E-Paper
Advertisement

కేటీఆర్ జీవితంలో సీఎం కాలేడు.. సురేఖ సారీ చెప్పింది అందుకే! ఎంపీ అర్వింద్

కేటీఆర్ జీవితంలో సీఎం కాలేడు.. సురేఖ సారీ చెప్పింది అందుకే! ఎంపీ అర్వింద్
Advertisement

Dharmapuri Arvind: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ వెళ్లగొడితే బతుకుదెరువు కోసం మంత్రి కొండా సురేఖ కేటీఆర్ కు క్షమాపణలు చెప్పిందని, ఆ మాత్రం దానికే కేటీఆర్ ఎందుకు అంత చంకలు గుద్దుకుంటున్నాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చురకలంటించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండా సురేఖ, కేటీఆర్ ఏం జడ్జీలు కాదని, ఆమెనే కేటీఆర్ పై ఆరోపణలు చేసిందని, ఆమెనే విత్ డ్రా చేసుకుందన్నారు.

కేటీఆర్ జీవితంలో సీఎం అవ్వలేడు..

Advertisement

కాంగ్రెస్.. కొండా సురేఖను పక్కన పెట్టిందని.. అందుకే ఈ క్షమాపణల స్టేట్మెంట్ అని పేర్కొన్నారు. కేటీఆర్ జీవితంలో సీఎం అవ్వలేడని వ్యాఖ్యానించారు. ఎస్ఐఆర్ పై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పెళ్లి అయితే పిల్లలు వారి ఇళ్లకు వెళ్తారని, అప్పుడు వారికి ఇక్కడున్న ఓట్లు తొలగిస్తారన్నారు. అలాగే చనిపోయిన వారి ఓట్లు తొలగిస్తారని పేర్కొన్నారు. నిజంగా అర్హుల ఓట్లు తొలగించినట్లయితే ఆధారాలు చూపమంటే మాత్రం ముందుకు రావడంలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ సునామీ రాబోతోందని ధీమా వ్యక్తంచేశారు. ఆ సునామీ తర్వాత అపోజిషన్ పార్టీలు ఉండవని ధీమా వ్యక్తంచేశారు. ఇదిలాఉండగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిజామాబాద్ కు చెందిన రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ హనుమంతరావు, ఆయన అనుచరులు రాంచందర్ రావు, అర్వింద్ ఆధ్వర్యంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.

అర్వింద్ మాట్లాడుతూ..

Advertisement

ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ను భూ స్థాపితం చేసింది తామేనని ఆయన వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్ ను ఎవరూ భూస్థాపితం చేయాల్సిన పని లేదని, వాళ్ళను వాళ్ళే చేసుకుంటారన్నారు. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం తాము వేరే పని చేసుకోవచ్చన్నారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయలేదా? అని అర్వింద్ ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ జరగపోతే ప్రభాకర్ రావు ఎందుకు అమెరికా వెళ్లినట్లని ప్రశ్నించారు. తన ఫోన్ ను కూడా కేటీఆర్ ట్యాప్ చేశారని అర్వింద్ ఆరోపించారు. రాష్ట్రంలోని కొందరి ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నాయని యాపిల్ సంస్థ చెప్పిందన్నారు. అదే మెసేజ్ ను పోలీసులకు పంపినట్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లోపు అన్ని స్కాంలు బయటపెడతామని, అన్నింటిపై విచారణ జరుపుతామని, ఆధారాలతో బయటపెడతామని అర్వింద్ హెచ్చరించారు.

Also Read: చంద్రబాబుపై బావ బామ్మర్దుల ప్రేమ.. బీజేపీతో పొత్తు కోసమేనా?- మహేష్ కుమార్ గౌడ్

Tags

Related News

ఫాక్స్ సాగర్ చెరువు గురించి మీకు తెలియని 129 ఏళ్ల నిజాలు.. త్వరలోనే మినీ ట్యాంక్‌బండ్‌గా!

రేవంత్ రెడ్డి క్రెడిట్ కొట్టేశారా? మియాపూర్ కేస్‌పై హరీశ్ రావు సంచలన కౌంటర్!

చంద్రబాబుపై బావ బామ్మర్దుల ప్రేమ.. బీజేపీతో పొత్తు కోసమేనా?- మహేష్ కుమార్ గౌడ్

ఆ పని చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా! కాంగ్రెస్ సర్కార్‌పై ఈటల తీవ్ర వ్యాఖ్యలు!

మొయినాబాద్‌లో విషాదం.. కరెంట్ తీగలు తగిలి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

కేంద్రంతో సీఎం రేవంత్ కీలక భేటీ.. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై బిగ్ అప్‌డేట్!

గణేశ్ నిమజ్జనాల ఎఫెక్ట్.. హుస్సేన్‌సాగర్‌లో పడిపోయిన నీటి నాణ్యత.. కెమికల్స్, బ్యాక్టీరియా గుర్తింపు!

Big Stories

Advertisement
×