Weather update: గడిచిన నెలలో భారీ వర్షాలు దంచికొట్టాయి. ఆగస్టు రెండో వారంలో మొదలైన వర్షాలు.. మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ చివరి వారంలో కుండపోత వానలు పడ్డాయి. ముఖ్యంగా కామారెడ్డి, జగిత్యాల, మెదక్, సిరిసిల్ల, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. ఏపీలో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. భారీ వర్షాలకు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కామారెడ్డి జిల్లాలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఇళ్లు నేలమట్టం అయ్యాయి. అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు కీలక అప్టేట్ ఇచ్చారు.
ఈ జిల్లాల్లో కుండపోత వర్షం..
రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉత్తర, సెంట్రల్, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల, కరీంనగర్, సిద్దిపేట, మెదక్, యాదాద్రి భువనగరి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. హైదరాబాద్ లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది.
ALSO READ: Civils: మీరు డిప్రెషన్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే సివిల్స్ సాధించడం చాలా ఈజీ.. ఎలానో తెలుసా?
మరి కాసేపట్లో ఈ ఏరియాల్లో భారీ వాన
రాబోయే 2-3 గంటల్లో ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాబోయే మూడు గంటల్లో హైదరాబాద్ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే నిర్మల్ జిల్లాల్లో పలు చోట్ల వర్షం పడుతోందని అధికారులు తెలిపారు.
ALSO READ: IOCL Jobs: ఇంటర్, డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. మంచివేతనం, దరఖాస్తు కొన్ని రోజులే గడువు
సాయంత్రం వేళ బయటకు వెళ్లొద్దు…
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగులు పడే అవకాశం ఉండడంతో చెట్ల కింద నిలబడొద్దని చెబుతున్నారు. రాత్రి సమయంలో కూడా భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. అత్యవసరం అయితేనే తప్ప బయటకు రావొద్దని అధికారులు వివరించారు.