BigTV English

Rain Alert: అతిభారీ వర్ష సూచన.. రాష్ట్రంలో రెడ్ అలర్ట్.. బీకేర్ ఫుల్..

Rain Alert: అతిభారీ వర్ష సూచన.. రాష్ట్రంలో రెడ్ అలర్ట్.. బీకేర్ ఫుల్..
Today rain news in telangana

Today rain news in telangana(Today’s state news): మూడు రోజులుగా వాన దంచికొడుతోంది. నాన్‌స్టాప్ రెయిన్‌తో తెలంగాణ తడిచిముద్దవుతోంది. హైదరాబాద్ ట్రాఫిక్ జామ్‌లతో ఆగమాగం అవుతోంది. జిల్లాల్లో కుండపోత వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. పాత ఇళ్లు నేలమట్టం. శనివారం ఉదయం కాస్త గ్యాప్ ఇచ్చింది. హమ్మయ్యా.. అనుకుంటుండగానే.. వాతావరణశాఖ మరో బ్రేకింగ్ న్యూస్ చెప్పింది. వాన వెలిసిందని అప్పుడే సంబరపడిపోకండని.. మరికొన్ని గంటల్లో అతిభారీ వర్షం కురుస్తుందని అలర్ట్ జారీ చేసింది. భారీ కాదు.. అతిభారీ వర్షం అట. అందుకే, బీఅలర్ట్.


ఈనెల 24న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్టు భారత వాతావరణశాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌తో పాటు 13 జిల్లాలకు ఆరెంజ్‌, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

హైదరాబాద్‌‌లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో హుస్సేన్ సాగర్ నిండా నిండింది. నాలాలన్నీ ఓవర్ ఫ్లో అవుతున్నాయి. పలు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. పలు అపార్ట్‌ మెంట్లలోకి నీళ్లు చేరాయి. తెలంగాణ వ్యాప్తంగా చెరువులు, కుంటలు, కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ నిండుకుండలా జలకళను సంతరించుకుంది.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×