Medchal Tragedy: ఇంట్లో శుభకార్యం కోసం టెంట్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది తీవ్ర విషాదం చోటు చేసుకుంది. టెంటు వేస్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే ఇవద్దరి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారరు. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి.
మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎల్లంపేట్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో ఫంక్షన్ నిర్వహించేందుకు టెంట్ ఏర్పాటు చేస్తున్న సమయంలో విద్యుదాఘాతం సంభవించి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. టెంట్ ఏర్పాటు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగలడంతో ఇద్దరికీ విద్యుత్ షాక్ తగిలినట్లు మరణించినట్లు సమాచారం.
ఈ సంఘటనతో విద్యుదాఘాతానికి గురైన వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను గడ్డం గోపి, లబండీ బాబుగా గుర్తించారు. ఈ ఘటనతో ఎల్లంపేట్ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: ఏపీకి మరో తుఫాను ముప్పు.. బంగాళాఖాతంలో అల్పపీడనం! బుధవారానికి వాయుగుండంగా మారే ఛాన్స్