E-Paper
Advertisement

తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ.. ఈ పాపంలో కిష‌న్ రెడ్డికి భాగం ఉంది.. హ‌రీష్ రావు కీల‌క వ్యాఖ్య‌లు

తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ.. ఈ పాపంలో కిష‌న్ రెడ్డికి భాగం ఉంది.. హ‌రీష్ రావు కీల‌క వ్యాఖ్య‌లు
Advertisement

Harish Rao Counters Kishan Reddy: మాజీ మంత్రి హరీష్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. రాజ్యసభలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని, తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తూ ఆయన తన వికృతత్వాన్ని బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ విభజన సమయంలో ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించడంపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చారిత్రక ద్రోహమని హరీష్ రావు ధ్వజమెత్తారు. విభజన చట్టంలో లేని అంశాన్ని ఆర్డినెన్స్ ద్వారా సవరించి తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ ప్రభుత్వమేనని, ఈ పాపంలో కిషన్ రెడ్డికి కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి చేస్తున్న విమర్శలను హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న తప్పుడు ప్రచారాన్నే కిషన్ రెడ్డి పార్లమెంట్‌లో వల్లెవేయడం కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న చీకటి పొత్తుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ద్వారా 148 మీటర్ల నుండి 618 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం అబద్ధమా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం మండుటెండల్లో కూడా కాళేశ్వరం జలాలు రైతుల పొలాలకు చేరుతున్నాయని, ఆ దృశ్యాలను చూపేందుకు తాను సిద్ధమని, కిషన్ రెడ్డికి దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు.

Advertisement

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా (చాప్టర్ 8) నివేదికను హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. 2014లో తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం, 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగిందని, దీనికి ప్రధాన కారణం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం, మిషన్ కాకతీయ పథకాలేనని కేంద్రమే స్పష్టం చేసిందని పేర్కొన్నారు. సొంత ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు కిషన్ రెడ్డికి కనిపించడం లేదా అని నిలదీశారు. గతంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ నుండి సిడబ్ల్యూసీ చైర్మన్ వరకు కాళేశ్వరంపై కురిపించిన ప్రశంసలు అన్నీ కిషన్ రెడ్డికి అబద్ధాలుగా కనిపిస్తున్నాయా అని ప్రశ్నించారు.

ప్రజా ధనంతో ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ తన జేబులో నుండి ఖర్చు పెట్టారా? అని అడగడం కిషన్ రెడ్డి అవివేకానికి నిదర్శనమని హరీష్ రావు మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నిర్మించే జాతీయ రహదారులకు నిధులు వారి జేబుల నుండి వస్తున్నాయా లేక దుబాయ్‌లో ముద్రిస్తున్నారా అని ఘాటుగా స్పందించారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, విభజన హామీల గురించి బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి గారు హుందాగా మాట్లాడుతుంటే, కిషన్ రెడ్డి మాత్రం బాధ్యత మరిచి వ్యర్థ ప్రేలాపనలకు పాల్పడ్డారని విమర్శించారు. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి కూడా తెలంగాణ వాదాన్ని వినిపించకుండా అణచివేయడం సిగ్గుచేటని హరీష్ రావు తన పోస్ట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Read Also: జీహెచ్ఎంసీలొ 122 కొట్ల కుంభకొణం.. బయట పడిన డీసీ బండారం

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×