E-Paper
Advertisement

100% RO ప్యూరిఫికేషన్, స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్.. అర్బన్ కంపెనీ Native M3 Pro ప్రత్యేకతలు ఇవే!

100% RO ప్యూరిఫికేషన్, స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్.. అర్బన్ కంపెనీ Native M3 Pro ప్రత్యేకతలు ఇవే!
Advertisement

Urban Company Native M3 Pro: మన ఇంటికి అవసరమైన రకరకాల ఆన్‌లైన్ సేవలు అందించే అర్బన్ కంపెనీ.. ఇప్పుడు హోమ్ అప్లయెన్సెస్ రంగంలోనూ దూసుకుపోతోంది. ఇందులో భాగంగా తమ Native బ్రాండ్ కింద కొత్తగా M3, M3 Pro మోడల్ వాటర్ ప్యూరిఫైయర్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రారంభ ధర రూ.22,000గా ఉన్న ఈ ప్యూరిఫైయర్లు, సాధారణ వాటర్ ప్యూరిఫైయర్లతో పోలిస్తే చాలా ప్రత్యేకమైనవి.

మూడేళ్ల పాటు సర్వీసింగ్ అక్కర్లేదు:

ఈ కొత్త ప్యూరిఫైయర్లలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే.. వీటిని కొన్నాక 3 ఏళ్ల పాటు సర్వీసింగ్ చేయించాల్సిన అవసరమే ఉండదు. అంతేకాకుండా.. కంపెనీ వీటిపై మూడేళ్ల నిబంధనలు లేని పూర్తి వారంటీని కూడా ఇస్తోంది. దీంతో నెలకోసారి ఫిల్టర్లు మార్చడం, టెక్నీషియన్ కోసం ఎదురుచూడటం లాంటి తలనొప్పులేవీ ఇందులో ఉండవు.

Advertisement

Also Read: iPhone 20 సిరీస్ చూడటానికి ఇలా ఉండబోతోందా? లుక్ మొత్తం మార్చేస్తున్న యాపిల్!

అత్యాధునిక స్మార్ట్ ఫీచర్లు:

Native M3 Pro మోడల్‌లో 100% ఆర్‌ఓ ప్యూరిఫికేషన్‌తో పాటు.. నీటిలో ఉండే రసాయనాలు, భార లోహాలను తొలగించే అధునాతన సాంకేతికత ఉంది. దీనిలో ఫుడ్‌గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్‌ను అందించారు. మన ఫోన్‌లోని యాప్ ద్వారా నీటి నాణ్యత, ఫిల్టర్ లైఫ్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అలాగే నీటికి మంచి రుచిని, ఆరోగ్యాన్ని ఇచ్చే మినరలైజేషన్, pH బ్యాలెన్సింగ్ సదుపాయం కూడా ఉంది.

భారీగా తగ్గే మెయింటనెన్స్ ఖర్చులు:

Advertisement

సాధారణ ఆర్‌ఓ ప్యూరిఫైయర్లతో పోలిస్తే వీటి నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. సర్వీసింగ్, ఫిల్టర్ మార్పుల ఖర్చులు లేకపోవడం వల్ల సుమారు 9 ఏళ్ల కాలంలో వినియోగదారులకు రూ.26,000 వరకు ఆదా అవుతుందని అర్బన్ కంపెనీ స్పష్టం చేస్తోంది. ఈ ప్యూరిఫైయర్ ముందరి భాగంలో ఉండే డాట్‌మాట్రిక్స్ డిస్‌ప్లే నీటి స్థితిని రియల్ టైమ్‌లో చూపిస్తుంది.

Also Read: అదిరిపోయే అప్డేట్.. WhatsAppలో సీక్రెట్ ఓటింగ్, డెడ్‌లైన్ ఫీచర్స్.. ఇక గ్రూప్ అడ్మిన్లకు పండగే!

Related News

iPhone 17 యూజర్లు ఈ రెండు సెట్టింగ్స్ మార్చితే.. ఆఫీస్ పని చిటికెలో అయిపోతుంది!

రూ.17 వేలకే లెనోవో క్రోమ్‌బుక్..ఆన్‌లైన్ క్లాసులకు అదిరిపోయే ఆప్షన్!

కార్ & ఇల్లు శుభ్రం చేసే మినీ వాక్యూమ్ క్లీనర్..ఫీచర్లు అదుర్స్!

వామ్మో.. ఫేస్ అన్‌లాక్ విషయంలో ఐఫోన్, ఆండ్రాయిడ్ మధ్య ఇంత తేడా ఉందా?

ఈ ఏసర్ ఆస్పైర్ లైట్ ఫీచర్లు చూస్తే..కొనకుండా ఉండలేరు తెలుసా ?

వాట్సాప్ ఆటోమేటిక్ డౌన్‌లోడ్‌తో విసిగిపోయారా? ఇలా చేస్తే ఆ సమస్యే ఉండదు!

రూ.2,300 కే 50W డీజే బాక్సా? ఈ స్పీకర్ సౌండ్‌కి పక్కింటి వాళ్లు కూడా డ్యాన్స్ లేయాల్సిందే!

వేడి నీళ్లలో ముంచినా చెక్కుచెదరదు.. హానర్ నుంచి అసాధారణ ఫీచర్లతో సరికొత్త ఫోన్!

Big Stories

Advertisement
×