BigTV English

Bigg Boss 9 Telugu: సంజనా మొండితనం.. దెబ్బకు లేడీ కంటెస్టెంట్స్ కి షాక్!

Bigg Boss 9 Telugu: సంజనా మొండితనం.. దెబ్బకు లేడీ కంటెస్టెంట్స్ కి షాక్!

Bigg Boss 9 Telugu: టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున (Nagarjuna ) మరొకసారి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు తాజాగా స్టార్ట్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. సెప్టెంబర్ 7వ తేదీన అత్యంత ఘనంగా ప్రారంభమైన ఈ షో ఇప్పుడు రెండవ రోజుకు చేరుకుంది. అందులో భాగంగానే తాజాగా రెండో ఎపిసోడ్ కి సంబంధించిన రెండవ ప్రోమోని మేకర్స్ రిలీజ్ చేయగా.. ఇందులో సంజన మొండితనంతో మిగతా లేడీ కంటెస్టెంట్స్ అందరూ ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు అని తెలుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


ఈవారం సంజనపై వేటు తప్పదా..?

నిన్నటి ఎపిసోడ్ రివ్యూ విషయానికి వస్తే.. సంజన అబద్ధాలు మాట్లాడుతోందని, బ్యాక్ పిచింగ్ చేస్తోంది అని మిగతా కంటెస్టెంట్స్ అంతా ఆమెపై కంప్లైంట్ చేశారు. దీనికి తోడు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో ఒకరిని నామినేట్ చేయమని చెప్పగా ఓనర్స్ అంతా కలిసి సంజనాను నామినేట్ చేశారు. ఈరోజు ఈమె చేస్తున్న ప్రవర్తనకు మొదటి వారమే ఎలిమినేట్ అయ్యేలా కనిపిస్తోందని నేటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన ప్రోమో విషయానికి వస్తే.. శ్రేష్టి వర్మ బొటన వేలికి గాయం అయిన విషయం తెలిసిందే. స్పూన్ సహాయంతో భోజనం చేస్తూ ఉండగా.. కామనర్స్ అయినా ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ ఆమె ప్లేట్ తీసుకొని తినే ప్రయత్నం చేశారు. అయితే శ్రేష్టి వర్మ ఇది మీరు తినొద్దు అని చెబితే.. ప్రియా శెట్టి, శ్రీజా దమ్ము ఎవరు చెప్పారు మాకు చెప్పలేదే అంటారు. ఇక భోజనం పై మాస్క్ మాన్ హరీష్ మాట్లాడుతూ.. ఒక్కొక్కసారి మా ఇంట్లో 24 గంటల తర్వాత కూడా ఆ భోజనాన్ని ఫ్రిజ్లో పెట్టుకొని మళ్ళీ హీట్ చేసుకుని తింటాము అని చెబితే.. దానికి తనుజ మాట్లాడుతూ.. మీకు తెలుసు మీ ఇంట్లో ఎలా ఉంటారో? ఎలా తింటారో? ఈ ఇంట్లో ఎలా ఉంటారో ఎలా తింటారో మాకు తెలియదు కదా అంటూ కౌంటర్ వేసి.. ఏడుస్తూ వెళ్ళిపోయింది.

ALSO READ:Film industry: బడ్జెట్ తక్కువ.. లాభమెక్కువ.. రికార్డు సృష్టించిన చిత్రాలివే!


సంజన మొండితనానికి లేడీ కంటెస్టెంట్స్ బలి..

ఇక తర్వాత ఫ్లోరా షైనీ.. సంజనా దగ్గరికి వచ్చి మీరు మీ షాంపూ, కండిషనర్, ఫేస్ వాష్ అన్ని అక్కడే వాష్ రూమ్ లోనే ఉంచేశారు. నేను తీసుకురావడానికి సర్వెంట్ కాదు అంటూ తెలిపింది. ఇక దానికి సంజన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆమె ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఆ తర్వాత సంజన మాట్లాడుతూ. స్నానం చేసే రూమ్ లో స్నానానికి సంబంధించిన వస్తువులు పెట్టకుండా ఇంకెక్కడ పెట్టాలి.. తల మీద గాని పెట్టుకుంటామా అంటూ ప్రశ్నించింది. ఇక దీనికి కామనర్ మాట్లాడుతూ.. నేను చెబుతున్నాను.. వెళ్లి రిమూవ్ చేయండి అని అడిగితే.. దానికి సంజన మొండిగా ప్రవర్తిస్తూ నేను రిమూవ్ చేయను అని తెలిపింది. దానికి డిమాండ్ కామనర్ మాట్లాడుతూ.. ఈమె కారణంగా నేను లేడీ కంటెస్టెంట్స్ అందరినీ బ్లాక్ చేస్తున్నాను అంటూ ఫైర్ అయ్యారు .ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

Related News

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు ఫస్ట్ వీక్ ఎలిమినేషన్.. ఆమెను టార్గెట్ చేస్తున్నారా?

Bigg Boss 9 Telugu Day 2: బ్యాక్ బిచ్చింగ్ లో అంత బూతుందా.. సంజన ఓవరాక్షన్, నామినేషన్ లో టార్గెటైన ‘బుజ్జిగాడు‘ భామ

Bigg Boss season 9 Day 2: షాంపూ కోసమో సబ్బు కోసమో, మీలో మీరు కొట్టుకు చావండి, మమ్మల్ని మాత్రం ఎంటర్టైన్ చేయండి

Bigg Boss 9 Telugu: ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ సెలబ్రిటీల నుంచే.. వారిద్దరికే నెగిటివిటీ ఎక్కువ.. హౌజ్ వీడేది ఆమెనే!

Bigg Boss 9 Telugu Day 2: బ్రేకింగ్.. హౌజ్ లో రితూ చౌదరికి తీవ్ర గాయాలు.. బయటకు రాక తప్పదా?

×