Lasith Malinga: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament) సూపర్ 8 లో భాగంగా నిన్న న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ ( New Zealand vs Pakistan) మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు అయిన సంగతి తెలిసిందే. వర్షం ( Rain) కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం సమీపంలో విపరీతమైన వర్షం పడింది. వర్షం ఏ మాత్రం తగ్గకపోవడంతో న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐసీసీ ప్రకటన చేసింది. అలాగే పాకిస్తాన్ అటు న్యూజిలాండ్ జట్లకు చెరో పాయింట్ ఇచ్చింది. దీనిపై తాజాగా శ్రీలంక మాజీ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ( LASITH MALINGA) సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్షం పడడం వల్ల పాకిస్తాన్ లాభపడిందని తెలిపారు. దానివల్ల ఉచితంగానే ఒక పాయింట్ సంపాదించుకుందని, వర్షం పడకపోతే పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయేదని బాంబు పేల్చారు లసిత్ మలింగ.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సూపర్ 8 లో భాగంగా నిన్న న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. కొలంబోలోని ప్రేమ దాస స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ నిన్న రాత్రి 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయింది. మ్యాచ్ ప్రారంభం అయ్యే సమయానికి అందుకున్న వర్షం, దాదాపు మూడు గంటల పాటు పడింది. దీంతో మ్యాచ్ ఆడడానికి ఎలాంటి అనుకూల పరిస్థితులు కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రద్దు చేస్తూ అధికారిక ప్రకటన చేసింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్.
ఇందులో భాగంగానే న్యూజిలాండ్ అలాగే పాకిస్తాన్ రెండు జట్లకు చెరో పాయింట్ దక్కింది. అయితే ఈ అంశంపై తాజాగా శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిద్ మలింగ స్పందించారు. వర్షం పడడం వల్ల పాకిస్తాన్ కు లాభం చేకూరిందని వెల్లడించారు. వర్షం పడకపోయి ఉంటే న్యూజిలాండ్ చేతిలో పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయేదని పరువు తీశారు లసిద్ మలింగ. ప్రస్తుతం న్యూజిలాండ్ ఉన్న ఫామ్ లో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయేదని వెల్లడించారు. ఆ వరుణ దేవుడు కాపాడాడు కాబట్టి… పాకిస్తాన్ కు ఉచితంగానే ఒక పాయింట్ దక్కిందని వెల్లడించారు. లేకపోయి ఉంటే న్యూజిలాండ్ కు రెండు పాయింట్లు వెళ్లేవన్నారు. అప్పుడు పాకిస్తాన్ సెమీ ఫైనల్ దూరం కావాల్సి వచ్చేదని తెలిపారు.
టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో భాగంగా నిన్న న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య సూపర్ 8 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కు ఒకే ఒక పాయింట్ దక్కింది. ఇక ఈ సూపర్ 8లో మరో రెండు మ్యాచ్ లు కచ్చితంగా పాకిస్తాన్ గెలవాలి. లేదా ఒక మ్యాచ్ గెలిచినా, ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడాల్సి ఉంటుంది.
🚨 MASSIVE STATEMENT BY LASITH MALINGA ON PAKISTAN TEAM 🚨
Lasith Malinga said…🗣️
"Pakistan benefited from the cancellation of the match. They were supposed to lose anyway, but they took one free point. New Zealand suffered the loss, as they were supposed to get two points… pic.twitter.com/dABtpRutEr
— lndian Sports Netwrk (@IS_Netwrk29) February 22, 2026