E-Paper
Advertisement

యాష్‌ ప్రాణాలకు ముప్పు… పికాచూ చేసిన పోరాటం చూస్తే ఎమోషనల్‌ అవ్వాల్సిందే… స్ట్రీమింగ్ తెలుగులోనే

యాష్‌ ప్రాణాలకు ముప్పు… పికాచూ చేసిన పోరాటం చూస్తే ఎమోషనల్‌ అవ్వాల్సిందే… స్ట్రీమింగ్ తెలుగులోనే
Advertisement

Animated Adventure Movie: చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఎంతగానో అలరించే క్యూట్ ‘పోకిమాన్’ (Pokemon) వరల్డ్ నుంచి వచ్చిన ఒక ఎమోషనల్ అండ్ అడ్వెంచరస్ మాస్టర్‌పీస్ ‘పోకెమాన్ ది మూవీ ఐ చూజ్ యూ’ (I Choose You! Pokemon the Movie). పోకిమాన్ ప్రేమికులకు ఈ సినిమా ఒక సరికొత్త నాస్టాల్జిక్ అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా హీరో యాష్ (Ash), అందరి ఫేవరెట్ పికాచూ (Pikachu) మధ్య ఉండే ఫ్రెండ్షిప్, బాండింగ్‌ను ఈ చిత్రంలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో కూడా అందుబాటులో ఉండటం విశేషం. చిన్నప్పుడు పోకిమాన్ సిరీస్‌ను చూసి ఎంజాయ్ చేసిన వాళ్లకు పాత జ్ఞాపకాలను గుర్తుచేసేలా, కొత్తగా చూసేవాళ్లకు కూడా స్నేహం విలువను అర్థమయ్యేలా ఈ కథ సాగుతుంది. మరి ఈ యానిమేషన్ అడ్వెంచర్ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ ఏ ఓటీటీలో అంటే…

కథలోకి వెళ్తే…

ప్రపంచంలోనే గ్రేటెస్ట్ పోకిమాన్ మాస్టర్ కావాలనే లక్ష్యంతో బయలుదేరుతాడు యాష్. తన పదో పుట్టినరోజున నిద్రలేవడం ఆలస్యం కావడంతో, ప్రొఫెసర్ ఓక్ దగ్గర తనకు నచ్చిన పోకిమాన్‌ను ఎంచుకునే అవకాశం కోల్పోతాడు. చివరికి అతడికి ఎలక్ట్రిక్ పవర్ ఉన్న పికాచూ తోడవుతుంది. అయితే మొదట్లో వీరిద్దరి మధ్య అసలు స్నేహమే కుదరదు. యాష్ మాట వినడానికి పికాచూ ఇష్టపడదు. పోకే బాల్‌లో ఉండటానికి కూడా ఒప్పుకోదు. కానీ ప్రయాణం మొదలైన తర్వాత ఎదురయ్యే ప్రమాదాలు, సవాళ్లు వీరిద్దరినీ క్రమంగా దగ్గర చేస్తాయి. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంత బలమైన బంధం ఏర్పడుతుంది.

Advertisement

ఒకరోజు యాష్, పికాచూ ప్రయాణిస్తున్న సమయంలో స్పియరో అనే పోకిమాన్ల గుంపు వారిపై దాడి చేస్తుంది. ఆ సమయంలో ఆకాశంలో ఎగురుతున్న లెజెండరీ పోకిమాన్‌ హో-ఓ కనిపిస్తుంది. దాని రెక్క నుంచి పడిన రెయిన్‌బో వింగ్ యాష్ చేతికి వస్తుంది. ఎప్పటికైనా హో-ఓను కలవాలని యాష్, పికాచూ నిర్ణయించుకుంటారు. అక్కడి నుంచి వారి అసలు సాహసయాత్ర మొదలవుతుంది. ఈ ప్రయాణంలో యాష్‌కు వెరిటీ, సోరెల్ అనే మరో ఇద్దరు ట్రైనర్లు పరిచయమవుతారు. వీరంతా కలిసి హో-ఓ కోసం వెతుకుతుంటారు. దారిలో ఓ వదిలి వేయబడిన చార్మాండర్ కనిపిస్తుంది. దాని పాత ట్రైనర్ క్రాస్ దాన్ని బలహీనమైన పోకిమాన్‌ అంటూ వదిలేసి వెళ్లిపోతాడు.

యాష్ మాత్రం దానికి ఆశ్రయం కల్పించి, దాన్ని తన ప్రయాణంలో భాగం చేసుకుంటాడు. ఇక్కడి నుంచి క్రాస్‌తో యాష్‌కు పోటీ మొదలవుతుంది. అయితే, హో-ఓను చేరుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న యాష్‌కు ఒక దశలో ఓటమి ఎదురవుతుంది. ఆ బాధలో పికాచూను కూడా తక్కువ చేసి మాట్లాడతాడు. కానీ పికాచూతో తనకున్న బంధం ఎంత విలువైనదో అతడికి అర్థమవుతుంది. మరోవైపు, రెయిన్‌బో వింగ్‌ను దక్కించుకోవాలనే క్రాస్ ప్రయత్నం వల్ల పరిస్థితులు ప్రమాదకరంగా మారతాయి. మార్షాడో పోకిమాన్‌ ప్రభావంతో పోకెమాన్‌లు అదుపు తప్పి దాడులకు దిగుతాయి. ఒక కీలకమైన సందర్భంలో యాష్ ప్రాణాలకే ప్రమాదం ఎదురవుతుంది. తన మాస్టర్‌ను కాపాడటానికి పికాచూ చేసే పోరాటం ఈ సినిమాలో అత్యంత భావోద్వేగభరితమైన ఘట్టం. యాష్‌ను కోల్పోతున్నాననే బాధలో పికాచూ చూపించే ప్రేమ, తన స్నేహితుడి కోసం అది ఎంతటి ప్రమాదానికైనా సిద్ధపడే తీరు ప్రేక్షకుల మనసును తాకుతాయి.

తెలుగులోనే చూడవచ్చు 

Advertisement

‘పోకెమాన్ ది మూవీ ఐ చూజ్ యూ’ జియో హాట్‌స్టార్ (JioHotstar)లో అందుబాటులో ఉంది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అందుబాటులో ఉంది. చిన్నపిల్లలతో కలిసి చూడటానికి, మీ చిన్ననాటి పోకిమాన్ జ్ఞాపకాలను మళ్లీ ఆస్వాదించడానికి ఈ సినిమాను వీకెండ్‌లో ట్రై చేయండి. దర్శకుడు కునిహికో యుయామా (Kunihiko Yuyama) తెరకెక్కించిన ఈ బ్యూటిఫుల్ యానిమేటెడ్ అడ్వెంచర్‌ మూవీని ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయవచ్చు.

Read Also: సైంటిస్ట్‌ గా మారిన గొర్రె… ప్రయోగం బెడిసికొట్టి ఊర్లోకి వచ్చే భయంకరమైన మృగం… హాలోవిన్ అంతా రచ్చ రచ్చ

Tags

Related News

సముద్రంలో మునిగే యుద్ధనౌక… సైనికుల రక్తం కోసం వెంటాడే భారీ షార్క్‌… తెలుగులోనే ఈ గుండె జారిపోయే సర్వైవల్ థ్రిల్లర్

దేవుడిని పరిచయం చేయడానికెళ్ళి డైరెక్ట్ గా దేవుడి దగ్గరకే… నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా

నవలల్లో రాసిన నిధి కోసమే రచయిత్రి కిడ్నాప్‌… అడవిలోకి వెళ్ళాక ఒక్కొక్కరికీ చుక్కలు

30 సెకన్ల ఇంధనంతో చంద్రుడిపై ల్యాండింగ్‌… ప్రాణాలకు తెగించి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చేసిన ప్రయాణం… మస్ట్ వాచ్ మూవీ

అప్పుల వేటలో బలి… కొడుకు కోసం ఆవేదన… కన్నీళ్లు పెట్టించే కథ

ఖైదీ అనుకుంటే కాలయముడే… సీక్రెట్ జైల్లో ఊచకోత… బ్లడీ బ్లడ్ బాత్

ఇన్నాళ్లూ తాజ్‌మహల్‌ గురించి మనం చదివింది నిజమేనా ? పుస్తకాలలో చెప్పని నిజాలు… ఈ కోర్టు రూమ్ డ్రామాను డోంట్ మిస్

Big Stories

Advertisement
×