BigTV English

Harishrao: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ.. అందులో ఏం రాశారంటే..?

Harishrao: సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ.. అందులో ఏం రాశారంటే..?

Harishrao writes Open Letter to CM Revanth Reddy: ప్రస్తుతం అధికార, విపక్ష నేతల మధ్య రాజకీయ మాటల యుద్ధం కొనసాగుతున్న పలు అంశాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రభుత్వం విమర్శలు చేస్తున్నారు. ఇటు వారి విమర్శలకు ధీటుగా ప్రతి విమర్శలు చేస్తున్నారు అధికార పక్ష నేతలు. మొత్తంగా గత కొద్ది రోజుల నుంచి వాడివేడి రాజకీయ వాతావరణం నెలకొన్నది రాష్ట్రంలో. అయితే, తాజాగా కూడా మాజీ మంత్రి హరీశ్ రావు, సిద్ధిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు. పశు వైద్యశాలల్లో మందుల కొరతపై ఆయన సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.


Also Read: రుణమాఫీ తప్పెవరిది? పదేళ్లు ఏం చేశారు..? ఆ తప్పులు దాచి నేడు ఆరోపణలు

పశువైద్య సంచార వాహన సేవల్లో అంతరాయం కలుగుతోంది. మూగజీవుల మౌనరోదనను తొలగించడంలో ప్రభుత్వం విఫలమైంది. వాటి సంరక్షణపై నిర్లక్ష్యం వహించడం శోచనీయం. పశు వైద్యశాలల్లో గత 9 నెలల నుంచి మందుల కొరత తీవ్రంగా ఉన్నది. సకాలంలో వైద్యం అందక పశువులు మృత్యవాతపడుతున్నాయి.


Also Read: డోంట్ వర్రీ.. అందరికీ మాఫీ చేస్తాం.. కటాఫ్ డేట్ పెడ్తాం: మంత్రి పొంగులేటి

అనారోగ్యం పాలైన మూగజీవుల వద్దకే వైద్య సిబ్బంది వెళ్లి తక్షణ చికిత్స అందించేందుకు 1962 నెంబర్ తో పశువైద్య సంచార వాహనాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గత ప్రభుత్వం తీసుకున్న ఈ విధానం దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. సంచార వాహనాల్లో మందుల కొరత కారణంగా అత్యవసర పరిస్థితుల్లో మూగజీవుల ప్రాణాలు కాపాడాలనే సదాశయం నీరుగారిపోతుంది. ఇప్పటికే గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వదిలేశారు. చేపల పంపిణీని అటకెక్కించారు. 1962 పశువైద్య సంచార వాహనాల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు కూడా సకాలంలో జీతాలు ఇవ్వడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే పశు వైద్యశాలల్లో మందులు అందుబాటులో ఉంచాలి’ అంటూ అందులో హరీశ్ రావు పేర్కొన్నారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Big Stories

×