, డేనియల్ జోవాట్టో, టోనీ హేల్, నికోలెట్ రాబిన్సన్ ప్రధానపాత్రల్లో నటించారు.