E-Paper
Advertisement

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ రాళ్ల వర్షం.. క్షణాల్లోనే టపాటపా అంటూ..?

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ రాళ్ల వర్షం.. క్షణాల్లోనే టపాటపా అంటూ..?
Advertisement

హైదరాబాద్‌లో కుండపోత వర్షం పడుతోంది. పలు చోట్ల భయంకరంగా రాళ్ల వర్షం కురుస్తోంది. మియాపూర్, కూకట్‌పల్లి, బోరబండ, చందానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది. రాళ్ల వానకు నగర వాసులకు భయాందోళనకు గురయ్యారు. భారీ వర్షం కారణంగా పలు ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. దీంతో ఆఫీస్‌ల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు.

గత వారం రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వర్షాలు పెద్ద ఉపశమనం కలిగించాయి. ఉక్కపోత తగ్గి వాతావరణం చల్లబడటంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే సాధారణ ప్రజలకు సంతోషాన్నిచ్చిన ఈ వాతావరణ మార్పు అన్నదాతలకు కన్నీటిని మిగులుస్తోంది. అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతినే ప్రమాదం పొంచి ఉండటంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టం వాటిల్లుతుందని ఆందోళన చెందుతున్నారు.

Advertisement

ఈ అకాల వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు రైతులను అప్రమత్తం చేస్తున్నారు. పొలాల్లో ఉన్న పంటను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచిస్తున్నారు. మరోవైపు రాజధాని హైదరాబాద్ నగరంలో కూడా వాతావరణం వేగంగా మారిపోయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం మొదలైంది. రాబోయే ఒకటి రెండు గంటల్లో భాగ్యనగరంలోని పలు ఏరియాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

ఈ ప్రాంత వాసులు జాగ్రత్త..

Advertisement

ముఖ్యంగా కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, నిజాంపేట్, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. మియాపూర్, మాదాపూర్, హైటెక్ సిటీ, గాజులరామారం, బాలానగర్, ఖైరతాబాద్ ఏరియాల్లో తీవ్రమైన పిడుగుల పడే అవకాశం ఉంది. సికింద్రాబాద్, బేగంపేట, అల్వాల్ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రయాణాలు చేసే వారు ముందస్తు ప్రణాళికతో ఉండటం మంచిది.

భారీ వర్షాల దృష్ట్యా భాగ్యనగర వాసులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ బృందాలు సూచించాయి. రాత్రి సమయాల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరుతున్నాయి. అటు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు సాయంత్రం వేళల్లో పొలాల వద్దకు వెళ్లరాదని అధికారులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. పిడుగుపాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున చెట్ల కింద నిల్చోవద్దని సూచిస్తున్నారు. వాతావరణ శాఖ ఇచ్చే సూచనలను పాటిస్తూ ప్రజలంతా క్షేమంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది.

ALSO READ: Jabardasth Naresh: ఆ ఒక్క నిర్ణయంతో రెండేళ్లు కెరియర్ కోల్పోయా.. జబర్దస్త్ నరేష్ ఎమోషనల్!

Related News

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ముందు.. సీఎంపై చర్యలు తీసుకోవాలి.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్

సెక్రటేరియట్ భద్రత అధికారులకు మంత్రి మాస్ వార్నింగ్.. మళ్లీ రిపీట్ కావొద్దంటూ ఫైర్!

ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు.. తెలంగాణ సర్కార్ షాకింగ్ న్యూస్..!

కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ విసుర్లు, జెన్ జీ పేరు ప్రస్తావిస్తూ..

తెలంగాణలో 1000 రోజుల పాలన.. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ పోస్ట్, ప్రయాణంలో తోడుగా నిలిచిన..

Big Stories

Advertisement
×