E-Paper
Advertisement

Ind vs Pak: పాకిస్తాన్ తో క‌పిల్ దేవ్ ఫిక్సింగ్…BMW కారుకు అమ్ముడుపోయాడంటూ ఆరోప‌ణ‌లు !

Ind vs Pak: పాకిస్తాన్ తో క‌పిల్ దేవ్ ఫిక్సింగ్…BMW కారుకు అమ్ముడుపోయాడంటూ ఆరోప‌ణ‌లు !
Advertisement

Ind vs Pak: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India vs Pakistan match) మధ్య నిత్యం వివాదాలకు కొనసాగుతూ ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. పహల్గామ్ సంఘటన అనంతరం రెండు దేశాల మధ్య యుద్ధ వాతరణం నెలకొంది. అయితే ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పై సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య గతంలో మ్యాచ్ జరగగా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు కపిల్ దేవ్ (Kapil Dev ) అమ్ముడుపోయాడని ( match fixing) యూట్యూబర్ నితీష్ రాజ్ పుత్ (Nitish Rajput) సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తాజాగా తన సోషల్ మీడియా వేదికగా షాకింగ్ నిజాలను పంచుకున్నాడు.

Also Read: SRH VS RCB: క్లాసెన్, అభిషేక్ సెంచ‌రీలు..300-2 SRH స్కోర్ బోర్డు వైర‌ల్, ఇక RCBకి వ‌ణుకుపుట్టాల్సిందే

1991లో షార్జా మ్యాచ్ వివాదంలో కపిల్ దేవ్ ?

Advertisement

1991 అక్టోబర్ 25వ తేదీన చార్జాలో పాకిస్తాన్ తో విల్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆడింది టీమిండియా. ఈ మ్యాచ్ నేపథ్యంలో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 257 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో అద్భుతంగా టీమిండియా ప్లేయర్లు ఆడారు. సచిన్ టెండుల్కర్ 52 పరుగులు చేయగా సంజయ్ మంజ్రేకర్ 91 పరుగులతో రాణించాడు. కచ్చితంగా టీం ఇండియా గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అలాంటి సమయంలో టీమిడియా కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్, వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఇక మ్యాచ్ చివరి దశ వచ్చేసరికి స్టేడియంలో వెలుతురు పూర్తిగా తగ్గిపోయింది. బంతి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. మనోజ్ ప్రభాకర్ అలాగే సంజయ్ మంజ్రేకర్ ఇద్దరూ బ్యాటింగ్ చేస్తున్నారు. వెలుతురు లేదని అంపైర్లకు ఇద్దరు క్రికెటర్లు అంపైర్ కు ఫిర్యాదు చేసి ఉంటే.. రన్ రేట్ ప్రకారం ఇండియా గెలిచేది. కానీ టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం అలాంటి సాహసం చేయలేదట. చీకటిలోనే ఆడించే ప్రయత్నం చేశారని ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీనంతటికీ కారణం వరల్డ్ కప్ హీరో కపిల్ దేవ్ అంటూ తాజాగా నితీష్ రాజ్ పుత్ ఆరోపణలు చేశారు. అజారుద్దీన్ పై ఒత్తిడి తీసుకొచ్చి ఇలా చేశాడ‌న్నారు. డ‌కౌట్ కావాల‌నే అయ్యాడ‌ని ఆరోపించారు. పాకిస్తాన్ తో కుట్రలు ప‌న్నిన‌ నేపథ్యంలో ఆ మ్యాచ్ లో నాలుగు పరుగుల తేడాతో ఇండియా ఓడిపోయిందని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. వెలుతురు సరిగ్గా లేదని అంపైర్లకు ఫిర్యాదు చేసి ఉంటే.. రన్ రేట్ ప్రకారం ఇండియా గెలిచేదని పేర్కొన్నారు నితీష్ రాజ్ పుత్.

అయితే ఈ సిరీస్ ముగిసిన వెంటనే కపిల్ దేవ్ లగ్జరీ బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన నేపథ్యంలో.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చినట్లు గుర్తు చేశారు. బీసీసీఐ నుంచి 1991లో పెద్దగా జీతాలు వచ్చేవి కావు. అలాంటిది కపిల్ దేవ్ బీఎండబ్ల్యూ కారు కొన్న సంఘటన హాట్ టాపిక్ అయింది. అయితే దీనిపై కపిల్ దేవ్ అప్పట్లో క్లారిటీ ఇచ్చారు. యాడ్ అలాగే మోడలింగ్ అసైన్మెంట్ ద్వారా కారు గిఫ్టుగా వచ్చినట్లు వివరించారు. కానీ కపిల్ దేవ్ కారణంగానే ఇండియా ఓడిపోయిందని తాజాగా నితీష్ రాజ్ పుత్ బాంబు పేల్చారు. కావాలని డ‌కౌట్ అవ్వడమే కాకుండా… కెప్టెన్ అజారుద్దీన్ పై ఒత్తిడి తెచ్చాడని కపిల్ దేవ్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. అలాగే 1994లో పాకిస్తాన్ తో మ్యాచ్ సరిగ్గా ఆడక పోతే, 25 లక్షల ఆఫర్ కూడా మనోజ్ ప్రభాకర్ అనే ఇండియన్ క్రికెటర్ కు కపిల్ దేవ్ ఆఫర్ కూడా ఇచ్చినట్లు నితీష్ రాజ్ పుత్ తన సోషల్ మీడియా వేదికగా షాకింగ్ నిజాలను పంచుకున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. అయితే, నితీష్ రాజ్ పుత్ చేసిన ఆరోప‌ణ‌ల్లో ఎలాంటి నిజం, ఆధారాలు లేవ‌ని అప్ప‌ట్లోనే కోర్టు స్ప‌ష్టం చేసింది. కానీ ఇప్పుడు మ‌ళ్లీ అదే అంశాన్ని నితీష్ తెర‌పైకి తీసుకొచ్చారు.

Advertisement

Also Read: PAK VS AUS: షాదాబ్ ఖాన్ పెద్ద‌ జోక‌ర్..న‌ఖ్వీ అమ్ముడుపోయే కుక్క‌…PCB సెల‌క్ష‌న్‌పై పాక్ ప్లేయ‌ర్ తిరుగుబాటు

 

Related News

ఉగ్రవాదుల టెన్షన్..21 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌లో అడుగుపెట్టిన ఇంగ్లాండ్

చిన్నస్వామిలో వర్షం పడాలని పోర్లు దండాలు పెట్టండి, లేకపోతే విండీస్ ఘోర ఓటమే!

విరాట్ కోహ్లీ నాలాగే ఉంటాడు కానీ, పెద్ద అంద‌గాడు కాదు !

వాళ్లంద‌రితో జై హిందూ అనిపించండి, ష‌మీ కామెంట్స్ వైర‌ల్ !

టీమిండియాకు ఏది చేత‌కాదు, ఇప్ప‌టికే విండీస్ సిరీస్ గెలిచింది, ట్రోఫీ ఇచ్చేయండి

టీమిండియా రూ.250 కోట్లు దొబ్బుకుపోతే, మాకు ఒక్క రూపాయి ఇవ్వ‌డం లేదు

నోటికి ప్లాస్ట‌ర్ వేసి, 15వ అంతస్తు నుంచి కిందకు వేలాడదీశారు!

విడాకులు త‌ర్వాత ప‌చ్చి తాగుబోతున‌య్యా..ధ‌న శ్రీపై యుజ్వేంద్ర చాహల్ సంచ‌ల‌నం !

Big Stories

Advertisement
×