E-Paper
Advertisement

ఆ పని చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా! కాంగ్రెస్ సర్కార్‌పై ఈటల తీవ్ర వ్యాఖ్యలు!

ఆ పని చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా! కాంగ్రెస్ సర్కార్‌పై ఈటల తీవ్ర వ్యాఖ్యలు!
Advertisement

Eatala Rajender: స్వేచ్ఛ బ్యూరో: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు తొలగించాలనే డిమాండ్ తో తాను పాదయాత్ర చేస్తుంటే.. పనిలేక తిరుగుతున్నాడని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారని, ఈ డంప్ యార్డ్ ఒక్కటే.. కాదని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు తాను ఇలాగే తిరుగుతానని ఈటల రాజేందర్ హెచ్చరించారు. ఆపని చేయకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

తలపైన కుర్చీలు పెట్టుకుని సభలోనే జనం..

Advertisement

జవహర్ నగర్ డంపింగ్ యార్డు రీసైకిల్ కోసం ఎంత ఖర్చు అవుతుందో డీపీఆర్ సిద్ధం చేసి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డును తరలించాలనే డిమాండ్ తో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ నాలుగు రోజులుగా చేపడుతున్న పాదయాత్ర శుక్రవారం ముగిసింది. కాగా ఈ ముగింపు సభకు బాధితులు, స్థానికులు, బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపాయి. జోరు వర్షంలోనూ ముగింపు సభ కొనసాగింది. వర్షం కురిసినా కుర్చీలను నెత్తిన పెట్టుకుని సభలోనే ఉండటంపై ఈటల రాజేందర్ స్పందించారు. జవహర్ నగర్ జన సంకల్ప యాత్రను విజయవంతం చేసిన బాధితులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారీ వర్షంలోనూ సైతం ఇంచు కదలకుండా నిలబడి తాము చేపడుతున్న పోరాటానికి మద్దతు తెలిపిన ప్రజల స్ఫూర్తి తమ భాద్యతను మరింత పెంచిందని కొనియాడారు. బీజేపీ కార్యకర్తల కమిట్మెంట్ కి సెల్యూట్ అని రాజేందర్ వ్యాఖ్యానించారు.

డంప్ యార్డు వల్ల నరక యాతన

Advertisement

ఈనెల 27న తాను పాదయాత్ర మొదలుపెట్టానని, నాలుగు రోజుల పాటు డంప్ యార్డు వల్ల నరక యాతన అనుభవించానని పేర్కొన్నారు. బాధితుల గాథలు వింటుంటే కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయని పేర్కొన్నారు. ఈ డంపింగ్ యార్డు వద్ద 18 నెలల విహాన్ చారిని కుక్కలు పీక్కుతిన్నాయని, చెత్త లారీల చక్రాల కింద ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, అయితే.. నిర్వహణ సంస్థ మాత్రం బాధితులకు చెల్లని చిక్కులిచ్చి ఇబ్బంది పెట్టిందని ఈటల ఆగ్రహం వ్యక్తంచేవారు. ప్రజల ఆరోగ్యానికి ఇబ్బందులుండవని కోర్టుకు రాంకీ సంస్థ రాసిచ్చిందని, కానీ అనేకమంది క్యాన్సర్ తో చనిపోతున్నారని ఆయన పేర్కొన్నారు. చర్మ వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని, పిల్లలకి చర్మ వ్యాధులు వస్తే స్కూల్లో కూడా జాయిన్ చేసుకోని పరిస్థితి ఏర్పడిందని ఈటల ఆవేదన వ్యక్తంచేశారు. ఇక్కడ చెత్త వేయడానికి వీలులేదని ఎన్జీటీ ఫైన్ వేసిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ పట్టనట్టుగా తాత్సారం వహిస్తోందని మండిపడ్డారు. మూడు రోజులుగా రాంకీ సంస్థ.. డంపింగ్ యార్డు నుంచి వాసన రాకుండా సువాసన వచ్చే స్ప్రేలు కొడుతోందని తనకు సమాచారం వచ్చిందని ఈటల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాకపోతే డీపీఆర్ తయారు చేసి తనకు ఇవ్వాలని, కేంద్రం నుంచి డబ్బులు ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్.. స్పందించక పోతే తగిన మూల్యం చెల్లించకోక తప్పదని ఈటల హెచ్చరించారు. రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ చేపట్టకుంటే తాము అధికారంలోకి వచ్చాక యార్డును తొలగిస్తామని ఈటల రాజేందర్ హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ కళ్ళు తెరవాల్సిందే: బండి సంజయ్

ఇదిలా ఉండగా ఈటల రాజేందర్ చేపట్టిన నాలుగు రోజుల పాదయాత్రపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ స్పందించారు. ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర విజయవంతమైందని కొనియాడారు. డంపింగ్ యార్డ్ సమస్య తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెలియజేసేందుకే ఈటల పాదయాత్ర చేపట్టారన్నారు. ప్రజా స్పందనను చూసైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవాలని డిమాండ్ చేశారు. డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారంలో గత బీఆర్ఎస్ పాలకులు విఫలమయ్యారని, కాంగ్రెస్ సైతం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని విమర్శించారు. ఈటల పాదయాత్రతోనైనా డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. లేదంటే కాంగ్రెస్ ను ప్రజలే భూస్ధాపితం చేయడం తథ్యమని బండి హెచ్చరించారు. మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావు మాట్లాడుతూ.. ఈటల నాయకత్వంలో ఈ డంపిండ్ యార్డు తీసివేస్తారనే నమ్మకం ప్రజలకు వచ్చిందన్నారు. ఇదిలాఉండగా ఈటల పాదయాత్రకు బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరి కీర్తిరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాజేందర్ ను శాలువాతో సన్మానించారు.

రాజేందర్ మాట్లాడుతూ..

అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో కనీసం చెత్త సమస్యను పరిష్కరించలేని చేతకాని ప్రభుత్వం పాలనను కొనసాగిస్తోందని మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రభుత్వానికి ఈ ప్రాంత ప్రజల సమస్య ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ను నమ్మితే.. నట్టేట ముంచుడే అనేందుకు డంపింగ్ యార్డ్ సమస్యే నిదర్శనమన్నారు. కాంగ్రెస్ నేతలకు ఈటల గురించి మాట్లాడే కనీస అర్హత లేదని ఆమె మండిపడ్డారు. ఇదిలాఉండగా ఈటల పాదయాత్రకు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ కుమార్ తదితరులు సంఘీభావం తెలిపారు.

Also Read: మొయినాబాద్‌లో విషాదం.. కరెంట్ తీగలు తగిలి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

Tags

Related News

చంద్రబాబుపై బావ బామ్మర్దుల ప్రేమ.. బీజేపీతో పొత్తు కోసమేనా?- మహేష్ కుమార్ గౌడ్

మొయినాబాద్‌లో విషాదం.. కరెంట్ తీగలు తగిలి ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

కేంద్రంతో సీఎం రేవంత్ కీలక భేటీ.. తెలంగాణ రైల్వే ప్రాజెక్టులపై బిగ్ అప్‌డేట్!

గణేశ్ నిమజ్జనాల ఎఫెక్ట్.. హుస్సేన్‌సాగర్‌లో పడిపోయిన నీటి నాణ్యత.. కెమికల్స్, బ్యాక్టీరియా గుర్తింపు!

హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన క్లైమేట్.. దంచికొడుతున్న వాన.. రాబోయే 2 గంటలు హైఅలర్ట్!

నా చావుకి డాక్టర్లు, పోలీసులే కారణం.. అట్టముక్కపై సూసైడ్ నోట్ రాసి టెక్కీ ఆత్మహత్య!

ఏడాది తర్వాత వీడిన ఖమ్మం మర్డర్ మిస్టరీ.. చెప్పుల క్లూతో చిక్కిన కిల్లర్స్!

Big Stories

Advertisement
×