E-Paper
Advertisement

మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే ధరలు దించు.. సీఎంకు హరీశ్ రావు సవాల్

మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే ధరలు దించు.. సీఎంకు హరీశ్ రావు సవాల్
Advertisement

Harish Rao: పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం పెంచిన నేపథ్యంలో వెంటనే రాష్ట్ర వ్యాట్ తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర పన్నులు తగ్గించాలని నాడు పీసీసీ హోదాలో ప్రగల్భాలు పలికిన రేవంత్.. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఎందుకు తగ్గించడం లేదని నిలదీశారు. ‘ప్రతిపక్షాలపై అడ్డగోలుగా మాటలు దంచుడు కాదు.. దమ్ముంటే మాట మీద నిలబడి పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించి ధరలు దించు’ అని హరీశ్ రావు డిమాండ్ చేసారు.

‘రైతుల పరిస్థితి దయనీయం’

వారం వ్యవధిలో నాలుగు సార్లు ఫ్యూయల్ ధరలు పెంచి కేంద్రం ప్రజలపై పెను భారం మోపితే.. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర పన్నులు తగ్గించకుండా ప్రజల నడ్డి విరిస్తున్నారని హరీశ్ రావు మండి పడ్డారు. పెరిగిన సాగు ఖర్చులు భరించలేక రైతులు సతమతమవుతుంటే.. మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్లు చమురు ధరల పెరుగుదలతో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. రవాణా రంగం తీవ్ర సంక్షోభానికి లోను కావడంతో ద్రవ్యోల్బణం పెరిగి అన్ని వర్గాల ప్రజల జీవనంపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో.. పేద, మధ్యతరగతి కుటుంబాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

Advertisement

వ్యాట్‌తో ఖజానా నింపుకుంటారా?

రైతులు పొలం దున్నాలంటే డీజిల్ భారం, సామాన్యుడు బైక్ తీయాలంటే పెట్రోల్ భారం.. పెను శాపంగా మారిందని హరీశ్ రావు అన్నారు. పెరిగిన చమురు ధరలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి ఉపశమన చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన ప్రతిసారీ రేవంత్ ప్రభుత్వం వ్యాట్ రూపంలో ఖజానా నింపుకుంటూ సంబర పడుతుందని విమర్శించారు. పైశాచిక ఆనందం పొందుతున్నారంటూ దుయ్యబట్టారు. పెరిగిన ధరలతో ప్రతి నెలా రూ.162 కోట్లు, ఏడాదికి దాదాపు రూ.2,000 కోట్ల అదనపు వ్యాట్ రాష్ట్ర ఖజానాలోకి వచ్చి చేరనున్నట్లు హరీశ్ రావు తెలిపారు.

Advertisement

Also Read: Viral Video: 22 ఏళ్లకే ఆరోసారి ప్రెగ్నెంట్.. 5 గురు ఉన్నా మగబిడ్డకోసం ఆరాటం.. డాక్టర్ రియాక్షన్ ఇదే!

రాజకీయ ద్వంద్వ వైఖరి

ఎన్నికల ముందు వ్యాట్ పై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. రెండున్నరేళ్లుగా కేనీసం 0.1% వ్యాట్ కూడా తగ్గించకపోవడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని హరీశ్ రావు విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక తీరు, అధికారంలోకి వచ్చాక మరొక తీరు వ్యవహరిస్తూ కాంగ్రెస్ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీది నిజంగా ప్రజా పాలనే అయితే వెంటనే పెట్రోల్, డీజిల్‌పై కనీసం 10% వ్యాట్ తగ్గించాలని పట్టుబట్టారు. పెరిగిన ఇంధన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేసారు. పెట్రోల్, డీజిల్ పెంపుపై మొసలి కన్నీరు కార్చే రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ వ్యాట్ దోపిడీపై స్పందించాలని కూడా హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Also Read: ఏసీలు, కూలర్లు అక్కర్లేదు.. ఈ 4 చిట్కాలతో.. ఇంటి పైకప్పును ఐస్‌లా మార్చేయండి!

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×