E-Paper
Advertisement

Harish Rao: అమెరికా ఒప్పందంతో మన దేశ రైతులకు తీవ్ర నష్టం: హరీష్ రావు

Harish Rao: అమెరికా ఒప్పందంతో మన దేశ రైతులకు తీవ్ర నష్టం: హరీష్ రావు

Harish Rao: అమెరికాతో భారత ప్రభుత్వ ఒప్పందంతో రైతులకు తీవ్ర నష్ట జరగబోతుందని, ఆ ఒప్పందంలో సోయా, మక్కలు, పత్తి లాంటివి ఎలాంటి టాక్స్ లేకుండా దిగుమతి కానున్నాయని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాదులో ఎక్కువ పండించే సొయా రైతుల పరిస్థితి ఏం కావాలి? ఈసారి మక్కలు ఎక్కువ పండిస్తున్నారు..ఆ రైతుల పరిస్థితి ఏంటి?అని ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన రైతు బడి అగ్రి షో లో శనివారం పాల్గొని మాట్లాడారు. పట్టుపురుగుల పెంపకంలో నెంబర్-1 సిద్ధిపేట జిల్లా అన్నారు. తీర ప్రాంతాల్లోనే పండే ఆయిల్ పామ్ ఇప్పుడు తెలంగాణలో పండుతుందని, రైతు ఆదాయం పెంచడం కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించిందన్నారు.

దేశంలోనే ఎక్కువ ధాన్యం

సిద్ధిపేటలో 12000 ఎకరాల్లో ఈ సాగు జరుగుతుందని, వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిషన్ కాకతీయతో చెరువులను తవ్వించి, కాలువలు తవ్వించి, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కాళేశ్వరంతో కరువును పారదోలారన్నారు. ఇవ్వాలా దేశంలోనే ఎక్కువ ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ తీర్చిదిద్దబడ్డదన్నారు. రైతులకు టెక్నాలజీ కావాలని, రైతులకు ఈరోజు లేబర్ పెద్ద ప్రాబ్లెంగా మారిందన్నారు. పంజాబ్ నుంచి, ఝార్ఖండ్ నుంచి, యూపీ నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి లేబర్ వస్తే తప్ప తెలంగాణ పల్లెల్లో నాట్లు పడని పరిస్థితి నెలకొందన్నారు. బీహార్ నుంచి హమాలీలొస్తే కానీ మన కల్లాల్లో ధాన్యం ఎత్తే పరిస్థితి లేదని, మిల్లులల్లో దించే పరిస్థితి లేదన్నారు. ప్రపంచ దేశాల్లో అద్భుతమైన టెక్నాలజీ ఉందని, అది ఎలాగైనా మన రైతాంగాలకు అందించాలన్నారు.

Also Read: Kerala Tourism: దేవభూమి అందాలు.. మున్నార్, వయనాడ్, అలప్పుజ.. సమ్మర్‌లో తప్పక చూడాల్సిందే!

టాక్స్ ఎందుకు తగ్గిస్తున్నారు?

యంత్రాలను ఉపయోగించినప్పుడే వ్యవసాయం లాభదాయకంగా మారుతుందన్నారు. రైతులకు పెద్ద ఎత్తున వ్యవసాయ పరికరాలను సబ్సిడీపైఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాల నుంచి వచ్చే పామ్ క్రూడ్ ఆయిల్ పైన 25% టాక్స్ ఉండేది కానీ ఇప్పుడు ఆ టాక్స్ 16% కు తగ్గించడం వల్ల ఇక్కడ 25000 ఉన్న పామ్ ఆయిల్ టన్ను రేట్ 21000లకు పడిపోయిందన్నారు. ఈ టాక్స్ ఎందుకు తగ్గిస్తున్నారు?ఈ టాక్స్ తగ్గించడం వల్ల మనకు ఎం లాభం జరుగుతుందో కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం యాప్ పెట్టేటప్పుడు సాధ్యాసాధ్యాలను ఆలోచించాలన్నారు. పాసుబుక్కుకు 2 సంచులు అంటే పాస్ బుక్కులు లేని రైతుల పరిస్థితి ఏంటి? అని నిలదీశారు. కొత్తగా భూములు కొనుకున్న వారికి పాస్ బుక్కులు రాక 8 నెలలు అయ్యిందని, రైతు కోణంలో ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా రైతుభరోసా రాలేదు. సకాలంలో వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Also Read: Laptop Deals: బ్రాండెడ్ ల్యాప్‌టాప్స్‌పై బంపర్ డిస్కౌంట్స్.. అమెజాన్‌లో ముగియనున్న ఆఫర్స్.. త్వరపడండి

Related News

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ వ్యవహారం.. నోరు విప్పిన తెలంగాణ బీజేపీ.. రెండు పార్టీలు రియాక్షన్ ఎందుకు?-చీఫ్ రామచందర్ రావు

Hyderabad: గుత్తా సుఖేందర్‌రెడ్డి చిట్ చాట్.. పవన్ భాష తీరు సరిగా లేదు

వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

అమెరికా ప్రమాదానికి గురైన మధుయాష్కీ భార్య.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు, అసలు ప్రమాదం ఎలా జరిగింది?

పాలమూరు ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్.. ఏ నిమిషానికి ఎక్కడ ఉంటారంటే?

Big Stories

×